Indian History for Competitive Exams : మహావీరుని మొట్టమొదటి శిష్యుడు ఎవరు..?
ప్రాచీన భారతదేశంలో మత ఉద్యమాలు
క్రీ.పూ 6వ శతాబ్దానికి భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే జ్ఞాన సంచలనాల శతాబ్దంగా పేరుంది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కర్తలు సామాజిక, మత దురాచారాల నుంచి సమాజాన్ని, మతాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు. వీరిలో ముఖ్యమైనవారు చైనాలో కన్ఫ్యూషియస్, పర్షియాలో జొరాస్టర్, గ్రీస్‌లో పర్మనైడ్స్ మొదలైనవారు. అయితే భారతదేశంలో పాళి గ్రంథాల ప్రకారం ఇలాంటి 62 మత ఉద్యమాల గురించి తెలుస్తుంది. దాదాపు 200 వరకు మత ఉద్యమాలున్నట్లు జైన గ్రంథాలు ప్రస్తావించాయి. వీటన్నింటిలోకి ముఖ్యమైనవి జైన, బౌద్ధ ఉద్యమాలే. క్రీ.పూ 6వ శతాబ్దంలో భారతదేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులే ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమాలు రావడానికి ప్రధాన కారణం.
సామాజిక వ్యవస్థ
ఈ కాలంలో సమాజంలో వర్ణ వ్యవస్థ మరింత కఠినంగా మారింది. వర్ణ వ్యవస్థలో స్థానం కేవలం పుట్టుక ద్వారా మాత్రమే లభిస్తుంది. ధర్మశాస్త్రాలు చాతుర్వర్ణాల విధులను నిర్ణయించడమే కాకుండా వర్ణం ఆధారంగా న్యాయపాలనను ప్రవేశపెట్టాయి. ఉన్నత వర్ణాలపై శూద్రులు చేసే నేరాలకు తీవ్ర శిక్షలుండగా, శూద్రులపై జరిగే నేరాలకు ఉన్నత వర్గాలకు స్వల్ప శిక్షలుండేవి. స్త్రీల స్థాయి మరింత దిగజారింది. ఈ కాలంలో అస్పృశ్యత మొదలైంది. నాటి పాళి గ్రంథాల్లో చండాల, నిషధ, వేన, పుక్కుస వంటి పలు వర్గాల ప్రస్తావన ఉంది. సమాజంలో ఉన్న తీవ్రమైన సామాజిక వివక్షతల నుంచి తమను రక్షించి, సామాజిక సమానత్వాన్ని కల్పించే ఉద్యమాల కోసం ఆయా వర్గాలు ఎదురుచూస్తున్న పరిస్థితులు నాటి సమాజంలో నెలకొన్నాయి.
Clerk Jobs in Government Offices: ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్ ఉద్యోగాలు
ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పగలిగిన అనేక అంశాలు ఈ కాలంలో కనిపిస్తాయి. మొదటిసారిగా గంగా మైదానం సాగులోకి వచ్చింది. ఇనుప పరిజ్ఞానం విస్తృత స్థాయిలో ఉపయోగించడం, వరినాట్లను ప్రవేశపెట్టడం వల్ల వ్యవసాయ విస్తరణతోపాటు వ్యవసాయోత్పత్తిలో మిగులు ఏర్పడింది. ఈ మిగులు అటు జనాభా పెరుగుదలకు, వ్యవసాయేతర వృత్తుల అభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి దోహదపడటమే కాకుండా క్రమ పద్ధతి గల పన్నుల వ్యవస్థ ఆవిర్భావానికి దారి తీసింది. ఈ పరిణామాలన్నీ కలిసి ఈ కాలంలో భారతదేశ చరిత్రలో రెండోసారి నగరీకరణకు దారితీశాయి. హరప్ప నగరాల తర్వాత దాదాపు వేయి సంవత్సరాలకు మళ్లీ భారతదేశంలో నగరాల ఆవిర్భావం జరిగింది. వీటిని ఆధారం చేసుకుని అనేక చేతి వృత్తులు, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యాలు మొదలయ్యాయి. వ్యాపారులు శ్రేణులుగా ఏర్పడి వాణిజ్యాన్ని కొనసాగించారు. ఈ కాలంలో మొదటిసారిగా లోహపు నాణేల జారీ మొదలైంది. వీటినే విద్ధాంక నాణేలు అంటారు. వెండి శతమాకార్షపణలు, రాగి మాషా, కాకినిలు ఆనాటి కొన్ని నాణేలు. ఈ కాలంలోనే రాత సంప్రదాయం మొదలైంది. భారతదేశంలో తొలిసారి బ్రాహ్మీ లిపిలో రాత ప్రారంభమైంది. దీని వల్ల వ్యాపార లెక్కల నిర్వహణ మరింత సులువై వ్యాపార, వాణిజ్యాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం కలిగింది. వీటి వల్ల వైశ్యులు ఆర్థికంగా మరింత బలపడ్డారు. కానీ వర్ణ వ్యవస్థలో వారి స్థాయిలో మార్పు రాలేదు. పైగా వైదిక గ్రంథాలు వడ్డీ వ్యాపారాన్ని, సముద్రయానాన్ని నిషేధించడం ద్వారా వ్యా΄ారాభివృద్ధికి అడ్డంకిగా పరిణమించాయి. దీంతో కొత్త మతాల ఆవశ్యకత ఏర్పడింది. అందుకే జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. వ్యాపార వర్గాలు వాటిని బాగా ఆదరించాయి.
రాజకీయ వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన పలు మార్పులు నాటి రాజకీయ వ్యవస్థపై ప్రభావం చూపాయి. వేద కాలపు తెగ ఆధారిత రాజకీయ వ్యవస్థ స్థానంలో ప్రదేశానికి ప్రాముఖ్యతనిచ్చే ప్రాదేశిక రాజ్యాలు ఏర్పడ్డాయి. వ్యవసాయం, వ్యా΄ార, వాణిజ్యాల అభివృద్ధి వల్ల పన్నుల వసూలు జరిగి సైనిక నిర్వహణ సాధ్యమైంది. ఈ అంశాలన్నింటి వల్ల రాజకీయంగా క్షత్రియులు ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కానీ వర్ణ వ్యవస్థలో మాత్రం వారిది ద్వితీయ స్థానమే. కాబట్టి సామాజికంగా క్షత్రియులు బ్రాహ్మణుల కంటే ఉన్నత స్థానాన్ని కోరుకున్నారు. దీని పర్యవసానమే పలు మత ఉద్యమాలు అని చెప్పొచ్చు. జైన, బౌద్ధ మతాల ప్రారంభకులు ఇద్దరూ క్షత్రియులే కావడం ఇక్కడ గమనార్హం. ఈ మత గ్రంథాల్లో వర్ణ వ్యవస్థలో క్షత్రియులు మొదటి వరుసలో ఉంటే బ్రాహ్మణులు ద్వితీయ స్థానంలో ఉంటారు.
jobs news: జపాన్‌లో ఉద్యోగావకాశాలు
మత వ్యవస్థ
వైదిక మతం ఈ కాలానికి మరింత సంక్లిష్టంగా మారింది. వర్ణ వ్యవస్థలో మొదటి మూడు వర్ణాలకే మోక్షం సాధ్యమవుతుంది. అయితే మోక్ష సాధన మార్గం చాలా వ్యయభరితమైయింది. అనేక యజ్ఞ యాగాదులు, జంతు బలులు సర్వసాధారణమయ్యాయి. ఈ జంతు బలుల వల్ల అప్పుడప్పుడే బలపడుతున్న వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన పశు సంపదకు అపార నష్టం వాటిల్లింది. పశు సంపద లేనిదే వ్యవసాయాభివృద్ధి జరగదు. కాబట్టి వ్యవసాయదారులు వైదిక కర్మకాండల పట్ల విముఖత పెంచుకున్నారు. శూద్రులు, స్త్రీలతో΄ాటు నిషేధిత వృత్తుల్లో ఉన్నవారికి మోక్షాన్ని నిరాకరించారు. ఈ పరిస్థితులన్నీ కలిసి సహజంగానే, అందరికీ సులువైన మోక్షం ప్రసాదించే మతాల పట్ల ఆసక్తిని కలిగించాయి.
మత ఉద్యమాలు
ఈ కాలం నాటి ఉద్యమాలు చాలా వరకు బ్రాహ్మణాధిక్యతను, కర్మకాండలను వ్యతిరేకించాయి. జ్ఞాన మార్గాన్నే మోక్ష మార్గంగా బోధించాయి. ఈ ఉద్యమకర్తల్లో చాలా మంది ఉపనిషత్ బోధనల నుంచి ప్రేరితులయ్యారు. ఆనాటి మత ఉద్యమాల్లో ముఖ్యమైనవారు..
☛ పురాణ కశ్యపుడు: ఒక వ్యక్తి నడవడికకు, అతని కర్మకు ఎలాంటి సంబంధం లేదని బోధించాడు. ఇతని బోధనల నుంచే సాంఖ్యకతత్వ సిద్ధాంతం అభివృద్ధి చెందింది.
☛ గోసల మస్కరి పుత్రుడు: విధి నిర్ణయం (నియతి) ప్రకారమే అన్నీ జరుగుతాయని బోధించాడు. ఇతడు ‘అజీవిక’ అనే మతాన్ని ప్రారంభించాడు.
☛ అజిత కేశకంబళి: ‘చార్వాక’ అనే శాఖను ప్రారంభించాడు. వీరినే శూన్యవాదులని అంటారు. ఈయన భౌతికవాదాన్ని బోధించాడు.
☛ పకుధ కాత్యాయనుడు: ఈయన పరమాణువాది. ఏ విధంగా అయితే భూమి, గాలి, నీరు, వెలుగులను నాశనం చేయలేమో విచారం, సంతోషం, జీవితం మొదలైనవాటిని కూడా నాశనం చేయలేమని బోధించాడు. ఇతని బోధనల నుంచే షడ్దర్శనాల్లో ఒకటైన వైశేషిక సిద్ధాంతం అభివృద్ధి చెందింది.
☛ సంజయ బలత్తిపుర: ఈయన సంశయవాదాన్ని ప్రచారం చేశాడు. జ్ఞానం అంటూ ఏదీ ఉండదని ఇతని భావన.
☛ నిర్గ్రంథ జ్ఞానపుత్రుడు: ఈయనే వర్థమాన మహావీరుడు. జైన మత తీర్థంకరుడు.
1. మహావీరుడు ఏ భాషలో తన బోధనలను కొనసాగించాడు?
1) అర్ధ మగధి 2) పాళీ
3) బ్రాహ్మీ 4) మార్వారీ
2. అజీవిక మత స్థాపకుడు?
1) పురాణ కశ్యప
2) పకుద కాత్యాయన
3) గోసల మస్కరి పుత్రుడు
4) అజిత కేశ కంబలి
3. కింది వాటిలో అశోక వృక్షాన్ని పూజించిన మతశాఖ?
1) శక్త 2) పాశుపత
3) దిగంబర 4) అజీవిక
4. జైన మత వాస్తవ స్థాపకుడు?
1) రుషభనాథ 2) పార్శ్వనాథ
3) నేమినాథ 4) వర్థమాన మహావీర
5. మహావీరుడు కైవల్య (జ్ఞానాన్ని) పొందిన ప్రదేశం?
1) కుంద 2) వైశాలి
3) గయ 4) జృంభిక
6. మహావీరుని మొట్టమొదటి శిష్యుడు?
1) జామాలి 2) ఆనందుడు
3) గోసల మస్కరి పుత్రుడు
4) భద్రబాహుడు
7. కిందివాటిలో మహావీరుడు మరణించిన ప్రదేశం?
1) కుశినగర 2)వైశాలి
3) రాజగృహ 4) పావా
Open 10th Class & Inter Admissions: ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఇదే
8. కింది వాటిలో మొదటి జైన సంగీతి ఎక్కడ జరిగింది?
1) పాటలీపుత్రం 2) వల్లభి
3) జృంభిక 4)వైశాలి
9. కిందివాటిలో జైనమతం విస్తరించని ప్రాంతం ఏది?
1) గుజరాత్ 2) రాజస్థాన్
3) కర్నాటక 4) పశ్చిమ బెంగాల్
10. దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసినవారు?
1) చంద్రగుప్త మౌర్యుడు
2) భద్రబాహు
3) స్థూలబాహు
4) సుదర్శన్
11. జైన మతాన్ని లిచ్ఛవీల రాజ మతంగా చేసినవారు?
1) చేతక 2) కుమారదేవ
3) అభయ 4) ఉదయనుడు
12. జైన మతంలో ΄ోసద లేదా ఉపోసత అంటే ఏమిటి?
1) కొత్త వారిని జైనమతంలో సభ్యులుగా తీసుకొనే కార్యక్రమం
2) జైనమత ఉపాసకులు పున్నమి రోజున ఉపవాసముండుట
3) జైనులు తమ తప్పులను అంగీకరించే కార్యక్రమం
4) నియమ ఉల్లంఘనకు విధించే శిక్ష
13. బసదులు ఏ మతానికి సంబం«ధించినవి?
1) బౌద్ధం 2) జైనం
3) హిందూ 4) అజీవిక
14. జైనకల్ప సూత్ర గ్రంథకర్త?
1) కల్కాచార్య 2) గార్థభిల్ల
3) భద్రబాహు 4) స్థూలభద్ర
సమాధానాలు
1) 1; 2) 3; 3) 4; 4) 2;
5) 4; 6) 1; 7) 4; 8) 1;
9) 4; 10) 2; 11) 3; 12) 2;
13) 2; 14) 3;
జైన మతం – వర్థమాన మహావీరుడు
జైనమతంలో 24 మంది తీర్థంకరులున్నారని భావిస్తున్నారు. మొదటి, 22వ తీర్థంకరులైన రుషభనాథుడు, అరిష్టనేమిల ప్రస్తావన రుగ్వేదంలో ఉంది. అయితే 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడే చారిత్రకంగా జైనమత స్థాపకుడని చెప్పాలి. ఈయన కాశీ రాజు అశ్వసేనుని కుమారుడు. క్రీ.పూ. 8వ శతాబ్దంలో జీవించాడు. జైనమతంలోని ఐదు సిద్ధాంతాల్లో మొదటి నాలుగింటిని పార్శ్వనాథుడు బోధించాడు. అవి.. అహింస, సత్య, అసతేయ, అపరిగ్రహ. చివరిదైన బ్రహ్మచర్యాన్ని మహావీరుడు చేర్చాడు.
వర్థమానుడు క్రీ.పూ 540లో కుంద గ్రామంలో క్షత్రియ కులంలో త్రిశాల, సిద్ధార్థుడు అనే దంపతులకు జన్మించాడు. త్రిశాల వైశాలి రాజు చేతకుని సోదరి. చేతకుని కుమార్తె చెల్లనను మగధరాజు బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. మహావీరుని భార్య పేరు యశోద. ఇతడు తల్లిదండ్రుల మరణం తర్వాత తన 30వ ఏట సన్యాసాన్ని స్వీకరించాడు. తర్వాత ఆరేళ్లు గోసల మస్కరి పుత్రునితో కలిసి జ్ఞానాన్వేషణ చేశాడు. ఆ తర్వాత ఆరేళ్లకు తన 42వ ఏట జృంభిక గ్రామం వద్ద రుజుపాలిక నది ఒడ్డున ఒకసాల వృక్షం కింద కైవల్యం (జ్ఞానం)పొందాడు.
School Fees: ఫీజుల దరువుకు బ్రేకులెలా?.. తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకు.. ఇతర రాష్ట్రాల్లో ఇలా
దీని వల్ల అతడు జినుడని, జితేంద్రియుడని, మహావీరుడనీ, నిర్గ్రంథుడని పేరు పొందాడు. ఇతని అనుచరులను నిర్గ్రంథులు లేదా జైనులని పిలిచేవారు. మహావీరుడు తన 72వ ఏట పావాపురి వద్ద హస్తినపాలుని ఇంట సల్లేఖన వ్రతం ద్వారా మరణించాడు.
జైనమతంలోని 5 సూత్రాలను భిక్షువులు ఆచరిస్తే వారిని మహావ్రతులని, సాధారణ భక్తులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు. జైన మత త్రిరత్నాలు.. సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన క్రియ. పంచ సిద్ధాంతాలతోపాటు త్రిరత్నాలను ఆచరిస్తే ఎటువంటి కర్మకాండలు అవసరం లేకుండా మోక్షం లభిస్తుందని జైన మతం బోధిస్తుంది.
జైన మహావీరుని 11 మంది శిష్యులను గణధారలు అంటారు. వీరిలో ఆర్య సుదర్శన్.. మహావీరుని అనంతరం తొలి థేర పదవి చేపట్టాడు. జైనమత గ్రంథాలైన 14 పూర్వాలను సంభూత విజయ, భద్రబాహు అనే గణధారలు క్రోడీకరించారు. భద్రబాహు ‘కల్పసూత్ర’ అనే మరొక జైన మత గ్రంథాన్ని రచించాడు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని సమకాలికుడు. చంద్రగుప్తుని కాలంలో మగధలో కరువు ఏర్పడగా భద్రబాహు అనుచరులతోపాటు చంద్రగుప్తుడు కూడా శ్రావణ బెళగొళకు వచ్చి అక్కడ సల్లేఖన వ్రతం ద్వారా మోక్షం పొందాడు.
జైనమతంలో చీలిక
శ్రావణ బెళగొళ నుంచి భద్రబాహు మగధకు తిరిగొచ్చాడు. అక్కడ జైన మత నాయకుడు స్థూలబాహుతో జైన సిద్ధాంత గ్రంథాల సూత్రాలపై చర్చించాడు. తర్వాత కాలంలో విభేదాల వల్ల జైనమతం.. దిగంబరులు, శ్వేతాంబరులు అనే రెండు శాఖలుగా విడిపోయింది. భద్రబాహు దిగంబర జైనమత నాయకుడు. దక్షిణ భారతదేశంలో జైనం వ్యాపించడానికి ప్రధాన కారకుడు. తర్వాతి కాలంలో దిగంబరుల నుంచి సమైయాలు, శ్వేతాంబరుల నుంచి థేర పంథీలు అనే శాఖలు ఏర్పడ్డాయి.
జైనమత గ్రంథాల సంకలనానికి క్రీ.పూ 3వ శతాబ్దంలో పాటలీపుత్రంలో స్థూల బాహు నాయకత్వంలో తొలి జైన సంగీతి జరిగింది. ఇందులో 14 పూర్వల స్థానం, 12 అంగాలు క్రోడీకరించారు. క్రీ.శ 6వ శతాబ్దంలో వల్లభిలో రెండో జైన సంగీతి నిర్వహించారు. ఇందులో 12 అంగాలను సంపూర్ణంగా సంకలనం చేయడంతో పాటు 12 ఉప అంగాలను రూపొందించారు. ఈ అంగాలపై రాసిన 10 వ్యాఖ్యలను నిర్యుక్తిలు అంటారు. జైన తత్వ సిద్ధాంతాన్ని స్వాదేవాదం అంటారు. అనేకాంతవాదం కూడా జైనమతానికి సంబంధించిన సిద్ధాంతమే.
Jobs In Amazon: గుడ్‌న్యూస్.. దేశ వ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు, ప్రకటించిన అమెజాన్
జైనమత రాజపోషణ
మగధ రాజైన ఉదయనుడు, నంద వంశ రాజులు జైన మతాన్ని పోషించారు. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఆదరించిన తొలి ముఖ్యమైన పాలకుడు అని చెప్పొచ్చు. తర్వాత దీన్ని ఆదరించిన రాజుల్లో ముఖ్యమైనవాడు ఖారవేలుడు. అశోకుడు బౌద్ధమతానికి ఆదరించినట్లే ఖార వేలుడు కూడా జైనమతాన్ని పోషించి దాన్ని నలు దిశలా ప్రచారం చేయించాడు. కుషాణుల కాలంలో మధుర ప్రముఖ జైన కేంద్రంగా ఉండేది. తొలి మధ్య యుగాల్లో పశ్చిమ గాంగులు, కాదంబులు, పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు మొదలైన వంశాల వారు జైనమతాన్ని ఆదరించారు.
జైనమత క్షీణత
హిందూ మతంతో పోల్చినప్పుడు బౌద్ధమతం తన ప్రత్యేకతను నిలుపుకున్నట్టు జైనమతం తన ప్రత్యేకతను నిలుపుకోలేదు. హిందూ మతæ కుల వ్యవస్థ జైనమతంలో పునరుద్ధరించడం వంటి అంశాల వల్ల ఇది సామాన్యుల ఆదరణ కోల్పోయింది. బౌద్ధమతంలా రాజాదరణ కూడా జైనానికి లభించలేదు. జైనమతంలో పలుమార్లు సంభవించిన చీలికలు కూడా ఈ మత ప్రాబల్య క్షీణతకు దారితీశాయి. శకులు, హూణులు, ముస్లింల వంటి విదేశీయుల దాడులు కూడా జైన మత పతనానికి కారణమయ్యాయి. చివరికి హిందూమత పునరుద్ధరణ జైన మతాన్ని దెబ్బ తీసింది.
Tags
- Competitive Exams
- TSPSC Groups exams
- Government Jobs
- police jobs
- appsc groups exams
- appsc and tspsc groups exams
- Study Material
- groups exams study material
- indian history material
- indian history for appsc and tspsc
- groups exams preparations
- indian history for groups exams
- competitive exams in history
- indian history preparatory questions
- indian history material and model questions
- indian history for groups exams
- police jobs exams
- Indian History
- indian history subject for groups and police exams
- Education News
- Sakshi Education News