Skip to main content

Gambia: దగ్గు మందుతో చిన్నారుల మృత్యువాత

Children die of cough medicine

ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు మందు తాగిన 66 మంది చిన్నారులు మృతిచెందారు. ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఉన్న మైడెన్‌ ఫార్మసీ కంపెనీకి చెందిన నాలుగు రకాల దగ్గు సిరప్‌లపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దగ్గు సిరప్‌ల గురించి డీసీజీఐకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిర్యాదు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ సిరప్‌లలో డైఇథలీన్‌ గ్లైకాల్, ఇథలీన్‌ గ్లైకాల్‌లు మోతాదుకు మించి ఉన్నట్లు గుర్తించారు. ఈ పదార్ధాల వల్ల మనుషులకు ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ తెలిపారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Oct 2022 03:38PM

Photo Stories