1036 Jobs in IDBI Bank: మూడేళ్ల పాటు విధులు... ఈ అనుభవంతో బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు
- 1,036 ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు ఐడీబీఐ ఎంపిక ప్రక్రియ
- ఒప్పంద ప్రాతిపదికగా మూడేళ్ల పాటు విధులు
- ఈ అనుభవంతో బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు
- రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా నియామకం ఖరారు
ఐడీబీఐ.. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా! దాదాపు ఆరు దశాబ్దాలుగా బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తోంది. 1964లో ఏర్పాటైన ఈ సంస్థ.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో సిటీల వరకూ.. 1,890 శాఖలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యంగ్ ప్రొఫెషనల్స్‌ను కూడా భాగస్వాములను చేసే ఉద్దేశంతో..గత కొన్నేళ్లుగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తోంది. తాజాగా 2023 సంవత్సరానికి సంబంధించి ఈ ప్రక్రియను ప్రారంభించింది.
చదవండి: IDBI Bank Recruitment 2023: ఐడీబీఐ బ్యాంక్‌లో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
1,036 పోస్ట్‌లు
ఐడీబీఐ మొత్తం 1,036 కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఓపెన్ కేటగిరీలో 451, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 103, ఓబీసీ కేటగిరీలో 255, ఎస్‌సీ కేటగిరీలో 160, ఎస్‌టీ కేటగిరీలో 67 పోస్ట్‌ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఎంపిక ప్రక్రియలో పొందిన మార్కుల ఆధారంగా.. రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియామకాలు ఖరారు చేస్తారు.
అర్హతలు
- మే 1, 2023 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: మే 1, 2023 నాటికి 20-25 ఏళ్లు(మే 2,1998-మే 1,2003 మధ్య జన్మించి ఉండాలి) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
మూడేళ్ల కాంట్రాక్ట్
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి తొలుత ఏడాది కాలానికి నియామకం అందిస్తారు. ఆ తర్వాత పనితీరు, ప్రతిభ ఆధారంగా మరో రెండేళ్లు పొడిగిస్తారు. ఈ వ్యవధిలో మొదటి ఏడాది నెలకు రూ.29 వేలు, రెండో ఏడాది నెలకు రూ.31 వేలు, మూడో ఏడాది నెలకు రూ.34 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు.
చదవండి: IBPS RRB Notification 2023: ఐబీపీఎస్–ఆర్‌ఆర్‌బీల్లో 8612 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఎ) ఎంపిక ప్రక్రియ
కాంట్రాక్ ఎగ్జిక్యూటివ్‌గా మూడేళ్ల పాటు సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన వారికి ఐడీబీఐలోనే శాశ్వత కొలువు సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది. మూడేళ్ల కాంట్రాక్ట్ గడువు ముగిశాక..బ్యాంక్ అంతర్గతంగా ప్రత్యేక ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఇందులో విజయం సాధించిన వారికి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ హోదాలో కొలువు ఖరారు చేస్తారు. ప్రారంభంలో నెలకు రూ.36 వేల మూల వేతనం అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ ఇలా
ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ టెస్ట్.. 200 మార్కులు
- కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఎంపిక ప్రక్రియలో మొదటి దశగా పేర్కొనే రాత పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాల్లో మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 60 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్/కంప్యూటర్/ ఐటీ 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. ఇలా మొత్తం 200 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
- పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఆన్‌లైన్ టెస్ట్‌కు కేటాయించిన సమయం రెండు గంటలు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన(ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు) అమల్లో ఉంది.
తదుపరి దశల్లో
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు. ఈ దశలో అభ్యర్థుల విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. మెడికల్ టెస్ట్ నిర్వహించి అన్నింటిలోనూ సంతృప్తికరంగా ఉంటే.. నియామకం ఖరారు చేస్తారు.
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
ప్రిపరేషన్ పక్కాగా
లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఈ విభాగానికి సంబంధించి డైరక్షన్స్, డిస్టెన్స్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, డబుల్ లైనప్, డయాగ్రమ్స్, ఫ్లో చార్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్
ఈ విభాగంలో మంచి మార్కులు పొందేందుకు గ్రామర్ అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్‌లను ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో రాణించేందుకు మ్యాథమెటిక్స్‌లోని కోర్ అంశాలతోపాటు అర్థమెటిక్ అంశాల(నిష్పత్తులు, శాతాలు, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, యావరేజెస్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, కూడికలు,హెచ్చవేతలు తదితరాల పై దృష్టి పెట్టాలి.
జనరల్ అవేర్‌నెస్
ఇందులో మంచి మార్కుల కోసం కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుసుకోవాలి. బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపంతోపాటు తాజా పరిణామాలు, బ్యాంకింగ్ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్/ఐటీ అవేర్‌నెస్ విషయంలో అభ్యర్థులు కంప్యూటర్ ఆపరేషన్ టూల్స్‌పై పట్టు సాధించాలి.
110 మార్కులు పొందేలా
మొత్తం 200 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో.. మెరిట్ జాబితాలో నిలిచేందుకు అభ్యర్థులు 110 మార్కులు సాధించేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
గతంలో జనరల్ కేటగిరీలో 101.75 మార్కులు, ఓబీసీ కేటగిరీలో 96.25 మార్కులు, ఎస్సీ కేటగిరీలో 90 మార్కులు, ఎస్టీ కేటగిరీలో 80.25 మార్కులు కటాఫ్‌గా నమోదయ్యాయి. ఓపెన్ కేటగిరీలో అభ్యర్థులు 110 మార్కులు సాధించేలా కృషి చేస్తే రాత పరీక్ష మెరిట్ జాబితాలో నిలిచే అవకాశం ఉంటుంది.
అవకాశాలు ఇలా
ఐడీబీఐలో కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై.. మూడేళ్లపాటు విధులు నిర్వర్తించిన అభ్యర్థులు భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకునే వీలుంది. ప్రస్తుతం పలు ప్రైవేట్ బ్యాంకులు, ఫిన్‌టెస్ సంస్థలు, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం స్పెషలిస్ట్ ఆఫీసర్ సెలక్షన్ పేరుతో ఆయా విభాగాల్లో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకులో పొందిన అనుభవం అర్హతగా సదరు ఉద్యోగాలను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: మే 24 -జూన్ 7, 2023
- ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూలై 2, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.idbibank.in/
Qualification | GRADUATE |
Last Date | June 07,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |