Skip to main content

JEST-2022: ఫిజిక్స్‌లో పరిశోధనలకు జెస్ట్‌

JEST 2022: Joint Entrance Screening Test for PhD Admissions
JEST 2022: Joint Entrance Screening Test for PhD Admissions

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పరిశోధన కోర్సుల్లో చేరేందుకు మార్గం.. జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌). ఈ పరీక్షలో ప్రతిభ చూపితే భౌతిక శాస్త్రం, థియోరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్, న్యూరోసైన్స్, కంప్యూటేషనల్‌ బయాలజీల్లో పీహెచ్‌డీ/ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరొచ్చు. తాజాగా జెస్ట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, ప్రవేశాలు కల్పించే కోర్సులు, అర్హతలు, ప్రిపరేషన్‌ తదితర అంశాలపై కథనం...

ఐఐఎస్సీ, ఐఐఎస్టీ, ఐఐఎస్‌ఈఆర్, టీఐఎఫ్‌ఆర్, హోమి బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి దేశంలోని టాప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్స్‌.. జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌) స్కోరు ద్వారా.. పీహెచ్‌డీ/ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు ఫిజిక్స్, థియోరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్, న్యూరోసైన్స్, కంప్యుటేషనల్‌ బయాలజీల్లో పరిశోధన కోర్సుల్లో చేరొచ్చు. జెస్ట్‌లో ప్రతిభ చూపితే పరిశోధనలతోపాటు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా ఫెలోషిప్‌ కూడా పొందొచ్చు.

కోర్సులు–అర్హతలు

  • రెగ్యులర్‌ పీహెచ్‌డీ: ఫిజిక్స్‌/అప్లయిడ్‌ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు.బీటెక్‌/ఎంటెక్‌/నాలుగేళ్ల బీఎస్‌/ఎంసీఏ అభ్యర్థులకూ పలు సంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 
  • ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులకు ఫిజిక్స్‌/మ్యాథమెటì క్స్‌లో బీఎస్సీ పూర్తిచేసిన వారు అర్హులు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. థియోరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్,న్యూరోసైన్స్, కంప్యూటేషనల్‌ బయాలజీల్లో సంబంధిత అర్హతలు ఉండాలి. 


చ‌ద‌వండి: కెరీర్‌కు లైఫ్‌లైన్...లైఫ్‌సెన్సైస్ కోర్సులు

పరీక్ష విధానం

జెస్ట్‌ను వంద మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌–ఎ, బి, సిలుగా మొత్తం మూడు విభాగాల్లో 50 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌–ఎలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 15 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పార్ట్‌–బిలో ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పన 10 ప్రశ్నలు అడుగుతారు. వీటికి నాలుగు అంకెల çపూర్ణాంకాల(ఇంటీజర్‌) రూపంలో సమాధానం గుర్తించాలి. నెగెటివ్‌ మార్కులు లేవు. పార్ట్‌–సిలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 25 ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానానికి మూడోవంతు మార్కు కోత విధిస్తారు.

ప్రిపరేషన్‌

  • జెస్ట్‌ ఫిజిక్స్‌ సిలబస్‌.. డిగ్రీ/ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ స్థాయిలో ఉంటుంది. విద్యార్థులు మ్యాథమెటికల్‌ మెథడ్స్, క్లాసికల్‌ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆప్టిక్స్, క్వాంటం మెకానిక్స్, థర్మోడైనమిక్స్, స్టాటిస్టికల్‌ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్‌ తదితర సబ్జెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రాథమిక భావన లపై పట్టు కోసం ఎమ్మెస్సీ స్థాయిలో ఇతర విద్యాసంస్థలు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన శాంపిల్‌ పేపర్‌ను పరిశీలించడం ద్వారా.. పరీక్ష స్థాయి, ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవాలి. భౌతిక శాస్త్రంలో ఎక్కువగా ప్రశ్నలను సాధించి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి వేగంగా సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్‌ చేయాలి. 

ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు

  • ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్, నైనిటాల్‌.
  • బోస్‌ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా.
  • హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, ముంబై.
  • హరీష్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, అలహాబాద్‌.
  • ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియోరిటికల్‌ సైన్సెస్‌(టీఐఎఫ్‌ఆర్‌), బెంగళూరు.
  • ఇందిరా గాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్, కల్పక్కం.
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్, బెంగళూరు.
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు.
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌)– భోపాల్, బర్హంపూర్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి. 
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ), తిరువనంతపురం.
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్, చెన్నై. 
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్, భువనేశ్వర్‌.
  • ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రీసెర్చ్, గాంధీనగర్‌.
  • ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్, పుణె.
  • జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్, బెంగళూరు.
  • నేషనల్‌ బ్రెయిన్‌ రీసెర్చ్‌ సెంటర్, మానేసర్‌.
  • నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్, టీఐఎఫ్‌ఆర్‌ పుణె.
  • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్, భువనేశ్వర్‌.
  • ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ, అహ్మదాబాద్‌.
  • రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, ఇండోర్‌.
  • రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, బెంగళూరు.
  • సహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్, కోల్‌కతా. 
  • సత్యేంద్ర నాథ్‌ బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్, కోల్‌కతా.
  • టీఐఎఫ్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్సెస్‌(టీఐఎఫ్‌ఆర్‌–టీసీఐఎస్‌), హైదరాబాద్‌.
  • టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్, ముంబై.
  • యూజీసీ–డీఏఈ కన్సార్టియమ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్, ఇండోర్‌.
  • వేరియబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్, కోల్‌కతా.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి 18 
  • జెస్ట్‌ పరీక్ష తేదీ: 2022 మార్చి 13 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
  • వెబ్‌సైట్‌: https://www.jest.org.in/ 


చ‌ద‌వండి: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ తో బహుళ ప్రయోజనాలెన్నో...

Published date : 23 Dec 2021 05:34PM

Photo Stories