Andhra Pradesh Govt Jobs: వైద్య ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
Sakshi Education
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయకర్త కార్యాలయం పరిధిలో వైద్య ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సుబ్రహ్మణ్య రాజు మంగళవారం తెలిపారు. ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఆవరణలోని జిల్లా ఆస్పత్రుల సమన్వయ కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.
Published date : 19 Oct 2023 12:59PM