What after Inter/10+2... ఎంపీసీ... మెరుగైన మార్గాలెన్నో
ఇంటర్.. ఎంపీసీ గ్రూప్.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరే గ్రూప్. కారణం..ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులై..
ఆ తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనే లక్ష్యం. అయితే ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో ఉన్నత విద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వీటిద్వారా విస్తృత కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులకు.. అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
- » ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో కోర్సుల్లో చేరే అవకాశం
- » ఫార్మసీ, లా, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విభిన్న కోర్సులు
‘బీటెక్.. అది కూడా ఐఐటీలు, నిట్‌లు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు సొంతం చేసుకోవడం. ఈ రెండూ వీలు కాకపోతే.. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరడం.’
ఇంటర్మీడియెట్ ఎంపీసీ చదివే విద్యార్థులను ఏ ఒక్కరిని పలకరించినా వినిపించే సమాధానం. ఇందుకోసం..వారు ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే..ఎంట్రన్స్ టెస్ట్‌ల్లో విజయం సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటారు. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి ప్రవేశ పరీక్షలకు లక్షల్లో పోటీ. ఆశించిన ఇన్‌స్టిట్యూట్‌లో, బ్రాంచ్‌లో సీటు లభిస్తుందనే గ్యారెంటీ లేదు. అందుకే విద్యార్థులు ఇంజనీరింగ్‌తోపాటు అందుబాటులో ఉన్న మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్ హోదా పొందొచ్చు...
జేఈఈ–మెయిన్
ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శాట్, ఈఏపీసెట్, టీఎస్ ఎంసెట్ వంటి పలు ఎంట్రన్స్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ విద్యార్థులందరికీ సుపరిచితమైన పేరు.. జేఈఈ మెయిన్. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికి వీలు కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత పరీక్ష.. జేఈఈ మెయిన్. దీంతోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్‌ల్లో జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పిస్తారు.మొత్తం మూడు సబ్జెక్ట్‌లు.. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలపై ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఏడాది జేఈఈ–మెయిన్‌ను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
Also read: NIMCET 2022: ఐటీ రంగంలో కెరీర్.. లక్షల్లో ప్యాకేజీలు..
బీఆర్క్‌కు మార్గం.. పేపర్–2ఏ
n నిట్‌లు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకునే వారికి మార్గం.. జేఈఈ–మెయిన్‌లో భాగంగా నిర్వహించే పేపర్–2ఏ. ఈ పేపర్‌లో స్కోర్ ఆధారంగా ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ పేపర్‌లో మ్యాథమెటిక్స్; ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్‌ల్లో నైపుణ్యాలను పరీక్షిస్తారు. మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లను ఆన్‌లైన్ విధానంలో, డ్రాయింగ్ టెస్ట్‌ను పెన్ పేపర్ విధానంలో నిర్వహిస్తారు.
- బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్‌లోనే పేపర్–2బి పేరుతో మరో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్లానింగ్ బేస్డ్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మెరుగైన స్కోర్ ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులో అడుగు పెట్టొచ్చు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in
Also read: JEST-2022: ఫిజిక్స్‌లో పరిశోధనలకు జెస్ట్
జేఈఈ–అడ్వాన్స్‌డ్
- సాంకేతిక విద్యా బోధనలో అంతర్జాతీయ స్థాయి ప్రత్యేక గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీ). వీటిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్. జేఈఈ–మెయిన్ పేపర్–1లో ప్రతిభ ఆధారంగా 2.5 లక్షల మందిని జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష సమయం మూడు గంటలు. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరిగే ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధించి.. ఐఐటీలతోపాటు ఐఐఎస్‌టీ, ఐఐఎస్‌సీ తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందే అవకాశం ఉంది.
- జేఈఈ–అడ్వాన్స్‌డ్–2022 పరీక్షను ఆగస్ట్ 28న నిర్వహించనున్నారు. పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆగస్ట్ 7 నుంచి 11వ తేదీ వరకు స్వీకరిస్తారు.
- వివరాలకు వెబ్‌సైట్: www.jeeadv.ac.in
Also read: TISS NET 2022: టిస్ కోర్సులతో ఉజ్వల అవకాశాలు.. అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం ఇలా..
టీఎస్ ఎంసెట్, ఈఏపీసెట్
- తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఎంసెట్ పేరుతో, ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీ(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ) సెట్ పేరుతో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.
- బీఈ/బీటెక్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పేపర్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో ర్యాంకు ద్వారా బీటెక్‌తోపాటు బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్)/బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/బీటెక్(ఫుడ్ టెక్నాలజీ)/బీటెక్(బయో టెకాలజీ)/బీఫార్మసీ(ఎంపీసీ)/ఫార్మ్–డీ(ఎంపీసీ) కోర్సుల్లోనూ చేరొచ్చు.
- టీఎస్ ఎంసెట్–2022(ఇంజనీరింగ్ స్ట్రీమ్) పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://eamcet.tsche.ac.in/
- ఏపీ ఈఏపీసెట్–2022 ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ ఆన్‌లైన్ విధానంలో జూలై 4నుంచి 8వరకు జరగనుంది.
- వివరాలకు వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
- ఎంట్రన్స్ టెస్ట్ మొత్తం 160 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
బిట్‌శాట్
బీటెక్‌లో చేరాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రముఖ ఎంట్రన్స్ టెస్ట్.. బిట్ శాట్. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్–పిలానీ).. బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా బిట్‌శాట్ నిర్వహిస్తుంది. ఈ ఎంట్రన్స్ ద్వారా బిట్స్ పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఈ పరీక్షను కూడా పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే ఆన్‌లైన్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్(ఇంజనీరింగ్ అభ్యర్ధులు), బయాలజీ(బీఫార్మసీ). మొత్తం 150 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
- బిట్‌శాట్–2022 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 12వ తేదీ వరకూ దరఖాస్తుకు అవకాశం ఉంది.
- వివరాలకు వెబ్‌సైట్:www.bitsadmission.com
Also read: TS EDCET 2022: టీచింగ్ కెరీర్‌కు దారి.. ఎడ్‌సెట్
ఆర్కిటెక్చర్
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా). ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు–200 మార్కులకు ఉండే ఈ పరీక్షలో డయగ్రమాటిక్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్, లాజికల్ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాటా–2022ను మూడు సెషన్లుగా నిర్వహించనున్నారు. మొదటి సెషన్ జూన్ 12న, రెండో సెషన్‌ు జూలై 7న, మూడో సెషన్ ఆగస్టు7వ తేదీన నిర్వహించనున్నారు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nata.in
Also read: What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం
హోటల్ మేనేజ్‌మెంట్
ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో వినూత్నమైన కోర్సు.. హోటల్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో హాస్పిటాలిటీ, టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్ రంగాల్లో కెరీర్ అవకాశాలు లభిస్తాయి. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుకు.. జాతీయ స్థాయిలో టూరిజం శాఖ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్ష.. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్–జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్.
- ఈ ఎంట్రన్స్‌ను అయిదు విభాగాల్లో(న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్; రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్; ఇంగ్లిష్ లాంగ్వేజ్; ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్) 200 ప్రశ్నలు అడుగుతారు.
- ఈ ఎంట్రన్స్‌లో స్కోర్ ఆధారంగా.. టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌లు, ఇతర ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
- 2022కు సంబంధించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జూన్ 18న ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nchmjee.nta.nic.in
Also read: Job Trends 2022: ఆ రెండు రంగాల్లో.. కొలువుల పండగే!
‘న్యాయ శాస్త్రం’లో ఎల్‌ఎల్‌బీ
- ఎంపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. లాలో కూడా చేరొచ్చు. వీరికి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సు అందుబాటులో ఉంది.
