Skip to main content

KTR Demands Job Calendar 2024 : ఏడు నెలలు పూరైంది.. ఇంకెప్పుడు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటిపోయింది. ఇంకా ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్‌ జారీ చేయకుండానే 2 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అంటూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు.
KTR Demands Job Calendar 2024

రాహుల్ గాంధీ గారు.. మీరు వ్యక్తిగతంగా నిరుద్యోగులను కలిశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని తెలంగాణ యువకులకు హామీ ఇచ్చారు. మీ పార్టీ మీ వాగ్దానాన్ని అనుసరించే తేదీలతో పాటు అన్ని ప్రముఖ వార్తాపత్రికలలో ఉద్యోగ క్యాలెండర్ కూడా ప్రచురించింది. ఇప్పటికి 7 నెలలు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు అంటూ మండిపడ్డారు.

➤ Telangana Job Calendar 2024 : జాబ్ క్యాలెండర్ 2024 విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే.. ఇంకా పోస్టుల సంఖ్య పెంపుకు..!

ఎలాంటి నోటిఫికేషన్‌లు జారీ చేయకుండానే 2 లక్షల రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మీ ప్రభుత్వం ఎలా అందిస్తుంది?. తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యులు ఎవరూ పట్టించుకోనందున దయచేసి స్పందించండి అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Published date : 02 Jul 2024 06:03PM

Photo Stories