Skip to main content

Indian History for group 1 & 2: ఇండియన్‌ హిస్టరీ.. మిరాతుల్‌ అక్బర్‌ పత్రిక స్థాపకుడు ఎవరు?

Indian History preparation tips for group 1 & 2
Indian History preparation tips for group 1 & 2

1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత దేశంలో అనేక రాజ్యాల్లో అలజడి ఏర్పడి, కలహాలు చెలరేగాయి. 1724లో బెంగాల్, అవ«ద్, హైదరాబాద్, పంజాబ్‌లలో నూతన రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆంగ్లేయులు క్రమక్రమంగా భరతఖండంలోని రాజ్యాలను, ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇక్కడి రాజులు, సైనికుల సహాయంతోనే తమ పాలన ప్రారంభించారు. 
బ్రిటిషర్లు అధికారంలోకి రాగానే అన్ని రాజ్యాలను ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఒకే రకమైన కరెన్సీని ప్రవేశపెట్టారు. భరతఖండంలోని అన్ని ప్రాంతాలను కలిపి భారతదేశంగా ఒకే ఛత్రం కిందకు తెచ్చారు. మరోవైపు మధ్యయుగ రాజుల నుంచి వారసత్వంగా వచ్చిన బానిస వ్యవస్థను(1843) రూపుమాపారు. 1818లో పిండారీలను, 1829–31లో «థగ్గులను, అణచివేశారు. సమాజంలో శాంతి భద్రత నెలకొల్పారు. తర్వాత తంతితపాలా(1854), రవాణా సౌకర్యాలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ‘రూపర్ట్‌ ఎమర్సన్‌’తదితర చరిత్రకారులు ఆంగ్లేయులు చేసిన కీడు కంటే..వారు చేసిన మేలే భారత జాతీయతకు పునాదివేసిందని పేర్కొన్నారు.

Indian History Notes for Groups: దక్షిణ భారతంలోనే.. తొలి బ్రిటిష్‌ వ్యతిరేక తిరుగుబాట్లు

జాతీయతా భావం

భారత దేశంలో తమ పాలనను నెలకొల్పిన ఆంగ్లేయులు.. భారతీయుల సంపద కొల్లగొట్టడం, జాతి వివక్ష చూపడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారతీయుల్లో చైతన్యం మొదలై విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ‘విదేశీ పాలనలో మగ్గుతున్న దేశాల్లో.. విదేశీ వ్యతిరేకతే జాతీయత’ అని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తన ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ‘ఆర్థిక స్వేచ్ఛ’ ద్వారానే జాతీయత అభివృద్ధి చెందుతుందని ప్రముఖ తత్వవేత్త ‘బెంథామ్‌’ అభిప్రాయపడ్డారు. 1776 జూలై 4న అమెరికా స్వాతంత్య్ర సమరంలో, 1789లో జూలై 14న జరిగిన ఫ్రెంచి విప్లవంలో.. జాతీయత తొలిమెట్టుగా నిలిచిందని చాలామంది చరిత్రకారులు పేర్కొన్నారు. జాతీయత భావాలను దోహదం చేయడంలో మత, సాంఘిక ఉద్యమాలు, వార్తా పత్రికలు సైతం ప్రముఖ పాత్ర వహించాయి.

Kakatiyas (History) Notes for Groups: ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?

సాంఘిక ఉద్యమాలు

  • 19వ శతాబ్దంలో సతీసహగమనం,బాల్యవివాహం, బహుభార్యత్వం, దేవదాసి వ్యవస్థ మొదలైన దురాచారాలు విస్తృతంగా ప్రబలాయి. 
  • దేశంలోని ఈ దురాచారాలను రూపుమాపడానికి పలువురు సంఘసంస్కర్తలు కృషి చేశారు. వారిలో రాజారామ్మోహన్‌రాయ్‌ అగ్రగణ్యుడు. ఆయన సంస్కృతం,పర్షియన్, అరబిక్, ఆంగ్లం, హిబ్రూ తదితర 12భాషల్లో పండితుడు. రామ్మోహన్‌రాయ్‌ ఉపనిషత్తులను, వేదాలను, జైన, బౌద్ధ, బైబిల్, ఖురాన్‌ వంటి మతగ్రంథాల సారాన్ని అర్థం చేసుకున్నారు. 
  • రాయ్‌ ‘సంవాద కౌముది’, ‘మిరాతుల్‌ అక్బర్‌’ తదితర పత్రికలు స్థాపించి తన ఆశయాలను ప్రచారం చేశారు. 1828లో బ్రహ్మ సబ,1829లో బ్రహ్మసమాజం స్థాపించి సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేశారు. 1833 సంవత్సరంలో రాయ్‌ ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌ నగరంలో మరణించారు. ఆయన సమాధి ఇంగ్లండ్‌లోని ‘ఆర్నోస్‌ వేల్‌’లో ఉంది.
  • తర్వాత కాలంలో బ్రహ్మసమాజాన్ని శివనాథ శాస్త్రి, కేశవచంద్రసేన్, ఆనంద్‌మోహన్‌ బోస్‌ తదితరులు నిర్వహించారు. 
  • దక్షిణ భారతదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు.. వితంతు వివాహాలు, దేవదాసీ వ్యవస్థ రద్దుకు కృషి చేశారు. 
  • ముస్లింలలో ఆధునిక విజ్ఞానం,ఆంగ్ల విద్యాభ్యాసం పెంపొందించడానికి సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌ కృషి చేశారు. 1875 ఆంగ్లో ఓరియెంటల్‌ కళాశాలను స్థాపించారు. తర్వాత అదే అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంగా రూపొందింది. 
  • 1875 సంవత్సరంలో ఏప్రిల్‌ 10న ఆర్యసమాజాన్ని ముంబైలో దయానంద సరస్వతి స్థాపించారు. ‘సత్యార్థ ప్రకాశిక’ రచించి, ‘వేదాలకు తిరిగి వెళ్లండి’ అని పిలుపునిచ్చారు. శుద్ధి ఉద్యమ కార్యక్రమాలను చేపట్టారు.
  • పార్శీలలో.. దాదాబాయి నౌరోజీ నాయకత్వంలో మతసంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. సిక్కులలో మాత్రం కొంత ఆలస్యంగా మొదలయ్యాయి. ఈ విధంగా 19వ Ô¶ తాబ్దంలో తలñ త్తిన మతసాంఘిక ఉద్యమాలు.. జాతీయతాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి. ముఖ్యంగా సంఘంలో ప్రబలిన అనేక దురాచాలను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి

History Notes for Group 1, 2: రాష్ట్రకూట వంశానికి చెందిన వారే కాకతీయులు!

ఉద్యమాల ఫలితం

ఈ ఉద్యమాల ఫలితంగానే 1829 సతీసహగమనాన్ని చట్టరీత్యా నిషేధించారు. దేవదాసి వ్యవస్థను రూపుమాపారు. 1856లో వితంతు వివాహాలకు అనుమతిచ్చారు. అంటరానితనం, విగ్రహారాధన,బహుదేవతారాధన, బాల్యవివాహాలు మొదలై న దురాచారాలు చాలా వరకు తగ్గిపోయాయి. 1893లో అమెరికాలోని ‘చికాగో’లో విశ్వమత మహాసభకు వివేకానందుడు హాజరై.. హిందూ మత ప్రాశస్త్యాన్ని, సర్వమత సామరస్య ఆవశ్యకతను వివరించారు.

Dr P Murali History– డాక్టర్‌ మురళి పగిడిమర్రి, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌


మాదిరి ప్రశ్నలు

Practice Test

Published date : 08 Jun 2022 05:06PM

Photo Stories