Bank Exam Preparation: 8,773 జూనియర్ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ వివరాలు ఇవే..
- మొత్తం 8,773 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- జూనియర్ అసోసియేట్ హోదాలో నియామకం
- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో దరఖాస్తుకు అర్హత
- ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపిక
మొత్తం పోస్టులు 8,773
ఎస్‌బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా దేశంలోని 17 సర్కిల్స్‌లోని మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఇందులో 8,283 రెగ్యులర్ పోస్ట్‌లు కాగా.. మిగతావి బ్యాక్‌లాగ్ పోస్ట్‌లుగా పేర్కొంది.
ఏపీలో 50, తెలంగాణలో 525
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అమరావతి సర్కిల్‌లో 50 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525 పోస్ట్‌లు ఉన్నాయి.
చదవండి: Bank Jobs 2023: ఐడీబీఐలో 2100 జేఏఎం, ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
అర్హతలు
- 2023, డిసెంబర్ 31 నాటికి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/తత్సమాన అర్హత ఉండాలి. గ్రాడ్యుయేషన్/తత్సమాన కోర్సు ఫైనల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు: 2023, ఏప్రిల్ 1 నాటికి 20-28 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ఇలా
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామ్‌లతోపాటు స్థానిక భాష పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష
తొలి దశలో ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. నెగెటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 1/4 మార్కును తగ్గిస్తారు.
రెండో దశ మెయిన్
ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఒక్కో పోస్ట్‌కు పది మందిని (1:10 నిష్పత్తిలో) మెయిన్‌కు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో 190 ప్రశ్నలు-200 మార్కులకు మెయిన్ పరీక్ష జరుగుతుంది. ఇందులో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటల 40 నిమిషాలు.
మెయిన్ మార్కులతోనే మెరిట్ లిస్ట్
మెయిన్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక చేప్తారు. ప్రిలిమినరీ పరీక్ష మార్కులకు ఫైనల్ సెలక్షన్‌లో పరిగణనలోకి తీసుకోరు. ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్ నియామక ప్రక్రియలో విజయం సాధించి కొలువు సొంతం చేసుకుంటే బ్యాంకింగ్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతమవుతుంది. భవిష్యత్తులో చీఫ్ మేనేజర్, డీజీఎం వంటి స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.
ఆకర్షణీయ వేతనం
జూనియర్ అసోసియేట్‌గా కొలువుదీరిన వారికి ఆకర్షణీయ వేతనం లభిస్తుంది. ప్రారంభ మూల వేతనం రూ.19,900గా ఉంటుంది. వీటితోపాటు రెండు ఇంక్రిమెంట్స్‌కు అర్హత లభిస్తుంది. మొత్తంగా మెట్రో సిటీల్లో నెలకు రూ.37,000 వేతనం అందుతుంది. ఇతర ప్రాంతాల్లో రూ.32 వేల వరకు లభిస్తుంది.
చదవండి: Bank Jobs: 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 7, 2023
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2024, జనవరిలో
- మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: 2024, ఫిబ్రవరిలో
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bank.sbi/web/careers, https://www.sbi.co.in/careers
పక్కా ప్రిపరేషన్‌తోనే సక్సెస్
ప్రిలిమ్స్ పరీక్ష 2024 జనవరిలో.. మెయిన్స్ ఎగ్జామ్ 2024 ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించారు. అంటే.. ప్రిలిమ్స్‌కు గరిష్టంగా రెండు నెలలు, మెయిన్స్‌కు మూడు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని.. ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ అంశాలపై పట్టు సాధించాలి. మెయిన్‌లో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
న్యూమరికల్ ఎబిలిటీ
ప్రిలిమ్స్ పరీక్షలో మరో కీలక విభాగం ఇది. మెయిన్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ప్రధానంగా అర్థమెటిక్ అంశాలు.. పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ-నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలపై అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై దృష్టి పెట్టాలి.
చదవండి: Banks - Study Material
రీజనింగ్
పరీక్షలో నిర్ణయాత్మక విభాగం ఇది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ రీజనింగ్ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్‌లను ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రిలిమ్స్ సమయానికి ఈ అంశాల్లో పట్టు సాధిస్తే మెయిన్‌లో అధిక శాతం సిలబస్‌ను కూడా పూర్తి చేసినట్లవుతుంది.
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్
మెయిన్ పరీక్షలో మాత్రమే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్‌లో ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ప్రాధాన్యం ఇవ్వాలి.
కంప్యూటర్ అప్టిట్యూడ్
మెయిన్‌లో ఉండే ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేషన్స్, కంప్యూటర్ స్ట్రక్చర్,ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి.
చదవండి: Banks - Guidance
ప్రీవియస్, మోడల్ పేపర్స్
గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్‌లు పరీక్షలో విజయానికి దోహదపడతాయి. ఆ టాపిక్స్‌కు పరీక్షలో లభిస్తున్న వెయిటేజీపై అవగాహన లభిస్తుంది.
పరీక్షలో చేస్తున్న పొరపాట్లను సమీక్షించుకునే వీలుంటుంది. అంతేకాకుండా మాక్ టెస్ట్‌ల ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది.
Qualification | GRADUATE |
Last Date | December 07,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- SBI Recruitment 2023
- Bank Exam Preparation Tips
- SBI Jobs 2023 Notification
- Bank Exam Guidance
- Bank Exam Pattern
- Bank Exams Bitbank
- exam pattern and syllabus
- Junior Associate Jobs
- SBI Prelims Exam Date
- SBI Mains Exam Date
- JobRecruitment
- BankingCareers
- JobOpportunity
- SBIRecruitment
- Job Opening in SBI
- latest jobs in telugu.
- sakshi education job notifications