Skip to main content

Jobs in Central Bank of india: సెంట్రల్‌ బ్యాంకులో పదో తరగతి అర్హతతో 484 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో సఫాయి కర్మాచారి కమ్‌ సబ్‌–స్టాప్‌/సబ్‌–స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. జనవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Central Bank Recruitment 2024    Apply Online Before 9th Jan  Jobs in Central Bank of india   Central Bank of India Jobs  Online Application Deadline

పోస్టుల వివరాలు: సఫాయి కర్మాచారి కమ్‌ సబ్‌–స్టాఫ్‌/ సబ్‌–స్టాఫ్‌: 484
జోన్లవారీగా ఖాళీలు.. అహ్మాదాబాద్‌–76, భోపాల్‌–38, ఢిల్లీ–76,కోల్‌కతా–02, లఖ్‌నవూ–78, ఎంఎంజడ్‌వో అండ్‌ పుణె–118, పట్నా–96.
అర్హత: ఎస్‌ఎస్‌సీ/పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.03.2023 నాటికి 18–26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.14,500–రూ.28145.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష(70 మార్కులు), లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ (30 మార్కులు), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నాలెడ్జ్, జనరల్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అర్థమేటిక్, సైకోమెట్రిక్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ (రీజనింగ్‌) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09.01.2024.
సీబీటీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024

వెబ్‌సైట్‌: https://centralbankofindia.co.in/en

చదవండి: LIC HFL Recruitment: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 250 అప్రెంటిస్‌లు.. రాతపరీక్ష తేది ఇదే....

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 09,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories