Skip to main content

BRICS: సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం - బ్రిక్స్‌ శిఖరాగ్ర భేటీ తీర్మానం

Respect the Sovereignty of Nations
Respect the Sovereignty of Nations

అన్ని దేశాలు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించుకోవాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు తదితర అంశాలను చర్చించిన బ్రిక్స్‌ దేశాల నేతలు ఆయా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని నొక్కిచెప్పారు. చైనా అధ్యక్షతన జరిగిన ఐదు దేశాల వర్చువల్‌ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. యుద్ధం కారణంగా తలెత్తిన మానవీయ సంక్షోభానికి రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య చర్చలే పరిష్కారమంది. ఈ విషయంలో ఐరాస, రెడ్‌ క్రాస్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రకాలైన ఉగ్రవాదంపై పోరాటానికి కట్టుబడి ఉంటామని తీర్మానించింది. 

Also read: World's most liveable city: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరం ఏదంటే..

వర్చువల్ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ ప్రభావం ఇంకా తొలిగిపోలేదని, దీని నుంచి బయటపడేందుకు బ్రిక్స్‌ దేశాల మధ్య పరస్పర సహకారం సహాయకారిగా ఉంటుందని చెప్పారు. బ్రిక్స్‌ను కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ప్రసంగిస్తూ.... ఏకపక్షంగా కొందరు విధించే ఆంక్షలను, చిన్న కూటముల ఏర్పాటుకు సాగే ప్రయత్నాలను వ్యతిరేంచాలని పిలుపునిచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి విధానాలు, ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 

Also read: Russian Journalists: వేలానికి పెట్టిన నోబెల్‌ శాంతి బహుమతి

ప్రపంచ జనాభాలో 41%,  జీడీపీలో 24%,  వాణిజ్యంలో 16%  బ్రిక్స్‌లోని ఐదు దేశాలదే.

Published date : 24 Jun 2022 04:39PM

Photo Stories