APPSC Notification: 190 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ఇంజినీర్లు
మొత్తం ఖాళీలు: 190
విభాగాలు: సివిల్, ఈఎన్‌వీ, మెకానికల్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధి సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎల్‌సీఈ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. దీన్ని మొత్తం 300 మార్కులకి నిర్వహిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్థాయి), పేపర్ 2 సివిల్/ మెకానికల్ (డిప్లొమా స్థాయి) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం | మార్కులు |
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 150 | 150 ని | 150 |
సివిల్/ మెకానికల్ (కామన్) | 150 | 150 ని | 150 |
ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ (పోస్ట్ కోడ్ 3కి మాత్రమే) | 150 | 150 ని | 150 |
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.10.2021.
ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది: 11.11.2021.
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి:
APPSC Recruitment 2021: విజయవాడలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
APPSC Recruitment 2021: ఏపీలో డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Civil Assistant Surgeon Posts: ఏపీలో 224 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
APPSC Recruitment 2021: ఆయుష్‌లో లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
APPSC Recruitment 2021: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Qualification | GRADUATE |
Last Date | November 11,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |