Skip to main content

TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌.. ఇలా

TSPSC AEE Recruitment 2022 Notification and exam pattern and preparation guidance

ఇంజనీరింగ్‌ పట్టభద్రుల కోసం టీఎస్‌పీఎస్సీ శుభవార్త. 1540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో ఎక్కువగా సివిల్‌ ఇంజనీర్‌ పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 14(అక్టోబర్‌)వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

  • సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్‌ విభాగాల్లో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
  • వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

పరీక్ష విధానం

ఈ పరీక్షను పేపర్‌-1, 2లుగా నిర్వహిస్తారు.

  • పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌: ఇది 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్‌కు సంబంధించి మొత్తం 15 అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది.
  • పేపర్‌-2(సంబంధిత సబ్జెక్ట్‌): ఈ పరీక్ష 150 ప్రశ్నలు-300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

చ‌ద‌వండి: Indian History for group 1 & 2: ఇండియన్‌ హిస్టరీ.. మిరాతుల్‌ అక్బర్‌ పత్రిక స్థాపకుడు ఎవరు?

ప్రిపరేషన్‌.. ఇలా

పేపర్‌-1: ఇందులో తెలంగాణ భౌగోళిక అంశాలు, చరిత్ర-సంస్కృతి, కళలు, సాహిత్యం, వాస్తుశైలి, తెలంగాణలోని సమాజం, సామాజిక అంశాలు, తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.

  • జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.ఇందుకోసం దినపత్రికలను చదవాలి. ముఖ్యమైన అంశాలను షార్ట్‌నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అవార్డులు, పాలసీలు, జాతీయంగా, స్థానికంగా జరిగిన ముఖ్యమైన సదస్సులు, భారత్‌ విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అంతర్జాతీయ సంబంధాలు, క్రీడలు తదితర అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి.
  • లాజికల్‌ రీజనింగ్‌; అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. 
  • ఇంగ్లిష్‌కు సంబంధించి పదోతరగతి స్థాయి బేసిక్‌ ఇంగ్లిష్‌ పై పట్టు సాధించాలి.
  • ప్రశ్నల కాఠిన్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సబ్జెక్ట్‌పై లోతైన అవగాహన పెంచుకుంటే సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది.

చ‌ద‌వండి: TSPSC 833 Engineering Jobs: ఏఈ, జేటీఓ పోస్ట్‌లు .. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

పేపర్‌-2 సంబంధిత సబ్జెక్ట్‌

  • డిగ్రీ స్థాయిలో సంబంధిత(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు.
  • ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన ప్రశ్నల సరళి తెలుసుకోవడానికి గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఫలితంగా ఏయే అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముందో తెలుస్తుంది.
  • సిలబస్‌కు అనుగుణంగా ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై స్పష్టమైన అవగాహనతో ప్రిపరేషన్‌ సాగించాలి.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14.10.2022
  • వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in

చ‌ద‌వండి: TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories