APPSC Jobs Notification 2024: గ్రూప్–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం
- ఏపీలో గ్రూప్–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు
- త్వరలోనే డీఎస్సీకి ప్రభుత్వం సన్నాహకాలు
- ఒకే అర్హతతో పలు పరీక్షలకు పోటీ పడే అవకాశం
- ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్–1, గ్రూప్–2, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్స్(పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
గ్రూప్–1 సర్వీసెస్
ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్1 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు), డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, కో–ఆపరేటివ్ సర్వీస్ డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–1), అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ తదితర ఉన్నతస్థాయి పోస్టులు ఉన్నాయి.
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 (జనరల్ స్టడీస్ 120 ప్రశ్నలు–120 మార్కులు); పేపర్–2 (జనరల్ ఆప్టిట్యూడ్ 120 ప్రశ్నలు–120 మార్కులు).
- మెయిన్ ఎగ్జామినేషన్: మెయిన్‌లో అయిదు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 మార్కులు చొప్పున 750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అవి.. పేపర్–1 జనరల్ ఎస్సే; పేపర్–2–ఏపీ, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం; పేపర్–3–పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా,ఎథిక్స్; పేపర్–4 ఎకానమీ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి; పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు. మెయిన్ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. చివరగా 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- గ్రూప్–1 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 21, 2024
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: మార్చి 17, 2024
చదవండి: APPSC Exams Latest Updates
899 పోస్టులతో గ్రూప్–2
ఏపీపీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా 899 ఎగ్జిక్యూటివ్, నాన్–ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు; 566 నాన్–ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ పేపర్‌తో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
- మెయిన్ ఎగ్జామినేషన్: స్క్రీనింగ్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్–1లో సెక్షన్–1: సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్–2లో సెక్షన్–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్–2 సైన్స్ అండ్ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.
- గ్రూప్–2 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 17, 2024
- గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 25, 2024
47 జూనియర్ లెక్చరర్స్
ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ పరిధిలో మొత్తం 47 జూనియర్ లెక్చరర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఇంగ్లిష్ –9; తెలుగు–2; ఉర్దూ–2; సంస్కృతం–2, ఒరియా–1; మ్యాథమెటిక్స్–1; ఫిజిక్స్–5; కెమిస్ట్రీ–3; బోటనీ–2; జువాలజీ–1; ఎకనామిక్స్–12; సివిక్స్–2; హిస్టరీ–5 పోస్టులు ఉన్నాయి.
- అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌తో పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష ఇలా: రాత పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. అవి.. పేపర్–1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ(150 ప్రశ్నలు–150 మార్కులు); పేపర్–2: సంబంధిత సబ్జెక్ట్ పేపర్(150 ప్రశ్నలు–300 మార్కులు). రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు జరుగుతుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 31–ఫిబ్రవరి 20, 2024
- పరీక్ష తేదీ: ఏప్రిల్/మేలో నిర్వహించే అవకాశం.
చదవండి: Group 2 Success Plan: ప్రతి సబ్జెక్ట్‌లో ముఖ్యమైన టాపిక్స్ ఇవే!!
240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ఆయా సబ్జెక్ట్‌లలో మొత్తం 240 డిగ్రీ లెక్చరర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బోటనీ–19; కెమిస్ట్రీ–26; కామర్స్–35; కంప్యూటర్ అప్లికేషన్స్–26; కంప్యూటర్ సైన్స్–31; ఎకనామిక్స్–16; హిస్టరీ–19; మ్యాథమెటిక్స్–17; ఫిజిక్స్–11; పొలిటికల్ సైన్స్–21; జువాలజీ–19.
- అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్ లేదా స్లెట్ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష: పేపర్–1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (150 ప్రశ్నలు–150 మార్కులు); పేపర్–2 (సంబంధిత సబ్జెక్ట్ పేపర్)–150 ప్రశ్నలు–300 మార్కులు. మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2024, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు.
- పరీక్ష తేదీ: ఏప్రిల్/మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
చదవండి: APPSC DEO Recruitment 2024- సిలబస్ ఇదే,ఇలా చదివితే.. DEO ఉద్యోగం మీదే..
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్
ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ విభాగంలో.. 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- అర్హత: బీఈడీ కోర్సు చేసేందుకు అర్హత ఉన్న సబ్జెక్ట్‌తో పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 150 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటుంది.
- మెయిన్ ఎగ్జామినేషన్: స్క్రీనింగ్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి రెండో దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌లో మూడు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్–1–జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (150 ప్రశ్నలు–150 మార్కులు); పేపర్–2–ఎడ్యుకేషన్–1 (150 ప్రశ్నలు–150 మార్కులు); ఎడ్యుకేషన్–2 (150 ప్రశ్నలు–150 మార్కులు). మొత్తం 450 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 9–జనవరి 29, 2024.
- స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: ఏప్రిల్ 13, 2024.
అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో.. 21 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన వెలువడింది.
- అర్హత: సివిల్/మెకానికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మూడు ఉంటాయి. పేపర్–1 (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులు); పేపర్–2 సబ్జెక్ట్ పేపర్ (150 మార్కులు– 150 ప్రశ్నలు; పేపర్–3 (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (150 ప్రశ్నలు – 150 మార్కులు).
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 30–ఫిబ్రవరి 19, 2024.
- పరీక్ష తేదీ: ఏప్రిల్ లేదా మే లో నిర్వహించే అవకాశం.
99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో 21 సబ్జెక్ట్‌లలో మొత్తం 99 పోస్ట్‌లకు నోటిఫికేషన్ వెలువడింది.
- అర్హత: సబ్జెక్ట్‌ను అనుసరించి బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను రెండు పేపర్లుగా 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్–1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ–150 ప్రశ్నలు–150 మార్కులు; పేపర్–2: సంబంధిత సబ్జెక్ట్ పేపర్ –150 ప్రశ్నలు– 300 మార్కులకు ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18, 2024.
- పరీక్ష తేదీ: ఏప్రిల్ లేదా మేలో నిర్వహించే అవకాశం.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి: APPSC Group-1,2: గ్రూప్స్ అభ్యర్థులు చదవాల్సిన పుస్తకాలు ఇవే!!
‘ఉమ్మడి’గా రాణించేలా ప్రిపరేషన్
ఏపీపీఎస్సీ ద్వారా పలు నియామక పరీక్షలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. గ్రూప్–1, గ్రూప్–2లకు తొలి దశ పరీక్ష తేదీలను సైతం ప్రకటించారు. మిగతా పోస్ట్‌లకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా పరీక్షలకు సంబంధించి దాదాపు 70 నుంచి 80 శాతం వరకు సిలబస్ అంశాలు ఒకే విధంగా ఉండటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. ఒకే ప్రిపరేషన్‌తో పలు పరీక్షల్లో రాణించే అవకాశముంది.
సిలబస్ పరిశీలన
ఒకే సమయంలో పలు పరీక్షలకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు తొలుత ఆయా పరీక్షల సిలబస్‌ను పరిశీలించాలి. సిలబస్‌లో వేర్వేరుగా ఉన్న టాపిక్స్ తెలుసుకోవాలి. ఉమ్మడి టాపిక్స్ సిలబస్‌కు, ప్రత్యేక టాపిక్స్ సిలబస్‌కు సమయం కేటాయించుకోవడం; ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్స్‌కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవడం; సదరు పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్న తీరుపై అవగాహన పెంచుకోవడం ద్వారా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.
ఆబ్జెక్టివ్.. డిస్క్రిప్టివ్
ఒక పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో, మరో పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటే ఎలా చదవాలి? అనే ప్రశ్న ఎదురవుతుంది. ముఖ్యంగా గ్రూప్–1 ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష. అదే సమయంలో పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే పరీక్ష గ్రూప్–2. పరీక్ష విధానం ఏదైనా డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. దీని ద్వారా రెండు రకాల పరీక్షల్లో విజయానికి అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్ కొట్టేలా!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 20,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- APPSC Notification 2024
- APPSC
- APPSC Group 1 Notification
- APPSC Group 2 Notification
- AP Mega DSC Notification 2024
- APPSC Group 2 Syllabus
- APPSC Group 1 Syllabus
- Competitive Exams
- APPSC preparation tips
- Degree College Lecturer Jobs
- Junior Lecturer Jobs
- andhra pradesh govt jobs 2024
- AP Govt jobs
- Jobs in Andhra Pradesh
- latest notification 2024
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- AP Pollution Control Board
- Apply for Group-2 Posts
- APPSC Group-1
- junior lecturers
- polytechnic lecturers posts in ap