సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ తో బహుళ ప్రయోజనాలెన్నో...
ప్రయోజనాలు..
- సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించి.. ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు/ యూనివర్సిటీలు/నేషనల్ లేబొరేటరీల్లో రీసెర్చ్ స్కాలర్‌గా ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఫెలోషిప్ లభిస్తుంది.
- జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన అభ్యర్థులకు తొలి రెండేళ్లపాటు నెలకు రూ.31వేల ఫెలోషిప్ అందుతుంది. అదనంగా ఏటా రూ.20వేల కంటింజెంట్ గ్రాంట్ మంజూరు చేస్తారు. రెండేళ్ల అనంతరం పీహెచ్‌డీకి నమోదు చేసు కున్న విద్యార్థులకు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) దక్కుతుంది. ఎస్‌ఆర్‌ఎఫ్‌లకు నెలకు రూ.35వేల ఫెలోషిప్ లభిస్తుంది.
- సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించిన వారు దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలైన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ-హైదరాబాద్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ- హైదరాబాద్), ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ స్కాలర్లుగా ప్రవేశం పొందవచ్చు. వీటిలో పరిశోధన విద్యార్థిగా ప్రవేశించిన వారు ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకుంటారనడంలో సందేహం లేదు.
- సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ ద్వారా దేశంలోని యూనివర్సిటీలు/కాలేజీల్లో లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు అర్హత లభిస్తుంది.
సబ్జెక్టులు :
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌ను కింది సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు.
అవి..
- కెమికల్ సెన్సైస్
- ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సెన్సైస్
- లైఫ్ సెన్సైస్
- మ్యాథమెటికల్ సెన్సైస్
- ఫిజికల్ సెన్సైస్.
అర్హతలు :
- ఎంఎస్సీ లేదా తత్సమాన విద్యార్హత/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/నాలుగేళ్ల బీఎస్/బీఈ/బీటెక్/ బీఫార్మా/ఎంబీబీఎస్‌లో జనరల్ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువు తున్న ఎంఎస్సీ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరిని రిజల్ట్ వెయిటింగ్ కేటగిరీగా పరిగణిస్తారు.
- బీఎస్సీ(ఆనర్స్) లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులు/ ఇంటెగ్రేటెడ్ ఎంఎస్-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు నమోదు చేసుకున్న విద్యార్థులు(అర్హత డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 55 శాతం, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి) సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు : 28 ఏళ్లకు మించని వారు జేఆర్‌ఎఫ్‌కు అర్హులు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళా అభ్య ర్థులకు అయిదేళ్లు.. ఓబీసీ(నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది. లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితిలేదు.
ఫీజు :
ఫీజు జనరల్ అభ్యర్థులకు-రూ.1000, ఓబీసీ(నాన్ క్రీమిలేయర్ అభ్యర్థులకు)- రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
ఆష్షన్స్ :
అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) లేదా లెక్చర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు దరఖాస్తు చేసు కోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థి ఈమేరకు తమ ప్రాధాన్యత(ప్రిఫరెన్స్‌ను)ను పేర్కొనవచ్చు. ఒక అభ్య ర్థి జేఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకొని... నిర్దేశించిన విధంగా లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెషర్‌షిప్‌కు అవసరమైన అర్హతలుంటే.. సదరు అభ్యర్థిని లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
సిలబస్ :
లైఫ్ సెన్సైస్:
మాలిక్యూల్స్ అండ్ దెయిర్ ఇంటరాక్షన్(బయాలజీ రిలవెంట్), సెల్యులర్ ఆర్గనైజేషన్, ఫండమెంటల్ ప్రాసెస్ సెల్ కమ్యూనికేషన్ అండ్ సెల్ సిగ్నలింగ్, డెవలప్ మెంటల్ బయాలజీ, సిస్టమ్ ఫిజియాలజీ-ప్లాంట్, సిస్టం ఫిజియాలజీ-యానిమల్, ఇన్‌హెరిటెన్స్ బయాలజీ, డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫామ్స్, ఎకలాజికల్ ప్రిన్సిపుల్స్, ఎవల్యూషన్ అండ్ బిహేవియర్, అప్లయిడ్ బయాలజీ, మెథడ్స్ ఇన్ బయాలజీ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
కెమికల్ సెన్సైస్:
ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
ఎర్త్ సెన్సైస్:
పేపర్ 1 (పార్ట్ బి)లో ఎర్త్ అండ్ సోలార్ సిస్టమ్, ఎర్త్ మెటీరియల్స్, సర్ఫేస్ ఫీచర్స్ అండ్ ప్రాసెసెస్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, డిఫర్మేషన్ అండ్ టెక్టానిక్స్, ఓషన్ అండ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్‌మెం టల్ ఎర్త్ సెన్సైస్. ఎర్త్ సెన్సైస్ పేపర్ 1(పార్ట్ సి)లో.. జియాలజీ, ఫిజికల్ జాగ్రఫీ, జియోఫిజిక్స్, మెటియోరాలజీ, ఓషన్ సెన్సైస్.
మ్యాథమెటికల్ సెన్సైస్:
ఇందులో అనాలసిస్, లీనియర్ ఆల్‌జీబ్రా, కాంప్లెక్స్ అనాలసిస్, ఆల్‌జీబ్రా, టోపాలజీ, ఆర్డినరీ డిఫరెన్షియ ల్ ఈక్వేషన్స్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, న్యూమరికల్ అనాలసిస్, క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్స్, లీనియర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్, క్లాసికల్ మెకానిక్స్, డ్రిస్కిప్టివ్ స్టాటస్టిక్స్, ఎక్సోప్లోరేటరీ డేటా అనాలసిస్ తదితర అధ్యయాలు ఉంటాయి.
ఫిజికల్ సెన్సైస్:
పార్ట్ ఏ (కోర్)లో మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్స్. పార్ట్ బీ (అడ్వాన్స్‌డ్)లో మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్‌పెరిమెం టల్ మెథడ్స్, అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష విధానం:
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ 200 మార్కులకు జరుగుతుంది. పరీక్షను ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-సీబీటీ) రెండు సెషన్స్‌గా నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు; రెండో విడత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమా ల్లో ఉంటుంది. ప్రశ్నప్రతం మల్టిపుల్ చాయిస్ విధానం లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు విభాగాలు (పార్ట్ ఎ, బి, సి) ఉంటాయి.
- పార్ట్ ఎ: ఇది అన్ని సబ్జెక్టులకు కామన్‌గా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్స్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ తదితర అంశాల్లో విద్యార్థి జనరల్ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. పార్ట్ ఏకు కేటాయించిన మార్కులు 30.
- పార్ట్ బి: సబ్జెక్టుకు సంబంధించి ఎంసీక్యూ తరహా ప్రశ్నలు అడుగుతారు. పేర్కొన్న సిలబస్‌లోని అన్ని అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ విభాగానికి కేటాయించిన మొత్తం మార్కులు 70. ఆయా సబ్జెక్టును బట్టి 20-35 మధ్య ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.
- పార్ట్ సి: అభ్యర్థిలోని సైంటిఫిక్ నాలెడ్జ్‌ను పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. సైంటిఫిక్ కాన్సెప్టులు, వాటి అనువర్తనాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగానికి కేటాయించిన మొత్తం మార్కులు 100.