Andhra Pradesh Govt Jobs: 2,635 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అనంతపురం: ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాల సాధనలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టే నేపథ్యంలో పూర్తి స్థాయి రెగ్యులర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంతతో పాటు జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,635 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఎస్కేయూ, జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో మొత్తం 564 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి హేతుబద్ధీకరీణ (రేషనలైజేషన్) పూర్తయింది.
చదవండి: Job Opportunities: సేఫ్టీ కోర్సుతో విస్తృత ఉపాధి అవకాశాలు
ఎస్కేయూకు అదనపు పోస్టులు
ఎస్కేయూకు రావాల్సిన పోస్టుల కంటే అదనంగా మరిన్ని దక్కాయి. మొత్తం 268 పోస్టులు భర్తీ చేయనుండగా ఇందులో 35 ప్రొఫెసర్, 65 అసోసియేట్, 168 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అలాగే జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో మొత్తం 220 అసిస్టెంట్, 50 అసోసియేట్, 26 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో జేఎన్‌టీయూ పులివెందుల క్యాంపస్ కళాశాలలో 81 పోస్టులు భర్తీ చేయనుండగా ఇందులో ఆరు ప్రొఫెసర్ పోస్టులు, 12 అసోసియేట్ ప్రొఫెసర్, 63 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, కలికిరి క్యాంపస్‌కు సంబంధించి 81 పోస్టుల భర్తీకి గాను ఆరు ప్రొఫెసర్, 14 అసోసియేట్ ప్రొఫెసర్, 61 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. ఇప్పటి వరకూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఈ నెలలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. రాత పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇందులో మెరిట్ దక్కించుకున్న వారికి ఆయా యూనివర్సిటీల పరిధిలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి, నవంబర్ చివరి నాటికి ఎంపికై న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.
చదవండి: Illegal Transfers of Teachers: తెలంగాణ లో ఉపాధ్యాయ అక్రమ బదిలీలు
వర్సిటీల్లో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ నవంబర్ చివరి నాటికి ఎంపిక జాబితా ప్రకటన ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఎస్కేయూలో 268, జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో 296 పోస్టుల భర్తీ