Skip to main content

SSC CPO Final Results: ఎస్సై తుది ఫలితాలు విడుదల, ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..

SSC CPO Final Results

ఢిల్లీ పోలీసు సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించిన తుది ఫలితాలు వెల్లడయ్యాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులు https://ssc.gov.in/api/attachment/uploads/masterData/Results/LIST-1.pdf లింక్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 


పోలీసు, ఆర్మ్‌డ్‌ విభాగంలో మొత్తం 1876 పోస్టుల భర్తీకి జులై 22న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరికి అక్టోబరు 3 నుంచి 5 వరకు పేపర్‌-1 (కంప్యూటర్ ఆధారిత) పరీక్ష నిర్వహించారు. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు (పీఈటీ/ పీఎస్‌టీ) నిర్వహించారు.

ఆ తర్వాత మార్చి 1 నుంచి 20 వరకు సర్టిఫికేట్ల పరిశీలన, మెడికల్ టెస్టులు నిర్వహించారు. వీరిలో 1786 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా,  1710 పోస్టులను పురుషులకు కేటాయించగా, 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతం అందనుంది.

Published date : 06 Apr 2024 03:43PM

Photo Stories