Walk-in Interviews: నిరుద్యోగ యువతకు రేపు జాబ్ మేళా
Sakshi Education
యువతకు ఉపాధి కల్పించే క్రమంలో రేపు ఉపాధి కల్పానాధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో లభించే ఉద్యోగాలు, వారి అర్హతలను వివరించారు.
సాక్షి ఎడ్యుకేషన్: కడప నగరంలోని తమ కార్యాలయంలో ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి ఎ.సురేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఓ బ్లాక్‌లో ఉదయం 9 గంటల నుంచి జరిగే ఈ మేళాకు అపోలో ఫార్మసీ లిమిటెడ్, నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎల్‌ఐసీ సంస్థల ప్రతినిధులు వస్తారన్నారు.
Job Mela: ఉద్యోగ అవకాశం... అర్హులందరూ దీనిని వినియోగించండి
అపోలో ఫార్మసీ కంపెనీలో హెచ్‌ఆర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, ఫారాసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రీటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలకు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ డిప్లొమా కలిగి 19–30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు.
Published date : 20 Sep 2023 12:39PM