Skip to main content

IBPS Recruitment 2022: 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. విజ‌యం సాధించేందుకు ప్రిప‌రేష‌న్ టిప్స్ ఇవే..

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, లా, అగ్రికల్చర్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారి కోసం.. ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది! దీనిద్వారా 710 ఎస్‌ఓ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఆయా అర్హతలు కలిగిన అభ్యర్థులు సరైన వ్యూహంతో అడుగులు వేస్తే.. సర్కారీ బ్యాంకుల్లో స్కేల్‌ 1 కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ సీఆర్‌పీ-ఎస్‌పీఎల్‌-12 నోటిఫికేషన్‌ వివరాలు, భర్తీ చేయనున్న పోస్టులు, ఎంపిక విధానంతోపాటు విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం...
IBPS SO Preparation Tips 2022 for Prelims & Mains
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌ఓ పోస్టులకు ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ 
  • మొత్తం 11 బ్యాంకుల్లో 710 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ

11 బ్యాంకులు.. 710 పోస్ట్‌లు

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పలు హోదాల్లోని ఖాళీల భర్తీకి.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌) నియామక ప్రక్రియ చేపడుతోంది. మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

చ‌ద‌వండి: IBPS Recruitment 2022: 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

పోస్టుల వివరాలు

ఐటీ ఆఫీసర్‌(స్కేల్‌-1): 44 పోస్ట్‌లు; అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 516 పోస్ట్‌లు; రాజ్‌భాష అధికారి(స్కేల్‌-1): 25 పోస్ట్‌లు; లా ఆఫీసర్‌(స్కేల్‌-1): 10 పోస్ట్‌లు; హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 15 పోస్ట్‌లు; మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1): 100 పోస్ట్‌లు.

అర్హతలు

  • ఆయా పోస్టులను అనుసరించి మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, లా తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
  • వయసు: అన్ని పోస్ట్‌లకు నవంబర్‌ 1, 2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌-క్రీమీ లేయర్‌)లకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.

 
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి ఐబీపీఎస్‌ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. అవి.. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మినహా మిగతా విభాగాలకు ఇంగ్లిష్‌ లేదా హిందీ మీడియంలలో హాజరుకావచ్చు.

ప్రిలిమినరీ (లా ఆఫీసర్, రాజ్‌ భాష అధికారి)

ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ విత్‌ స్పెషల్‌ రిఫరెన్స్‌ టు బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ 50 ప్రశ్నలు-50 మార్కులు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు-125 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. 

ఇతర పోస్ట్‌లకు ప్రిలిమినరీ ఇలా

ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.

చ‌ద‌వండి: Bank Jobs: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, చెన్నైలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.69,810 వ‌ర‌కు వేతనం..

రెండో దశ మెయిన్‌

  • ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులు, సబ్జెక్ట్‌/సెక్షన్‌ వారీగా నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు పొందిన వారిని.. అందుబాటులోకి ఖాళీలను పరిగణనలోకి తీసుకుంటూ మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. 
  • రాజ్‌ భాష అధికారి పోస్ట్‌లకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలో, మిగతా పోస్ట్‌లకు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 
  • రాజ్‌ భాష అధికారి మెయిన్‌లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌పై 45 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ డిస్క్రిప్టివ్‌లో 2 ప్రశ్నలు అడుగుతారు. రెండు విభాగాలకు సంబంధించి మొత్తం 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విభాగానికి సంబంధించి అభ్యర్థులు ఇంగ్లిష్‌ లేదా హిందీ మీడియంలో ఒక ఎస్సే రైటింగ్, ఒక లెటర్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది.
  • ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నిర్వహించే మెయిన్‌ పరీక్షలో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌పై 60 ప్రశ్నలు-60 మార్కులకు ఉంటాయి. 
  • ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలు చేస్తున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

చివరగా ఇంటర్వ్యూ

ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా.. ఖాళీలను అనుసరించి మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. 100మార్కులకు జరిగే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగం పట్ల ఉన్న ఆసక్తి,తాజా పరిణామాలపై అవగాహన, వ్యక్తిగత దృక్పథం వంటి అంశాలను పరిశీలిస్తారు.

80:20 వెయిటేజీ విధానం

తుది జాబితా రూపకల్పనలో మెయిన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో పొందిన మార్కులకు 80:20 నిష్పత్తిలో వెయిటేజీ విధానాన్ని అనుసరించి.. విజేతలను ఖరారు చేస్తారు. అంటే.. మొత్తం వంద మార్కులకు తుది జాబితాను నిర్ధారించి.. అందులో పైన పేర్కొన్న వెయిటేజీలను క్రోడీకరించి.. విజేతల జాబితాను సిద్ధం చేస్తారు. 

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

విజయ సాధనకు మార్గాలివే

బ్యాంకు పరీక్షలంటేనే తీవ్రమైన పోటీ నెలకొంటుంది. కాబట్టి స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. దరఖాస్తు సమయం నుంచే విజయం దిశగా అడుగులు వేయాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్,జంబుల్డ్‌ సెంటెన్సెస్,ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే ఇంగ్లిష్‌ ఎస్సే రైటింగ్,లెటర్‌ రైటింగ్‌ కోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, ఎడిటోరియల్‌ లెటర్స్‌ అనుసరించడం మేలు చేస్తుంది.

రీజనింగ్‌

ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో ప్రధానంగా భావించే రీజనింగ్‌ ప్రిపరేషన్‌ పరంగా అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు నంబర్‌ సిరీస్, డేటా అనాలిసిస్‌ విభాగాలను కూడా ప్రాక్టీస్‌ చేస్తే ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌

లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి పోస్ట్‌ల ప్రిలిమినరీలో ఉండే ఈ విభాగం కోసం అభ్యర్థులు మరింత ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలి. కారణం.. జనరల్‌ అవేర్‌నెస్‌ విత్‌ స్పెషల్‌ రిఫరెన్స్‌ టు బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విభాగంలో రాణించాలంటే.. జాతీయ ఆర్థిక రంగంలో తాజా పరిణామాలు,బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపైనా పట్టు సాధించాలి. 

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌

మెయిన్‌ పరీక్షలో ఉండే ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ విభాగంలో రాణించేందుకు అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్, దానికి సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్‌ 21,2022
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 24, 31 తేదీల్లో
  • ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీ: జనవరి 29, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in/
     
Qualification GRADUATE
Last Date November 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories