Skip to main content

India: 22.2 కోట్ల మంది పిల్లలపై పేదరికం, విపత్తుల ప్రభావం

భారత్‌లో 51 శాతం మంది చిన్నారుల(22.2 కోట్లు) జీవితాలపై పేదరికం, పర్యావరణ సంక్షోభాలు ప్రభావం చూపిస్తున్నట్లు ‘జెనరేషన్‌ హోప్‌ : 2.4 బిలియన్‌ రీజన్స్‌ టు ఎండ్‌ ది గ్లోబల్‌ క్లైమేట్‌ అండ్‌ ఇన్‌ ఈక్వాలిటీ క్రైసిస్‌’ నివేదిక పేర్కొంది.
In India, children face double threat of climate disaster, poverty

ఆసియా వ్యాప్తంగా ఈ సంఖ్య 35 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. బాలల హక్కుల సంస్థ ‘సేవ్‌ ది చిల్డ్రన్‌ ’.. బ్రస్సెల్‌లోని వ్రిజ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కలిసి ఈ నివేదికను వెలువరించారు. దీని ప్రకారం–కంబోడియాలో అత్యధికంగా 72 శాతం పిల్లలు పేదరికం,పర్యావరణ సంక్షోభాల జంట ముప్పును ఎదుర్కొంటున్నారు.ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్‌(64 శాతం), అఫ్గానిస్థాన్‌ (57 శాతం) చిన్నారులు ఉన్నారు. సంఖ్యపరంగా భారత్‌ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. భారత్‌లో 35.19 కోట్ల మంది పిల్లలపై ఏటా ఒక్క వాతావరణ వైపరీత్యమైనా ప్రభావం చూపుతోంది. పేదరికం కారణంగా వారిలో కొందరికి దీన్నుంచి రక్షించుకోవడానికి తగిన వనరులు లేవు.

October Weekly Current Affairs (International) Bitbank: Which country scored least on the Global Hunger Index in 2022?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Nov 2022 06:05PM

Photo Stories