Skip to main content

Agriculture drone technology: సాగులో డ్రోన్‌ టెక్నాలజీపై శిక్షణ

Agriculture drone technology Training
Agriculture drone technology Training Drone technology demonstration for progressive farmers

అమలాపురం రూరల్‌: వ్యవసాయ సాగులో డ్రోన్‌ టెక్నాలజీతో అన్నదాతకు ఆసరాగా నిలవాలని ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అభ్యుదయ రైతులు, డ్వాక్రా సభ్యులు, వ్యవసాయ డిగ్రీ విద్యార్థులు 134 మందికి డ్రోన్ల వినియోగంపై అవగాహన శిక్షణను కలెక్టర్‌ ప్రారంభించారు.

పాలిసెట్‌ ఉచిత కోచింగ్‌: Click Here

కర్నూలు ట్రిపుల్‌ ఐటీ డిజైన్‌ అండ్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ సాంకేతిక ప్రతినిధులు కృష్ణనాయక్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం 11వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. డీఆర్‌డీఏ పీడీ గాంధీ మాట్లాడుతూ తొలి దశలో 8 డ్రోన్లను జిల్లా సమాఖ్య నిధుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. ఈజిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోసుబాబు, డీపీఎంలు గణపతి, విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయంతోనే

భూసార సంరక్షణ

సహజ సేంద్రియ వ్యవసాయంతోనే భూసార సంరక్షణ, ఆరోగ్య భద్రతతో పాటుగా మానవాళి మనుగడకు భరోసా ఉంటుందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ,ఉద్యాన మార్కెటింగ్‌ రైతు సాధికారత, మున్సిపల్‌, స్వచ్ఛంద సంస్థలు డ్వాక్రా మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లు రైతు బజార్‌ ఎస్టేట్‌ అధికారులు, దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సేంద్రీయ ఉత్పత్తుల సాగు మార్కెటింగ్‌ వినియోగంపై ఆమె సమీక్షించారు.

జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, మార్కెటింగ్‌ అధికారి కె.విశాలాక్షి, దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ సత్యనారాయణ, రైతు సాధికార సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌, కృషివల సంస్థ ప్రతినిధి అడ్డాల గోపాలకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ కేవీవీ ఆర్‌ రాజు, రిసోర్స్‌ పర్సన్‌ పూర్ణిమ, భారతమ్మ పాల్గొన్నారు.

Published date : 09 Apr 2025 08:22AM

Photo Stories