Skip to main content

LIC AAO Recruitment 2023: ఎల్‌ఐసీలో 300 ఏఏఓఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు & చివరి తేదీ..

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ)ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. దీనిలో భాగంగా అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (జరనలిస్ట్‌) 300 పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తిచేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
300 AAO Jobs in LIC
  • మొత్తం పోస్టుల సంఖ్య: 300
  • పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఏఏఓ) 
  • అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • వయసు: 01.01.2023 వరకు 21–30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
  • వేతనాలు: నెలకు రూ.53,600 –రూ.1,02,090 చెల్లిస్తారు.

ఎంపిక విధానం

  • ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
  • ప్రిలిమినరీ: ఈ పరీక్ష 100 ప్రశ్నలకు–70 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. రీజనింగ్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌  నుంచి ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
  • మెయిన్‌: ఈ పరీక్ష 120 ప్రశ్నలకు–300 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. ఇందులో రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్, డేటా అనాలసిస్, ఇన్సూరెన్స్‌ సంబంధిత ప్రశ్నలు, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌(లెటర్‌ రైటింగ్, ఎస్సే) నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల్లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అనేది అర్హత పరీక్ష మాత్రమే. 

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తులకు చివరి తేదీ: 31.01.2023
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: పరీక్షకు పదిరోజుల ముందు నుంచి
  • పరీక్ష తేదీ(ప్రిలిమినరీ): 2023 ఫిబ్రవరి 17, 20 తేదీల్లో
  • పరీక్ష తేదీ(మెయిన్స్‌): మార్చి 18, 2023
  • వెబ్‌సైట్‌: www.licindia.in

Also read: TS High Court Notification 2023: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 66 ఎగ్జామినర్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

Location MUMBAI
Qualification GRADUATE
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories