Skip to main content

బయో కెరీర్‌కు ఉత్తమ మార్గం.. జేఎన్‌యూ సీబీఈఈ

మానవ అవసరాలకనుగుణంగా ఆవిర్భవిస్తున్న నూతన జీవ సాంకేతిక ప్రపంచంలో కీలకమైంది.. బయోటెక్నాలజీ.. ప్రపంచంలో మార్పులకు బ్రహ్మాస్త్రంగా బయోటెక్నాలజీని నిపుణులు పేర్కొంటున్నారు. ఆహార ఉత్పత్తుల వృద్ధికి అవసరమైన వంగడాల సృష్టి మొదలు.. ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన వ్యాక్సిన్ల తయూరీ వరకు ప్రధాన సాంకేతిక అస్త్రంగా నిలుస్తోన్న బయోటెక్నాలజీ.. నేటి యువతరం కెరీర్ గమ్యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.. ఈ నేపథ్యంలో బయోటెక్నాలజీలో కెరీర్‌ను ప్రారంభించడానికి చక్కని మార్గంగా నిలుస్తోంది.. కంబైన్డ్ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీబీఈఈ).. 2014-15 సంవత్సరానికి సీబీఈఈ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ).. కంబైన్డ్ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీబీఈఈ) నిర్వహిస్తుంది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థారుులో బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ‘గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్)’, ‘ఐఐటీ-జామ్ (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ)’లతో సమానంగా సీబీఈఈని పరిగణిస్తారు. ఈ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పించే కోర్సులు: ఎంఎస్సీ (బయోటెక్నాలజీ), ఎంఎస్సీ అగ్రి (బయోటెక్నాలజీ)/ మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సెన్సైస్ (ఎంవీఎస్సీ), ఎంటెక్ (బయోటెక్నాలజీ). వివరాలు..

ఎంఎస్సీ-బయోటెక్నాలజీ
సీబీఈఈ ద్వారా 34 యూనివర్సిటీల (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో కలిపి)లో ఎంఎస్సీ- బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 3 వేల స్కాలర్‌షిప్ సదుపాయం కూడా లభిస్తుంది.
అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్, బయాలాజికల్ సైన్స్, అగ్రికల్చరల్, వెటర్నరీ, ఫిషరీస్ సైన్స్, ఫార్మసీ, ఇంజనీరింగ్/టెక్నాలజీ) లేదా బీఎస్సీ (ఫిజీషియన్ అసిస్టెంట్ కోర్సు) లేదా ఎంబీబీఎస్/బీడీఎస్.
రాత పరీక్ష: మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి రెండు భాగాలు ఉంటాయి. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి.
పార్ట్-ఎ: మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటి క్లిష్టత 10+2 స్థాయిలో ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు కోత విధిస్తారు.
పార్ట్-బి: మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ప్రశ్నలు విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ (బోటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ), కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. 60 ప్రశ్నలను సాధించాలి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 180 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28, 2014
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 26, 2014
ప్రింటెడ్ ఆన్‌లైన్ దరఖాస్తును పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 2, 2014
రాత పరీక్ష తేదీ: మే 19, 2014
వెబ్‌సైట్: www.jnu.ac.in

ఎంఎస్సీ-(అగ్రి) బయోటెక్నాలజీ
సీబీఈఈ ద్వారా 12 యూనివర్సిటీలలో ఎంఎస్సీ-అగ్రి బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఎంవీఎస్సీకి సంబంధించి 7 యూనివర్సిటీలలో ప్రవేశం లభిస్తుంది.
రాత పరీక్ష: మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి రెండు భాగాలు ఉంటాయి. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి.
పార్ట్-ఎ: మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటి క్లిష్టత 10+2 స్థాయిలో ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు కోత విధిస్తారు.
పార్ట్-బి: కూడా మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, సెల్‌బయాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ ప్రాసెసింగ్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ టెక్నాలజీ, బయోస్టాటిస్టిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 60 ప్రశ్నలను సాధించాలి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 180 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28, 2014
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 26, 2014
ప్రింటెడ్ ఆన్‌లైన్ దరఖాస్తును పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 2, 2014
రాత పరీక్ష తేదీ: మే 19, 2014
వెబ్‌సైట్: www.jnu.ac.in

ఎంటెక్-బయోటెక్నాలజీ
సీబీఈఈ ద్వారా మూడు యూనివర్సిటీల (అన్నా యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వెస్ట్‌బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ)లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: బీఈ/బీటెక్ (కెమికల్/బయోకెమికల్/ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ/లెదర్ టెక్నాలజీ/కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/బయోమెడికల్ ఇంజనీరింగ్/కెమికల్ టెక్నాలజీ) లేదా బీఫార్మసీ లేదా ఎంఎస్సీ (బయోటెక్నాలజీ/ లైఫ్‌సెన్సైస్/బోటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ, జెనెటిక్స్/ బయోఫిజిక్స్/ మైక్రోబయల్ జెనెటిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్)
ఈ విభాగం కోసం నిర్వహించే రాత పరీక్ష.. టెక్నాలజీ స్ట్రీమ్, లైఫ్ సెన్సైస్ స్ట్రీమ్ అనే విధాలుగా ఉంటుంది.
టెక్నాలజీ స్ట్రీమ్: ఇందులో పార్ట్-ఎ, బి, సి అనే భాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో బేసిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నల క్లిష్టత అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉంటుంది.
పార్ట్-బిలో ఫిజిక్స్/కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నల క్లిష్టత అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉంటుంది.
పార్ట్-సి ఫండమెంటల్ లైఫ్ సెన్సైస్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నల క్లిష్టత 10+2 స్థాయిలో ఉంటుంది.

లైఫ్ సైన్స్ స్ట్రీమ్: ఇందులో పార్ట్-ఎ,బి,సి అనే భాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో లైఫ్ సెన్సైస్ (బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ అండ్ ఇమ్యునాలజీ) నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నల క్లిష్టత పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉంటుంది. పార్ట్-బిలో ఫిజిక్స్/ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నల క్లిష్టత అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉంటుంది. పార్ట్-సిలో మ్యాథమెటిక్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నల క్లిష్టత 10+2 స్థాయిలో ఉంటుంది.

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28, 2014
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 26, 2014
రాత పరీక్ష తేదీ: మే 19, 2014
వెబ్‌సైట్: www.jnu.ac.in

ప్రిపరేషన్
జాతీయ స్థాయిలో బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న పరీక్షల్లో దీన్ని క్లిష్టమైందిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రశ్నపత్రం.. పలు సబ్జెక్టుల కలయికగా ఉంటుంది. ఈ క్రమంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి. మరో కీలక అంశం.. ప్రశ్నల క్లిష్టత 10+2 స్థాయి, డిగ్రీ స్థాయిలో ఉంటుంది. అంటే ఇంటర్మీడియెట్ నుంచి డిగ్రీ వరకు అయా అంశాల్లోని సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్ట్ ఏదైనా ప్రాథమిక అవగాహన పెంచుకొని ముందుకు సాగడం వల్ల ప్రిపరేషన్ ప్రభావవంతంగా ఉంటుంది. ఈ క్రమంలో ముందుగా ఇంటర్మీడియెట్ స్థాయి సిలబస్‌ను పూర్తి చేసిన తర్వాత డిగ్రీ స్థాయి సిలబస్‌ను ప్రిపేర్ కావాలి. సబ్జెక్ట్ ఏదైనా.. ఏ విషయాన్నైనా బట్టీ పట్టకుండా కాన్సెప్ట్ బేస్డ్‌గా చదివితేనే ప్రయోజనం. మూలాలు, ప్రాథమిక భావనల (ఫండమెంటల్స్, కాన్సెప్ట్స్) నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ముందుకు సాగాలి. కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడం అలవర్చుకోవాలి. దీనివల్ల తక్కువ సమయంలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం అలవడుతుంది. ప్రశ్నపత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో రూపొందిస్తారు. కాబట్టి ఏ ఒక్క చాప్టర్‌ను విస్మరించకుండా ప్రిపరేషన్ సాగించాలి. సాధారణంగా ఒక ఏడాది అడిగిన చాప్టర్ల నుంచి మరో ఏడాది అదే విధంగా ప్రశ్నలు వస్తాయనుకోవడం పొరపాటే. నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అదే సమయంలో బయాలజీ, కెమిస్ట్రీలను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, ఆల్జీబ్రా, కాలిక్యులస్‌పై దృష్టి సారించాలి.
  • సీబీఈఈ ప్రశ్నలు విద్యార్థిలోని స్కిల్స్ పరీక్షించే విధంగా ఉంటాయి.
  • కొన్ని ప్రశ్నలు మెమరీ బేస్డ్‌గా ఉన్నప్పటికీ.. అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్, అనాలిసిస్ బేస్డ్‌గా అడుగుతారు.
  • గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్ష శైలిపై ఓ అవగాహన ఏర్పడుతుంది. ఐఐఎస్‌సీ, బీహెచ్‌యూ, హెచ్‌సీయూ వంటి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్‌ల్లో అడిగిన మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
  • మార్కెట్లో లభించే అన్ని రకాల పుస్తకాలను రిఫర్ చేయకుండా.. స్టాండర్డ్ పుస్తకాలను మాత్రమే ఫాలో కావాలి. తర్వాత స్టాండర్డ్ మెటీరియల్‌లోని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను సాధించాలి. చాప్టర్‌వైజ్, గ్రాండ్ టెస్ట్‌లను రాస్తుండాలి.
  • ప్రిపరేషన్ కోసం 6 నుంచి 8 నెలల సమయం కావాలి. పరీక్షలో ఏ విభాగానికి ఎక్కువ మార్కులు కేటాయించారో ముందు ఆ విభాగం ప్రారంభించడం మంచిది.
Published date : 13 Mar 2014 04:16PM

Photo Stories