Skip to main content

8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు... ఎంపిక విధానం...

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. జూనియర్‌ అసోసియేట్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలచేసింది.
Apply Now, SBI Vacancies, Mumbai Headquarters, Customer Support Job, SBI Notification, Job Opportunity, sbi recruitment 2023 for 8773 junior associate jobs, Junior Associate Recruitment,

మొత్తం పోస్టుల సంఖ్య: 8,773.
హైదరాబాద్‌ సర్కిల్‌(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 525
అమరావతి సర్కిల్‌(ఆంధ్రప్రదేశ్‌)లో పోస్టుల సంఖ్య: 50
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1995 నుంచి 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: బేసిక్‌ పే: నెలకు రూ.19,900.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.12.2023
ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024.
మెయిన్‌ పరీక్ష: ఫిబ్రవరి 2024.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/

చ‌ద‌వండి: SBI Bank Jobs: ఎస్‌బీఐలో డేటా అనలిస్ట్‌ పోస్టులు.. ఏడాదికి రూ.25 లక్షల వరకు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories