TSPSC 833 Engineering Jobs: ఏఈ, జేటీఓ పోస్ట్‌లు .. విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ).. పలు ప్రభుత్వ శాఖల్లో.. ఇంజనీరింగ్, టెక్నికల్ విభాగాల్లో.. కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టింది. డిప్లొమా, బీటెక్ ఉతీర్ణతగా..పోటీ పడే అవకాశం కల్పిస్తోంది. తాజాగా.. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఆయా పోస్ట్‌ల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- పలు శాఖల్లో ఏఈ, జేటీఓ పోస్ట్‌లు
- 833 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
- డిప్లొమా,బీటెక్ అర్హతలతో పోటీ పడే అవకాశం
టీఎస్‌పీఎస్సీ తాజా నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో 833 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్‌లతో డిప్లొమా/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఇప్పటికే ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులకు ఇది మరో చక్కటి అవకాశంగా పేర్కొనవచ్చు. దీన్ని అందిపుచ్చుకుంటే..ఆకర్షణీయ వేతనంతోపాటు సుస్థిర భవిష్యత్తు, సర్కారీ కొలువు కల సాకారం చేసుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు.
మొత్తం 833 పోస్ట్‌లు
అర్హతలు
- సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్‌లతో డిప్లొమా/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: అన్ని పోస్ట్‌లకు వయో పరిమితిని 18 నుంచి 44 ఏళ్లుగా నిర్దేశించారు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
చదవండి: TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్సీలో 833 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వేతన శ్రేణి
- అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్‌లకు రూ.45,960 -రూ.1,24,150; జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్‌లకు రూ.32,800-రూ.96,890గా వేతన శ్రేణిని పేర్కొన్నారు.
రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా
పలు శాఖల్లో ఏఈ, జేటీఓ పోస్ట్‌లకు చేపట్టనున్న ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి.. అందులో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు ఖరారు చేయనున్నారు. రాత పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు.
వివరాలు..
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
పేపర్-1 | జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ | 150 | 150 |
పేపర్-2 | సబ్జెక్ట్ పేపర్ (సివిల్/ఈఈఈ/మెకానికల్) | 150 | 150 |
మొత్తం | 300 | 300 |
- పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది.
- పరీక్షకు కేటాయించిన సమయం: ప్రతి పేపర్‌కు రెండున్నర గంటలు.
- రెండో పేపర్‌ను ఇంగ్లిష్ మీడియంలోనే నిర్వహిస్తారు.
చదవండి: TSPSC Group1 Guidance: విజేతగా నిలవాలంటే.. 60 రోజుల ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి!!
విజయం సాధించాలంటే
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ
- పేపర్-1గా పేర్కొన్న జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు అభ్యర్థులు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా అంతర్జాతీయ సంబంధాలు, పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
- జనరల్ సైన్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి, తాజా పరిస్థితులు, రక్షణ రంగంలో పరిశోధనలు, ఇస్రో ప్రయోగాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
- పర్యావరణ అంశాలకు సంబంధించి విపత్తు నిర్వహణ, నివారణ వ్యూహాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- భారత్, తెలంగాణకు సంబంధించి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. తాజాగా అమలవుతున్న అభివృద్ధి పథకాలను తెలుసుకోవాలి.
- తెలంగాణ ప్రాంత భౌగోళిక స్వరూపం, విశిష్టతలు తెలుసుకోవాలి.
- చరిత్రకు సంబంధించి.. తెలంగాణ, భారత చరిత్రలను అధ్యయనం చేయాలి.
- ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన చరిత్రపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ తొలి ఉద్యమ దశ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పలు ముఖ్యమైన అంశాలను ఔపోసన పట్టాలి.
- వీటితోపాటు తెలంగాణ సంస్కృతి, సామాజిక పరిస్థితులు, కళలు, సాహిత్యం వంటి అంశాలను కూడా చదవాలి.
- ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- అనలిటికల్ ఎబిలిటీలో గ్రాఫ్స్, డేటా అనాలిసిస్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
- వీటితోపాటు భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలన విధానం, భారత భౌగోళిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను చదవాలి.
- పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్‌ను అభ్యసనం చేయాలి.
చదవండి: Telangana Government Jobs: జనరల్‌స్టడీస్‌కు ఈ పుస్తకాలను చదివారంటే..
పేపర్-2కు ఇలా
- అభ్యర్థుల అర్హతలు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్ ఆధారంగా రాయాల్సిన పేపర్-2 (సబ్జెక్ట్ పేపర్)లో రాణించేందుకు.. డిప్లొమా స్థాయిలో ఆయా బ్రాంచ్‌ల అకడమిక్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
- సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు సర్వేయింగ్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ ప్రాక్టీస్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, క్వాంటిటీ సర్వేయింగ్, డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లోని అంశాల్లో దృష్టి పెట్టాలి.
- మెకానికల్ అభ్యర్థులు థర్మల్ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్స్ మెషినరీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- ఎలక్ట్రికల్ అభ్యర్థులు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, డీసీ మెషీన్స్, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్, యుటిలైజేషన్ అండ్ ట్రాక్షన్, పవర్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు సాధించాలి.
అప్లికేషన్ ఓరియెంటేషన్
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగాలి. ముఖ్యంగా పేపర్-2 సబ్జెక్ట్‌లకు సంబంధించి బీటెక్ లేదా డిప్లొమా స్థాయిలోని అకడమిక్ పుస్తకాలను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగించాలి.
మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం కూడా పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. పేపర్-2లోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలోనే ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ.. అభ్యర్థులు బీటెక్ స్థాయిలోని అంశాలపైనా దృష్టిపెడితే విజయావకాశాలు మెరుగవుతాయి. ప్రిపరేషన్‌ను అప్లికేషన్ అప్రోచ్‌తో సాగించాలని, దీనివల్ల ప్రాక్టికల్ థింకింగ్ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుందని సూచిస్తున్నారు. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ గతంలో నిర్వహించిన ఏఈ/ఏఈఈ ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 21 వరకు
- పరీక్ష తేదీ: 2023 జనవరి/ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నిజామాబాద్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tspsc.gov.in
Qualification | GRADUATE |
Last Date | October 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |