Skip to main content

JEE Main 2023 Notification: జేఈఈ మెయిన్‌.. మార్పులివే!!

జేఈఈ-మెయిన్‌..ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని.. ఇతర టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఐఐటీల్లో ప్రవేశానికి జరిపే అడ్వాన్స్‌డ్‌కు కూడా జేఈఈ-మెయిన్‌లో అర్హత తప్పనిసరి! ఇంతటి కీలకమైన జేఈఈ-మెయిన్‌ -2023కు నిర్వాహక సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి, ఏప్రిల్‌ నెలల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ మెయిన్‌-2023 ముఖ్య సమాచారం, కీలక మార్పులు, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
JEE Main 2023 Notification
  • జనవరి 24-31 వరకు తొలి సెషన్‌
  • ఏప్రిల్‌ 6-12 మధ్య రెండో సెషన్‌ పరీక్షలు
  • అర్హతలు, దరఖాస్తు విధానంలో మార్పులు
  • ఇంటర్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి

జేఈఈ-మెయిన్‌ తొలి సెషన్‌ను జనవరి నాలుగో వారంలో, రెండో సెషన్‌ను ఏప్రిల్‌ మొదటి, రెండు వారాల్లో నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. జనవరి, ఏప్రిల్‌లలో రెండు సెషన్లుగా.. జేఈఈ-మెయిన్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా పరీక్ష జరుగనుంది. తొలి సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

అర్హతలు

  • ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ గ్రూప్‌ ఉత్తీర్ణత ఉండాలి. 2021, 2022లో ఇంటర్‌ ఎంపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు; 2023లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

Also Read: JEE Main 2023: ప్రిపరేషన్‌ వ్యూహాలు.. సబ్జెక్ట్‌ వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..

75 శాతం మార్కులు తప్పనిసరి

జేఈఈ-మెయిన్‌-2023 నిబంధనల్లో కీలక మార్పు..ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన. వాస్తవానికి జేఈఈ-మెయిన్‌కు హాజరయ్యేందుకు ఇంటర్మీడియెట్‌ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని మాత్రమే పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎలాంటి ఉత్తీర్ణత శాతం నిబంధనలను పేర్కొనలేదు. కాని జేఈఈ-మెయిన్‌ స్కోర్‌ ఆధారంగా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలకు మాత్రం సదరు ఇన్‌స్టిట్యూట్‌ల నిబంధనల మేరకు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అని పేర్కొన్నారు. అంటే.. ఒక విధంగా..జేఈఈ -మెయిన్‌ దరఖాస్తు సమయంలోనే ఇంటర్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారే అర్హులుగా నిర్దేశించారని పేర్కొనచ్చు.

ఛాయిస్‌ విధానం కొనసాగింపు

జేఈఈ-మెయిన్‌-2023 విషయంలో అభ్యర్థులకు ఊరటనిచ్చే అంశం.. ఛాయిస్‌ విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు పేర్కొనడం. పేపర్‌-1, పేపర్‌-2ఎ, పేపర్‌-2బి పేర్లతో నిర్వహించే పరీక్షలో.. 2021లో తొలిసారిగా ఛాయిస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అప్పటికి కోవిడ్‌ పరిస్థితులు, పలు బోర్డ్‌లు సిలబస్‌ కుదించి ఇంటర్, తత్సమాన పరీక్షలు నిర్వహించడంతో.. ఛాయిస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. 2023 సెషన్స్‌లో కూడా ఈ విధానాన్ని కొనసాగించడం విశేషం. 

Also Read: JEE Main Guidance

పరీక్ష, ఛాయిస్‌ స్వరూపం
పేపర్‌-1(బీటెక్, బీఈ) ఇలా

బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు.  వివరాలు..

సబ్జెక్ట్‌ సెక్షన్‌-ఎ ప్రశ్నల సంఖ్య సెక్షన్‌-బి ప్రశ్నల సంఖ్య మార్కులు
మ్యాథమెటిక్స్‌ 20 10 100
ఫిజిక్స్‌ 20 10 100
కెమిస్ట్రీ 20 10 100
మొత్తం 90 ప్రశ్నలు 300 మార్కులు
  • సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది.
  • సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.సెక్షన్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. 0.25 శాతం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.

Also Read: జేఈఈ మెయిన్ పేపర్-2 విజయానికి వ్యూహం...

పేపర్‌-2ఎ బీఆర్క్‌ పరీక్ష

నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు.

సబ్జెక్ట్‌ ఎంసీక్యూ ప్రశ్నల సంఖ్య న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నల సంఖ్య మార్కులు
మ్యాథమెటిక్స్‌ 20 10 100
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 50 - 200
డ్రాయింగ్‌ టెస్ట్‌ 02 - 100
మొత్తం ప్రశ్నలు 82 ప్రశ్నలు 400 మార్కులు
  • మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ఎంసీక్యూల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. అదే విభాగంలో న్యూమరికల్‌ ప్రశ్నలలో పది ప్రశ్నలకు గాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. 
  • డ్రాయింగ్‌ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్‌ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.

Also Read: JEE Main Previous Papers

పేపర్‌-2బి బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష

బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. వివరాలు..

సబ్జెక్ట్‌ ప్రశ్నల సంఖ్య న్యూమరికల్‌ ప్రశ్నల సంఖ్య మార్కులు
మ్యాథమెటిక్స్‌ 20 10 100
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 50 - 200
ప్లానింగ్‌ 25 - 100
మొత్తం ప్రశ్నలు 105 ప్రశ్నలు    400 మార్కులు
  • మ్యాథమెటిక్స్‌లోని న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. మూడు పరీక్షలకు కేటాయించిన సమయం మూడు గంటలు. 
  • బీఆర్క్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ రెండు పేపర్లకు మూడున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. 

Also Read: JEE Main Model Papers

మెయిన్‌లో మెరిసేందుకు వ్యూహాలివే

జేఈఈ-మెయిన్‌-2023 మొదటి సెషన్, రెండో సెషన్‌ తేదీలను సైతం ప్రకటించారు. జనవరిలో నిర్వహించే తొలి సెషన్‌కు నెల రోజులు, ఏప్రిల్‌లో నిర్వహించే రెండో సెషన్‌కు మూడున్నర నెలల సమయం అందుబాటులో ఉంది. అభ్యర్థులు మెయిన్‌లో మెరుగైన స్కోర్‌ సాధించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు..

మ్యాథమెటిక్స్‌

ఈ సబ్జెక్ట్‌లో విద్యార్థులు ప్రతి చాప్టర్‌పైనా అవగాహన పెంచుకోవాలి. 3-డి జామెట్రీ;కో ఆర్డినేట్‌ జామెట్రీ;వెక్టార్‌ అల్జీబ్రా;ఇంటిగ్రేషన్‌;కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌; క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌;థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌;పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌; బైనామియల్‌ థీరమ్‌; లోకస్‌ అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. 

ఫిజిక్స్‌

ఫిజిక్స్‌ థియరీతోపాటు న్యూమరికల్‌ అప్రోచ్‌ కలిగిన సబ్జెక్ట్‌గా చెప్పొచ్చు. ఇందులో రాణించాలంటే.. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. వీటితోపాటు సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే.. మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రిపరేషన్‌ సమయంలోనే ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ.. ప్రాక్టీస్‌ చేస్తే న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. 

కెమిస్ట్రీ

మిగతా రెండు సబ్జెక్ట్‌లతో పోల్చితే విద్యార్థులు కాసింత సులభంగా భావించే సబ్జెక్ట్‌ ఇది. ఈ సబ్జెక్ట్‌లోనూ న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి విద్యార్థులు కొన్ని ముఖ్య టాపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కెమికల్‌ బాండింగ్, పిరియాడిక్‌ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై నైపుణ్యాలను పెంచుకోవాలి. మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. 

ఇంటర్‌తో అనుసంధానం

జేఈఈ-మెయిన్‌-2023 తొలి దశకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు.. ఇంటర్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. ఇప్పటికే అభ్యర్థులు సిలబస్‌ను పూర్తి చేసుకుని ఉంటారు. దాని ఆధారంగా జనవరి సెషన్‌కు సన్నద్ధం కావాలి. ఏప్రిల్‌లో నిర్వహించే రెండో సెషన్‌కు జనవరి చివరి వరకు ప్రిపరేషన్‌ సాగించాలి. ఆ తర్వాత బోర్డ్‌ పరీక్షలు, ప్రాక్టికల్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలి. మార్చిలో బోర్డ్‌ పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ మెయిన్‌ రెండో సెషన్‌ ప్రిపరేషన్‌కు పూర్తి సమయం కేటాయించాలి. ఈ సమయంలో అధిక శాతం పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

అడ్వాన్స్‌డ్‌తో అనుసంధానం

అభ్యర్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌తోనూ తమ ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకోవాలి. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2023,జూన్‌ 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఏడాది జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌లోనూ మార్పులు చేశారు. ఇవి మెయిన్‌ సిలబస్‌ అంశాలకు కొనసాగింపుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ను పరిశీలించి మెయిన్, అడ్వాన్స్‌డ్‌ రెండిటిలోనూ కామన్‌గా ఉన్న అంశాలను ఒకే సమయంలో ప్రిపేరవ్వాలి. ఫలితంగా జేఈఈ-మెయిన్‌ రెండో సెషన్‌ ముగిశాక.. అడ్వాన్స్‌డ్‌కు లభించే నెల లేదా నెలన్నర రోజుల సమయంలో అడ్వాన్స్‌డ్‌ అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు అవకాశం లభిస్తుంది.

Also Read: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

జేఈఈ-మెయిన్‌-2023 సమాచారం
తొలి సెషన్‌ (2023 జనవరి) ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2023,జనవరి 12
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: జనవరి మూడో వారంలో
  • జేఈఈ-మెయిన్‌ పరీక్ష తేదీలు: 2023 జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 రెండో సెషన్‌ (2023 ఏప్రిల్‌) ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 2023 ఫిబ్రవరి 23-2023 మార్చి 7 వరకు
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: మార్చి చివరి వారంలో
  • రెండో సెషన్‌ పరీక్ష తేదీలు: 2023 ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు
  • వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in/
     
Published date : 26 Dec 2022 05:19PM

Photo Stories