Postal Jobs: 1,899 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం విధానం ఇదే
అభ్యర్థులు విజేతలుగా నిలిచిన క్రీడల స్థాయిని పరిగణనలోకి తీసుకుని నియామకాలు ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో.. పోస్టల్ శాఖ.. స్పోర్ట్స్ కోటా విధానంలో చేపట్టనున్న నియామకాలు, పోస్ట్‌లు, అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు..
- స్పోర్ట్స్ కోటాలో 1,899 పోస్ట్‌ల భర్తీ
- పోస్ట్‌మ్యాన్ మొదలు ఎంటీఎస్ వరకు అయిదు హోదాల్లో నియామకాలు
- క్రీడల పోటీల స్థాయిని పరిగణనలోకి తీసుకుని ఎంపిక
మొత్తం 1,899 పోస్టులు
ఇండియా పోస్ట్స్.. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 1,899 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో పోస్టల్ అసిస్టెంట్ – 598 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ – 143 పోస్టులు, పోస్ట్ మ్యాన్ – 585 పోస్టులు, మెయిల్ గార్డ్ – 3 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 570 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 61 పోస్టులు, తెలంగాణలో 59 పోస్టులు ఉన్నాయి.
అన్ని సర్కిల్స్‌కు దరఖాస్తు అవకాశం
సర్కిల్స్ వారీగా ఖాళీలను పేర్కొన్న నేపథ్యంలో.. నిర్దేశిత క్రీడల పోటీల విజేతలు.. అన్ని సర్కిల్స్‌కు తమ అర్హతలకు సరితూగే పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆయా సర్కిల్స్, పోస్ట్‌లను ప్రాథమ్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది.
విద్యార్హతలివే
- పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్:బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించాలి. అదే విధంగా.. ఆయా సర్కిల్స్ లేదా డివిజన్స్‌కు సంబంధించిన స్థానిక భాషను పదో తరగతిలో ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి. దీంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అదే విధంగా పోస్ట్ మ్యాన్ పోస్ట్‌ల అభ్యర్థులు ద్విచక్ర వాహన లైసెన్స్ కలిగుండాలి. ఈ విషయంలో వికలాంగ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. స్థానిక భాషను పదో తరగతి స్థాయిలో చదవని అభ్యర్థులు.. నియామక ప్రక్రియలో పోస్టల్ శాఖ నిర్వహించే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: అన్ని పోస్ట్‌లకు డిసెంబర్ 12 నాటికి 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనాలు
- ఆయా పోస్ట్‌లకు ఎంపికైన వారికి గ్రూప్–సి హోదాలో ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి. పే లెవల్ 1 , 3 , 4 లతో ప్రారంభ వేతనం అందుతుంది.
- పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్స్‌కు లెవల్–4లో రూ.25,500–రూ.81,100; పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్‌కు లెవల్–3లో రూ.21,700–రూ.69,100; మల్టీ టాస్కింగ్ స్టాప్‌కు లెవల్–1లో రూ.18,000–రూ.56,900తో ప్రారంభ వేతన శ్రేణి ఉంటుంది.
క్రీడాకారులు గుర్తింపు ఇలా
- స్పోర్ట్స్ కోటాలో పోస్ట్‌ల భర్తీ చేపడుతున్న నేపథ్యంలో.. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు నాలుగు కేటగిరీల విధానాన్ని పోస్టల్ శాఖ అమలు చేస్తోంది. అవి..
- నిర్దేశిత క్రీడా పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతలు.
- ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ టోర్నమెంట్స్‌లో ప్రాతినిథ్యం వహించి విజేతలు.
- ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన నేషనల్ స్పోర్ట్స్/గేమ్స్ పోటీల్లో స్టేట్ స్కూల్ టీమ్స్‌కు విజేతలు.
- నేషనల్ ఎఫిషియన్సీ డ్రైవ్‌లో ఫిజికల్ ఎఫిషియన్సీలో జాతీయ అవార్డు గ్రహీతలు.
- మొత్తం 64 క్రీడలను ఆమోదిత క్రీడలుగా పేర్కొన్నారు. ఆయా పోటీల్లో విజేతలు, అవార్డులను ఇచ్చేక్రమంలో.. సంబంధిత సర్టిఫికెట్లను జారీ చేయాల్సిన బోర్డ్‌లు/ అధికారుల వివరాలను కూడా పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్దేశిత బోర్డ్‌లు/అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్లతోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపికలో ప్రాధాన్యత క్రమం
- తొలుత.. అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
- ఆ తర్వాత జాతీయ స్థాయిలో సీనియర్, జూనియర్ లెవల్ నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని విజయం సాధించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- అనంతరం యూనివర్సిటీ స్థాయిలో ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో మెడల్స్ సాధించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- ఆ తర్వాత.. నేషనల్ స్పోర్ట్స్/గేమ్స్‌లో పాఠశాల స్థాయిలో విజయం సాధించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- అనంతరం నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్‌లో నేషనల్ అవార్డ్ విజేతలకు ప్రాధాన్యం ఇస్తారు.
- చివరగా.. ఆయా పోటీల్లో పాల్గొని విజయం సాధించపోయినా.. పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొందిన వారికి అవకాశం ఇస్తారు.
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
ఆయా స్థాయిల్లో పోటీల్లో విజేతలను గుర్తించిన తర్వాత.. వారికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నియామకాలు ఖరారు చేస్తారు.
రెండేళ్ల ప్రొబేషన్
తుది జాబితాలో నిలిచి నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ వ్యవధిలో అభ్యర్థులకు ఆయా పోస్ట్‌లకు అనుగుణంగా సంబంధిత విధులపై శిక్షణ కూడా ఇస్తారు. ఈ సమయంలో సర్వీసు నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించిన వారికి శాశ్వత నియామకం ఖరారు చేస్తారు.
విధులివే
- పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్‌గా మెయిల్ డెలివరీ డ్యూటీలు, పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన విధులు, కార్యాలయ నిర్వహణ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ కొలువులో పోస్టల్ బ్యాగ్స్‌ను అందుకోవడం, వాటిని సార్టింగ్ ఆఫీస్‌లకు తీసుకెళ్లడం,చిరునామాల వారీగా వ్యక్తులకు వచ్చిన లెటర్స్‌ను అందించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే విధంగా పోస్టల్ శాఖకు సంబంధించిన డిపాజిట్ పథకాలు, ఇతర సేవింగ్స్ పథకాల గురించి కూడా వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఎంపికైన వారు.. కార్యాలయంలో పోస్ట్ మాస్టర్/బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు అవసరమైన సహాయ, సహకారాలు అందించాల్సి ఉంటుంది. అదే విధంగా కార్యాలయ నిర్వహణకు సంబంధించి రికార్డుల నిర్వహణ, అమరిక వంటి విధులు చేపట్టాల్సి ఉంటుంది.
పదోన్నతులు
- పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్‌గా ఎంపికైన వారు అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్‌మాస్టర్ గ్రేడ్–1 పరీక్షలో ఉత్తీర్ణులైతే.. అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, చీఫ్ సూపర్‌వైజర్ స్థాయికి చేరుకోవచ్చు.
- పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్‌గా ఎంపికైన వారు అయిదేళ్ల సర్వీసు తర్వాత డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్‌గా పదోన్నతికి అర్హత లభిస్తుంది. ఆ తర్వాత సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండ్ స్థాయికి చేరుకోవచ్చు.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా ఎంపికైన వారు అయిదేళ్ల సర్వీసు తర్వాత పదోన్నతికి అర్హత పొందుతారు. డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్, ఎల్‌డీసీ, హోదాలకు చేరుకోవచ్చు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 9, 2023
- దరఖాస్తు సవరణ అవకాశం: డిసెంబర్ 10 – 14 తేదీల్లో
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://dopsportsrecruitment.cept.gov.in/Notifications/English.pdf, https://dopsportsrecruitment.cept.gov.in/
Qualification | 10TH |
Last Date | December 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Postal Circles
- Jobs in sports quota
- job opportunities
- Job Opportunities in Postal Department
- Postman jobs
- Jobs
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- free job alert
- Employment News
- IndianPostalService
- SportsQuotaJobs
- WinnersRecruitment
- JobOpportunities
- PostalCircles
- SportsAchievers
- GovernmentJobs
- IndiaRecruitment
- SportsNotification
- CareerOpportunity
- sakshi education latest jobs notifications
- latest jobs in 2023