Skip to main content

5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌లు: ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ ఇలా!

బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ) అభ్యర్థులకు.. శుభవార్త! ఈ అర్హతలతో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో స్టాఫ్‌ నర్స్‌లుగా కొలువుదీరొచ్చు!! తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తాజాగా స్టాఫ్‌ నర్స్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌ల వివరాలు, ఎంపిక విధానం, అర్హతలు తదితర వివరాలు..
Telangana Staff Nurse Recruitment 2023 Notification

రాష్ట్రంలో వేల సంఖ్యలో అభ్యర్థులు నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులు పూర్తి చేసి.. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో నర్స్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునే మార్గంగా తాజా నోటిఫికేషన్‌ నిలుస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే నర్సింగ్‌ కోర్సుల ఉత్తీర్ణులకు సుస్థిర భవిష్యత్తు ఖాయం అంటున్నారు నిపుణులు.

తొమ్మిది శాఖలు–5,204 పోస్ట్‌లు
తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న స్టాఫ్‌ నర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా.. వైద్య, ఆరోగ్య శాఖ సహా మొత్తం తొమ్మిది శాఖల్లో 5,204 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖతోపాటు.. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లోనూ అక్కడి విద్యార్థులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో వాటిలోనూ స్టాఫ్‌ నర్స్‌లను నియమించనున్నారు.

Also read: UPSC Recruitment 2023 : యూపీఎస్సీలో 111 ఉద్యోగాలు

అర్హతలు

  • బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎం అండ్‌ మిడ్‌ వైఫరీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయసు: జూలై 1, 2022 నాటికి 18–44 ఏళ్లు(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు).
  • వేతన శ్రేణి: రూ.36,570–రూ.1,06, 990


ఎంపిక విధానం

  • తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌.. నర్సింగ్‌ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. రాత పరీక్ష, అప్పటికే అభ్యర్థులు పొందిన సర్వీస్‌(పని అనుభవం) ఆధారంగా తుది విజేతలను ఖరారు చేయనుంది. 
  • రాత పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు.
  • మరో 20 మార్కులకు అభ్యర్థుల పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని.. గిరిజన ప్రాంతాల్లో ఆరు నెలల సర్వీస్‌కు 2.5 పాయింట్లు చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో ఆరు నెలల సర్వీస్‌కు 2 పాయింట్లు చొప్పున కేటాయిస్తారు. ఇలా.. ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు పాయింట్లు కేటాయించే విధానంలో.. గరిష్టంగా 20 మార్కులను పని అనుభవానికి వెయిటేజీ కల్పిస్తారు.
  • పని అనుభవం విషయంలో నిర్దిష్ట నిబంధనలను రూపొందించారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రులు లేదా ఇన్‌స్టిట్యూట్స్, లేదా ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి విభాగాల్లో.. కాంట్రాక్ట్‌ లేదా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తుండాలి. వారికే సర్వీస్‌ పాయింట్స్‌ వెయిటేజీ కల్పిస్తారు. 
  • అదే విధంగా సర్వీస్‌ అనుభవం పాయింట్లు పొందాలనుకునే వారు స్టాఫ్‌ నర్స్‌ హోదాలోనే విధులు నిర్వర్తించి ఉండాలి. దీంతోపాటు.. వారు పని చేసిన విభాగాల అధీకృత అధికారుల నుంచి సర్వీస్‌ సర్టిఫికెట్‌ను నిర్దేశిత నమూనాలో దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. 

Also read: SSC Jobs: పదో తరగతితోనే... కేంద్ర ప్రభుత్వంలో 12,523 పోస్ట్‌లు... రాత పరీక్షలో విజయానికి ఇలా!

రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో కీలకంగా నిలిచే రాత పరీక్షను 80 ప్రశ్నలతో 80 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష పూర్తిగా ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎంఆర్‌ షీట్‌ ఆధారంగా జరుగుతుంది.

అకడమిక్‌ నైపుణ్యాలు
80 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో విజయం సాధించడానికి అభ్యర్థులు అకడమిక్‌ నైపుణ్యాలపై పట్టు సాధించాలి. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ స్థాయిలో చదివిన అంశాలు, ప్రాక్టికల్స్‌కు సంబంధించిన విషయాలను అవలోకనం చేసుకోవాలి. వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి సమకాలీన పరిస్థితులపైనా అవగాహన పెంచుకోవాలి. వీటిని సబ్జెక్ట్‌ అంశాలతో సమ్మిళితం చేసుకుంటూ.. బేరీజు వేసుకుంటూ అభ్యసనం చేస్తే మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

ప్రశ్న పత్రాల సాధన
స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ప్రిపరేషన్‌లో భాగంగా ఇతర ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఎయిమ్స్, జిప్‌మర్‌ వంటి సంస్థలు చేపట్టిన నియామక పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం ద్వారా ప్రశ్నల తీరుపై అవగాహన లభిస్తుంది.

Also read: LIC ADO Recruitment 2023: ఎల్‌ఐసీలో 9394 ఏడీవో పోస్టులు

ప్రిపరేషన్‌ ఇలా

  • స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌ల అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాల వివరాలు..
  • అనాటమీ అండ్‌ ఫిజియాలజీ; మైక్రో బయాలజీ;సైకాలజీ;సోషియాలజీ; ఫండమెంటల్స్‌ ఆఫ్‌ నర్సింగ్‌; ప్రథమ చికిత్స(ఫస్ట్‌ ఎయిడ్‌); కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌; ఎన్విరాన్‌మెంటల్‌ హైజీన్‌; హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; న్యూట్రిషన్, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్‌–1; మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్‌–2, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్‌; చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌; మిడ్‌వైఫరీ అండ్‌ గైనకాలజికల్‌ నర్సింగ్‌; కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌–2; నర్సింగ్‌ ఎడ్యుకేషన్‌; నర్సింగ్‌ రీసెర్చ్‌; ప్రొఫెషనల్‌ ట్రెండ్స్‌ అండ్‌ అడ్జస్ట్‌మెంట్‌; నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వార్డ్‌ మేనేజ్‌మెంట్‌.
  • ఈ అంశాలకు సంబంధించి నిర్వచనం మొదలు నిర్వహణ ప్రక్రియల వరకు అన్నింటిపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.
  • కమ్యూనిటీ హెల్త్‌ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో ఆరోగ్య వ్యవస్థ, హెల్త్‌ ప్లానింగ్, నేషనల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్, హెల్త్‌ ఏజెన్సీస్‌ వంటి అంశాలతో ఆయా విభాగాల్లో నర్స్‌ల పాత్ర గురించి తెలుసుకోవాలి. 
  • సర్జికల్‌ నర్సింగ్‌కు సంంధించి శస్త్ర చికిత్స నిర్వహణ పద్ధతులు, నర్సింగ్‌ టెక్నిక్స్, రోగుల విషయంలో అనుసరించాల్సిన నిబంధనలు వంటి అంశాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి.
  • హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు కూడా ప్రిపరేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. రోగులతో వ్యవహరించాల్సిన విధానాలు, కౌన్సెలింగ్, హెల్త్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పద్ధతులపై అవగాహన పొందాలి.
  • ఎన్విరాన్‌మెంటల్‌ హైజీన్‌.. ఇది కూడా పరీక్షలో కీలకంగా నిలిచే విభాగం అని చెప్పొచ్చు. పరిపుష్టమైన ఆరోగ్యానికి దోహదం చేసే పర్యావరణ అంశాలపై దృష్టి పెట్టాలి.
  • అన్నిటికంటే ముఖ్యంగా నర్సింగ్‌లో ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహనతో అడుగులు వేయాలి. రోగుల విషయంలో నర్సింగ్‌ కేర్‌ ప్రాధాన్యం, రోగుల పరిస్థితిని సమీక్షించడం, క్లినికల్‌ ఫార్మకాలజీ, థెరపటిక్‌ నర్సింగ్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
  • సోషియాలజీకి సంబంధించి వ్యక్తులు, కుటుంబం, సమాజం, కమ్యూనిటీ అంశాలను అభ్యసనం చేయాలి.
  • సైకాలజీకి సంబంధించి మానవ ప్రవర్తన శైలి/తత్వం, లెర్నింగ్, థింకింగ్, రీజనింగ్, అబ్జర్వేషన్, వ్యక్తిత్వం, ఇంటెలిజెన్స్‌ అంశాలపై అవగాహన ఉపయుక్తంగా ఉంటుంది.
  • కోర్‌ అంశాలుగా భావించే అనాటమీ అండ్‌ ఫిజియాలజీ విషయంలో రక్త ప్రసరణ వ్యవస్థ, మానవ శరీర నిర్వహణ, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్‌ సిస్టమ్, నెర్వస్‌ సిస్టమ్, సెన్స్‌ ఆర్గాన్, స్కెలెటెన్, కండరాల వ్యవస్థలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి.
  • మైక్రో బయాలజీకి సంబంధించి రోగ నిరోధకత, మైక్రోబ్స్‌ నియంత్రణ /నిర్మూలన, ఇన్‌ఫెక్షన్, మైక్రో ఆర్గానిజమ్స్‌పై దృష్టి పెట్టాలి.
  • అదే విధంగా గైనకాలజికల్‌ సిస్టమ్‌కు సంబంధించి అన్ని అంశాలను అభ్యసనం చేయాలి.
  • ఇలా కోర్‌ అంశాలు మొదలు కమ్యూనిటీ హెల్త్‌ వంటి సమకాలీన అంశాల వరకు అన్నింటిపై పట్టు సాధిస్తే.. రాత పరీక్షలో విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చు.

Also read: CISF Recruitment 2023: సీఐఎస్‌ఎఫ్‌లో 451 కానిస్టేబుల్‌ పోస్టులు

హెడ్‌ నర్స్, సూపరింటెండ్‌ స్థాయికి
స్టాఫ్‌ నర్స్‌గా కెరీర్‌ ప్రారంభించిన వారు.. భవిష్యత్తులో సర్వీస్‌ నియమావళిని అనుసరించి.. నర్స్‌ నుంచి సూపరింటెండ్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత స్టాఫ్‌ నర్స్, ఆ తర్వాత హెడ్‌ నర్స్, క్లినికల్‌ నర్స్‌ స్పెషలిస్ట్, ఓటీ హెడ్‌ వంటి హోదాలు పొందొచ్చు.

ముఖ్య సమాచారం

  •      దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  •      ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: జనవరి 25 – ఫిబ్రవరి 15
  •      రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌.
  •      పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in

Also read: Bank of Maharashtra Recruitment 2023: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date March 15,2023
Experience Fresher job

Photo Stories