Skip to main content

NIC Recruitment 2024: బీమా సంస్థలో 274 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక

ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌ఐసీ) పలు ఉద్యోగాల భర్తీకి ప్ర­కటన విడుదల చేసింది. ఇందులో భాగంగా 274 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ (జనరలిస్ట్స్,స్పెషలిస్ట్స్‌) స్కేల్‌–1 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల అ­భ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Apply Online for 274 Administrative Officer Posts at NIC  NIC Administrative Officers Recruitment 2024   NIC Recruitment   NIC Scientist B Syllabus and Exam Pattern 2024   Administrative Officer Jobs at NIC - Scale-1
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక
  • ఎంపికైతే నెలకు రూ.85వేల వరకూ వేతనం

మొత్తం పోస్టుల సంఖ్య: 274
పోస్టుల వివరాలు

  • డాక్టర్స్‌: ఈ విభాగంలో 28 ఉద్యోగాలున్నాయి. ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌ /పీజీ–మెడికల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. లేదా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ గుర్తించిన మెడికల్‌ డిగ్రీ పూర్తిచేయాలి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌లో రిజిస్టరై ఉండాలి.
  • లీగల్‌: ఈ విభాగంలో 20 పోస్టులు ఉన్నా­యి. ఇందులో లా గ్రాడ్యుయేషన్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ను 60శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి.
  • ఫైనాన్స్‌: ఈ విభాగంలో 30 ఖాళీలున్నాయి. ఛార్టెడ్‌ అకౌంటెంట్‌(ఐసీఏఐ/కాస్ట్‌ అకౌంటెంట్‌(ఐసీడబ్ల్యూఏ) పూర్తిచేయాలి. లేదా బీకాం/ఎంకామ్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55శాతం సరిపోతుంది.
  • యాక్చూరియల్‌: ఇందులో 2 పోస్టులున్నా­యి. స్టాటిస్టిక్స్‌/మేథమెటిక్స్‌ /యాక్చూరియల్‌ సైన్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి.
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: ఇందులో 20 ఖాళీలున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌  టెక్నాలజీ­లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55శాతం ఉండాలి.
  • ఆటోమొబైల్‌ ఇంజనీర్స్‌: ఈ విభాగంలో 20 పోస్టులున్నాయి. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం మార్కులు సరిపోతాయి.
  • జన రలిస్ట్‌ ఆఫీసర్స్‌: ఇందులో 130 పోస్టులున్నాయి. ఏదైనా డిగ్రీ/పీజీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీలకు 55శాతం సరిపోతుంది.
  • హిందీ(రాజ్‌భాష) ఆఫీసర్స్‌: ఈ విభాగంలో 24 పోస్టులున్నాయి. హిందీ పీజీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం మార్కులు సరిపోతాయి. ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదివుండాలి. లేదా హిందీ ఒక సబ్జెక్టుగా ఇంగ్లిష్‌లో పీజీ చేయాలి.

వయసు
01.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు,పీడబ్ల్యూబీడీల కు 10ఏళ్లు,ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 5ఏళ్ల వర­కు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

చదవండి: UIIC Recruitment 2024: యూఐఐసీలో 250 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

ఎంపిక ఇలా
హిందీ ఆఫీసర్స్‌ పోస్టులకు తప్ప.. మిగతా అన్ని పోస్టులకూ ఎంపిక విధానం ఒకే విధంగా ఉంటుంది. ఎంపికలో భాగంగా రెండు దశల్లో రాతపరీక్షను  నిర్వహిస్తారు. మొదటి దశ (ఫేజ్‌–1)లో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, రెండో దశ (ఫేజ్‌–2)లో ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష ఉంటాయి.

ఫేజ్‌–1 ప్రిలిమినరీ
ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌–30 మార్కు­లు,రీజనింగ్‌ ఎబిలిటీ–35 మార్కులు,క్వాంటిటేటి వ్‌ ఆప్టిట్యూడ్‌–35 మార్కులకు ప్రశ్నలుంటాయి. పరీ„ý  సమయం 60 నిమిషాలు. ప్రతి సెక్షన్‌నూ నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తిచేయాలి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఫేజ్‌–2లోని మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.

250 మార్కులకు మెయిన్‌ పరీక్ష
మెయిన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో 250 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ 30 మార్కులకు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ అనంతరం డిస్క్రిప్టివ్‌ రాయాలి. మెయిన్‌ పరీక్ష జనరలిస్ట్, స్పెషలిస్టు పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది. 
జనరలిస్ట్‌ పోస్టులకు: ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగం నుంచి 50 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. అవి... రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/హిందీ భాషల్లో ఉంటుంది.
స్పెషలిస్టు పోస్టులకు: ఇందులో 6 విభాగా­లుంటాయి. మొదటి 5 విభాగాలు రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలకు, 40 మార్కులుంటాయి. చివరి విభాగం టెక్నికల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు వంతు మార్కును తగ్గిస్తారు.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌కు 30 మార్కులు (ఎస్సే–10, కాంప్రహెన్షన్‌–10) కేటాయించారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. తుది జాబితా రూపకల్పనలో ఈ మార్కులను పరిగణలోకి తీసుకోరు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 22.01.2024

వెబ్‌సైట్‌: https://nationalinsurance.nic.co.in/

చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 22,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories