Bank Jobs: విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్‌లో 30 పీవో పోస్టులు.. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక
అర్హత: కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 20-30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక ఇలా
రెండంచెల్లో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష
ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం మూడు విభాగాలుంటాయి. జనరల్ ఇంగ్లిష్ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్ విభాగాల నుంచి 35 మార్కులకు-35 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ప్రతిభ చూపిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.అభ్యర్థులు మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
250 మార్కులకు మెయిన్
మెయిన్ పరీక్ష మొత్తం 250 మార్కులకు ఉంటుంది. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ పరీక్షలో 4 విభాగాలు నుంచి ప్రశ్నలుంటాయి. జనరల్ ఇంగ్లిష్ 35 ప్రశ్నలు-40 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 30 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ/కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్/ఎకానమీ /బ్యాంకింగ్ అవేర్‌నెస్ విభాగం నుంచి 60 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతితప్పు సమాధానానికి నాల్గోవంతు మార్కు కోత ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి లెటర్ రైటింగ్, ఎస్సే అండ్ ప్రిసైస్ రైటింగ్ ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.
ఇంటర్వ్యూ
మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి 1:4 నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ 50మార్కులకు ఉంటుంది. ఇందులో ఎంపికైన వారిని తుదిగా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.01.2024
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024
వెబ్‌సైట్: https://www.vcbl.in/
చదవండి: Exam Preparation Tips: ఇలా చేస్తే.. సర్కారీ కొలువు సులువు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 28,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Visakhapatnam Cooperative Bank Recruitment 2024
- VCBL Recruitment 2024
- Bank Jobs 2024
- Probationary Officer Jobs
- andhra pradesh govt jobs 2024
- andhra pradesh jobs 2024
- Preliminary Examination
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- SelectionProcess
- CareerOpportunity
- RecruitmentAlert
- POPosts
- bank jobs in 2024