- జాతీయ స్థాయిలోని నేషనల్ లా యూనివర్సిటీల్లో.. ఇంటర్మీడియెట్ అర్హతగా అయిదేళ్ల వ్యవధిలోని ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్–యూజీ(క్లాట్–యూజీ) ఎంట్రన్స్‌ను నిర్వహిస్తున్నారు.
- ఈ ఎంట్రన్స్‌లో ఉత్తమ స్కోర్ ఆధారంగా.. జాతీయ స్థాయిలో నెలకొల్పిన 22 లా యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు.
- క్లాట్–యూజీ పరీక్షను 150 మార్కులకు అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్; జీకే అండ్ కరెంట్ అఫైర్స్; లీగల్ రీజనింగ్; లాజికల్ రీజనింగ్; క్వాంటిటేటివ్ టెక్నిక్స్.
- క్లాట్–యూజీ–2022 పరీక్ష జూన్ 19న పరీక్ష నిర్వహించనున్నారు.
- వివరాలకు వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/clat2022
- ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ లా సెట్ పరీక్ష, తెలంగాణలో టీఎస్ లాసెట్ పేరుతో ఎంట్రన్స్ నిర్వహిస్తున్నారు. వీటిలో ర్యాంకు ద్వారా సదరు రాష్ట్రంలో లా కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.
Also read: After MBBS: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NEXT)లో నెగ్గితేనే... ఉన్నత విద్య, ప్రాక్టీస్!
ఫ్యాషన్ టెక్నాలజీ
క్రియేటివ్ కెరీర్ కోరుకునే వారికి చక్కటి మార్గం.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) పలు ఫ్యాషన్ కోర్సులను అందిస్తోంది. ఆయా కోర్సులు పూర్తి చేసుకోవడం ద్వారా ఫ్యాషన్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. తొలి దశలో జీఏటీ పేరుతో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ప్రతిభ చూపితే.. తర్వాత దశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులోనూ విజయం సాధించిన వారికి తుది దశలో పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు.
- వివరాలకు వెబ్‌సైట్: https://nift.ac.in/admission
Also read: UPSC-CDS (2) 2022: డిగ్రీతో త్రివిధ దళాల్లో కొలువులు.. నెలకు రూ.56,100 స్టయిపెండ్
బీఫార్మసీ, ఫార్మ్–డి
ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో కోర్సు.. బీ–ఫార్మసీ. తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ, ఫార్మ్–డి కళాశాలల్లో సీట్ల భర్తీని ఎంసెట్ (తెలంగాణలో),ఈఏపీసెట్(ఆంధ్రప్రదేశ్)లో ర్యాంకు ఆధారంగా చేపడతారు. మొత్తం బీఫార్మసీ సీట్లలో 50 శాతం సీట్లను ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోర్సులు పూర్తి చేసుకోవడం ద్వారా ఫార్మాస్యుటికల్ సంస్థలు, డ్రగ్ డిస్కవరీ, ఫార్ములేషన్, బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
Also read: TS EDCET 2022: టీచింగ్ కెరీర్‌కు దారి.. ఎడ్‌సెట్
నెస్ట్‌తో నైసర్ భువనేశ్వర్
సైన్స్ సంబంధిత విభాగాల్లో ఉన్నత విద్య కోసం ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ఎంట్రన్స్.. నెస్ట్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైసర్)–భువనేశ్వర్, ముంబై యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ సెంటర్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షే.. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(నెస్ట్). ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా..నైసర్–భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై–డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. మొత్తం నాలుగు సబ్జెక్ట్‌లలో(బయలాజికల్ సైన్సెస్; కెమికల్ సైన్సెస్; మ్యాథమెటిక్స్; ఫిజిక్స్) ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉంటాయి. నెస్ట్ ఎంట్రన్స్..నాలుగు విభాగాల్లో(మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
Also read: What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం