Skip to main content

LIC ADO Recruitment 2023: ఎల్‌ఐసీలో 9394 ఏడీవో పోస్టులు

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన అప్రెంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(ఏడీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్‌ కార్యాలయంలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
9394 ADO Posts in LIC

మొత్తం పోస్టుల సంఖ్య: 9394
జోన్ల వారీగా ఖాళీలు: సెంట్రల్‌ జోనల్‌ ఆఫీస్‌(భోపాల్‌)–561; ఈస్టర్న్‌ జోనల్‌ ఆఫీస్‌(కోల్‌కతా)–1049; ఈస్ట్‌ సెంట్రల్‌ జోనల్‌ ఆఫీస్‌(పాట్నా)–669; నార్తర్న్‌ జోనల్‌ ఆఫీస్‌(న్యూఢిల్లీ)–1216;నార్త్‌ సెంట్రల్‌ జోనల్‌ ఆఫీస్‌(కాన్పూర్‌)–1033;సదరన్‌ జోనల్‌ ఆఫీస్‌(చెన్నై)–1516; సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ ఆఫీస్‌(హైదరాబాద్‌) – 1408; వెస్టర్న్‌ జోనల్‌ ఆఫీస్‌(ముంబై)–1942.
దక్షిణ మధ్య జోన్‌లో అప్రెంటిస్‌ ఏడీవో ఖాళీలు: 1408: డివిజన్ల వారీగా ఖాళీలు: కడప–90, హైదరాబాద్‌–91, కరీంనగర్‌–42, మచిలీపట్నం–112, నెల్లూరు–95, రాజమహేంద్రవరం–69, సికింద్రాబాద్‌–94, విశాఖపట్నం–57, వరంగల్‌–62, బెంగళూరు1–115, బెంగళూరు2–117, బెల్గాం–66, ధార్వాడ్‌–72, మైసూర్‌–108, రాయచూర్‌–83, షిమోగా–51, ఉడిపి–84.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ముంబైలోని ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఫెలోషిప్‌ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్‌ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 01.01.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: ఏడీవోగా ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్‌ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేషనరీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా నెలకు సుమారు రూ.56వేలుకు పైగా వేతనం అందుతుంది. 
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్షలు(ప్రిలిమినరీ/మెయిన్‌ ఎగ్జామినేషన్‌), ఇంటర్వ్యూ, ప్రీ–రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమ్స్‌లో రీజనింగ్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. మెయిన్స్‌లో రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జీకే, కరెంట్‌ అఫైర్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌ అవేర్‌నెస్‌ తదితర సబ్జెక్టుల్లో 160 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభతేది: 21.01.2023.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.02.2023.
  • ఆన్‌లైన్‌ పరీక్ష కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభ తేది: 04.03.2023
  • ప్రిలిమినరీ పరీక్ష తేది: 12.03.2023.
  • మెయిన్‌ పరీక్ష తేది: 08.04.2023.

వెబ్‌సైట్‌: https://www.licindia.in/

Also read: Telangana హైకోర్టులో 17 ఎగ్జామినర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date February 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories