AP Students at Stanford: అడవి TO అమెరికా... ఆంధ్రప్రదేశ్ గిరిజన అడవి బిడ్డలకు అరుదైన అవకాశం!!
ఆంధ్రప్రదేశ్ గిరిజన అడవి బిడ్డలకు అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, విద్యారంగంపై తీసుకువచ్చిన నిర్ణయాత్మక మార్పులు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. అమెరికాలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందాయి.
నానో టెక్నాలజీ సింపోజియం
మార్చి5వ తేదీన వాషింగ్టన్ లో నానో టెక్నాలజీ సింపోజియం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి పది మంది గిరిజన విద్యార్ధులను తీసుకురావాలని ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ కు అమెరికాలోని నేషనల్ నానో టెక్నాలజీ కో ఆర్డినేషన్ ఆఫీస్ డైరెక్టర్ బ్రాండెన్ బ్రో లేఖ రాశారు.
నానో టెక్నాలజీ పై పరిశోధనలు, ఫలితాలు వంటి అనేక అంశాలపై మాట్లాడేందుకు అవగాహన పెంచుకునేందుకు ఈ సిపోజియం దోహదపడుతుందని పేర్కొన్నారు. దీనికి ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ ఆర్తి ప్రభాకర్, మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సలహాదారు నీల్ లేన్ వంటి ప్రముఖులను గిరిజన విద్యార్ధులు కలిసే అవకాశం ఉంటుందని ఆహ్వానంలో పేర్కొన్నారు.
సీఎస్ డబ్ల్యూ -68
అలాగే మరో ముఖ్యమైన కార్యక్రమం అయిన ఐక్యరాజ్య సమితిలో మార్చి 11 నుంచి 22 వరకు జరగనున్న కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ 68వ వార్షికోత్సవం (సీఎస్ డబ్ల్యూ -68) లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పదిమంది గిరిజన విద్యార్ధుల బృందాన్ని పంపాలని మరొక ఆహ్వానం అందింది. సిఎస్ డబ్ల్యూ 68 లో భాగంగా నిర్వహించే సమావేశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు, విధానాలు, సవాళ్లు, కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నారు.
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటిలో జరిగే ఉమెన్ ఇన్ డేటా సైన్స్ కార్యక్రమంలో
దాంతో పాటు మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటిలో జరిగే ఉమెన్ ఇన్ డేటా సైన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గిరిజన విద్యార్ధులకు అవకాశం లభిందింది. డేటా సైన్స్ రంగంలో తమ పూర్తి సామర్ధ్యాన్ని చేరుకోవడానికి ఈ సమావేశం తోడ్పాటు అందిస్తుంది. సమాజంలో గౌరవం, సహకార, కనెక్టివిటీ, పెంపొందించడం ద్వారా గ్లోబల్ స్కేల్ లో మహిళల అత్యుత్తమ పనిని ఎలివేట్ చేసుకోవచ్చు. విడ్స్ కమ్యునిటీ ప్రోగాం, కంటెంట్ , అందరి ఆలోచనలు ప్రపంచంతో భాగస్వామ్యం చేయబడతాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పదిమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను యూఎన్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా విద్యార్ధుల బృందాన్ని అమెరికాకు పంపించగా ఐక్యరాజ్య సమితిలో జరిగిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పాల్గొని, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో జరుగుతున్న అభివృద్దిని అంతర్జాతీయ వేదికపై చెప్పారు విద్యార్ధులు.
యూఎస్ డిపార్ట్ మెంట్ స్టేట్ లో పలువురు మేధావులతో భేటీ అయ్యారు. అంతర్జాతీయ మానిటరింగ్ ఫండ్ కార్యాలయం సందర్శించి, వైట్ హౌస్ లో పర్యటించి ఏపీలో జరుగుతున్న అభివృద్దిని ఎల్లలుదాటి చాటి చెప్పారు మన విద్యార్ధులు. పర్యటన ముగించుకొని వచ్చిన విద్యార్ధులను ఐక్యరాజ్య సమితి మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ లను సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.