Skip to main content

Telangana Job Calendar 2024 : జాబ్ క్యాలెండర్ 2024 విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే.. ఇంకా పోస్టుల సంఖ్య పెంపుకు..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని.. అలాగే ప్ర‌తి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుద‌ల చేస్తామ‌ని ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.
Annual job calender release  Election promise on employment opportunities  Telangana CM Revanth Reddy  congress party employment agenda  Telengana government job promise

కానీ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చి ఆరు నెల‌లు పూరైయి.. ఏడో నెల జ‌రుగుతుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు పైన చెప్పిన విధంగా ఒక‌టి కూడా అమ‌లు చేయ‌లేదు. దీంతో తెలంగాణ‌లోని నిరుద్యోగులు ఆందోళ‌న‌లు చేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తనకు వాస్తవాలు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారంటూ పార్టీ నేతలపై, అధికారులపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది.

➤ Bank Clerk Jobs 2024 : 6,137 క్లర్క్ పోస్టుల‌కు భారీ నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు, ఇవే..

ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ నిన్న గాంధీ ఆస్పత్రిలో నిరవధిక దీక్ష చేస్తున్న మోతీలాల్ తో పాటు నిరుద్యోగులతో మాట్లాడింది. ఇవాళ ఉదయం పలువురు నిరుద్యోగులను గాంధీభవన్ కు పిలిపించుకొని చర్చించింది. ఈ సందర్భంగా వాళ్లు ప్రధానంగా నాలుగు డిమాండ్లను కమిటీ ముందుంచారు. వాటిని నోట్ చేసుకున్న కమిటీ ఈ సాయంత్రం ముఖ్యమంత్రితో భేటీ కానుంది. ఈ నాలుగు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు..

telangana cm revanth reddy meeting on job job calendar 2024

ఈ మీటింగ్ త‌ర్వాత‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జాబ్ జాబ్ కేలండర్ విడుద‌ల‌ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. ఏటా నోటిఫికేషన్‌లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్‌ వెలువరించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. ఉద్యోగ క్యాలెండర్‌ విడుదలపై నిర్ణయం తీసుకొన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుంది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group-1&2&3 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఉద్యోగ నోటిఫికేషన్‌ను సిద్ధం..

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖలు రాసింది. ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాధిపతులు, నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించి తుదిరూపు తీసుకువచ్చింది. రానున్న మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారితో ఏర్పడే ఖాళీలను గుర్తించాలి. అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్‌-1, 2, 3, 4 సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్‌ ఉండాలి అని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

➤ TSPSC Group1 Prelims Result 2024 Release Date : రెండు రోజుల్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుద‌ల‌.. ఈ సారి క‌టాఫ్ ఇంతేనా..!

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సీఎం స్వయంగా అక్కడికి వెళ్లి ఛైర్మన్‌తో మాట్లాడి, విధానాల్ని తెలుసుకున్న విషయం తెలిసిందే. ముసాయిదా క్యాలెండర్‌లో స్వల్ప మార్పుల అనంతరం త్వరలోనే ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీకి ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర జాబ్‌ క్యాలెండర్‌ రూపకల్పన కార్యాచరణలో టీజీపీఎస్సీ ప్రధాన భూమిక పోషించింది. 

ఇందులో.. ఏ నెలలో ఏ నోటిఫికేషన్‌ ఇస్తారు? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలపై స్పష్టమైన గడువు ఉంటుంది. ఆ గడువులోగా ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయి. న్యాయవివాదాలు తలెత్తకుండా సర్వీసు నిబంధనల ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ వేగంగా లభించేలా కార్యాచరణ సిద్ధమైందని సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి.

ఇంకా ఉద్యోగాల‌ను పెంచాల్సిందే..
ఇంకా నిరుద్యోగులు గ్రూప్–1 లో 1:100 పద్ధతిలో పిలవాల‌ని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్–2,3లో కొలువుల సంఖ్య పెంచాల‌న్నారు. గ్రూప్–2ను డిసెంబర్ లో  నిర్వహించాల‌న్నారు. అలాగే డీఎస్సీని ఆగస్టులో నిర్వహిచాల‌న్నారు.

➤ Inspirational Success Story : ఒకే వ్యక్తి మూడు ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు కొట్టాడిలా.. కానీ..

Published date : 02 Jul 2024 05:51PM

Photo Stories