కెరీర్ గైడెన్స్...బయోకెమిస్ట్రీ
Sakshi Education
గత కొంత కాలంగా వివిధ రకాల జీవుల.. జీవన విధానం, వచ్చే వ్యాధులు, రసాయనికంగా చోటు చేసుకునే మార్పులు, పరిసరాల ప్రభావం గురించి అధ్యయనం చేయడానికి ఎన్నో నూతన కోర్సులను ప్రవేశ పెట్టారు. అలాంటి కోర్సుల్లో ఒకటి..బయో కెమిస్ట్రీ.
బయో కెమిస్ట్రీలో కెమిస్ట్రీ, బయాలాజికల్ సైన్స్ అనువర్తనాలు ఉంటాయి. ఒక జీవిలో..జీవక్రియ, పునరుత్పత్తి, పెరుగుదల వంటి చర్యల్లో రసాయనికంగా చోటు చేసుకునే మార్పులు, ప్రభావం గురించి బయోకెమిస్ట్రీ చర్చిస్తుంది. ఈక్రమంలో న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, బయో మాలిక్యుల్స్, ఫ్యాట్స్, ఎంజైమ్స్, కార్బో హైడ్రేట్స్ వంటి అంశాల ప్రస్తావన ఈ శాస్త్రంలో ఉంటుంది. అంతేకాకుండా జీవులపై పరిసరాల ప్రభావం గురించి కూడా బయో కెమిస్ట్రీ అధ్యయనం చేస్తుంది. డీఎన్‌ఏ నిర్మాణాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకోవడానికి బయో కెమిస్ట్రీ పరిశోధనలు చాలా వరకు దోహదం చేస్తున్నాయి.
బయోకెమిస్ట్
బయో కెమిస్ట్రీలో ప్రొఫెషనల్స్‌ను బయో కెమిస్ట్‌గా వ్యవహరిస్తారు. జీవుల జీవక్రియలు, పరిసరాల ప్రభావం వంటి అంశాలపై నిరంతరం పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలో మెడికల్, వ్యవసాయం, న్యూట్రిషన్ రంగాల్లో వీరి పాత్ర కీలకంగా ఉంటోంది.
మెడికల్: మెడికల్ రంగంలో బయో కెమిస్ట్‌లు వివిధ వ్యాధులు రావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఒక తరం నుంచి మరొక తరానికి జన్యు ప్రసరణ (genetic transmission) ద్వారా సంక్రమించే వ్యాధులపై సమగ్రంగా పరిశోధనలు చేస్తారు. అంతేకాకుండా టీబీ, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు శరీరంలో రసాయనికంగా చోటు చేసుకునే మార్పులపై కూడా వీరి అధ్యయనం కొనసాగుతుంది.
వ్యవసాయం: అధిక, నాణ్యమైన ఉత్పత్తి కోసం మెరుగైన వంగడాలను రూపొందించడం, పంట సాగు-నిల్వ, పెస్ట్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల్లో అధునాతన పద్ధతుల దిశగా బయో కెమిస్ట్‌లు ఈ రంగంలో పరిశోధనలు చేస్తుంటారు.
న్యూట్రిషన్: ఈ రంగంలో మానవ శరీరంపై మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, తదితరాల ప్రభావంపై పరిశోధనలు చేస్తుంటారు. వీటిని ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోవడం వల్ల కలిగే పరిమాణాలను అధ్యయనం చేస్తారు.
కోర్సులు:
మన దేశంలో బయో కెమిస్ట్రీ కోర్సు..బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్‌డీ, ఎంఫిల్ స్థాయిలో అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో వివిధ కాంబినేషన్లతో బ్యాచిలర్ స్థాయిలో (బీఎస్సీ ఒక ఆప్షనల్‌గా), ఎంఎస్సీ స్థాయిలో కూడా బయో కెమిస్ట్రీ కోర్సును కొన్ని వర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
బయో కెమిస్ట్రీ- స్పెషలైజేషన్స్:

- జెనెటిక్స్
- డెవలప్‌మెంట్ అండ్ డీసీజెస్
- ప్లాంట్ బయాలజీ
- ఎనర్జీ అండ్ మెట బాలిజం
- మాలిక్యులర్ బయాలజీ
- సెల్ బయాలజీ అండ్ సిగ్నలింగ్
బయో కెమిస్ట్రీ కోర్సు పూర్తి చేసిన వారికి పరిశోధన-అభివద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాల్లో అవకాశాలుంటాయి. కాబట్టి ఈ క్రమంలో కొన్ని స్కిల్స్ తప్పనిసరి. అవి..
- పరిశోధనాత్మక వైఖరి
- నేర్చుకోవాలనే తపన
- కొత్త విషయాల పట్ల ఆసక్తి
- సునిశిత పరిశీలన
- జట్టుగా పని చేయగలగడం
- సమయంతో నిమిత్తం లేకుండా ఓర్పుతో వ్యవహరించడం
అవకాశాలు:
ఇటీవలి కాలంలో బయోకెమిస్ట్‌కు కెరీర్ పరంగా అవకాశాలు పెరుగుతున్నాయి. మెడిసిన్, అగ్రికల్చరల్, న్యూట్రిషన్ రంగాల్లో వీరు ఉపాధి పొందొచ్చు. ప్రెవేట్ రంగంలో కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్న పరిశ్రమలు..మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్ కంపెనీలు, బయెటెక్నాలజీ పరిశ్రమలు, ఫుడ్ అండ్ డ్రింక్ ఇండస్ట్రీస్,ఫార్మస్యుటికల్ కంపెనీలు, రీసెర్చ్ కంపెనీలు,లేబొరేటరీలు, కెమికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, హెల్త్ అండ్ బ్యూటీ కేర్ కంపెనీలు, డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు.
ప్రభుత్వ రంగంలో..క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, పబ్లిక్ హెల్త్ సంస్థలు, పొల్యుషన్ కంట్రోల్ బోర్డులు, అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ ఆర్గనైజేషన్స్, ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్‌మెంట్, హాస్పిటల్స్ ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా కూడా చేరొచ్చు.
జాబ్ ప్రొఫైల్స్:

- క్లినికల్ సైంటిస్ట్
- రీసెర్చ్ అసోసియేట్
- బయో మెడికల్ సైంటిస్ట్
- ఫార్మాలాజిస్ట్
- లేబొరేటరీ టెక్నిషియన్
- బయో టెక్నాలాజిస్ట్
- రీసెర్చ్ సైంటిస్ట్
- కెమిస్ట్
- మైక్రోబయాలాజిస్ట్
వేతనాలు:
ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే పీజీ డిగ్రీ ఉన్న అభ్యర్థికి ప్రారంభంలో నెలకు రూ. 15,000 తక్కువ కాకుండా వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, అర్హత ఆధారంగా నెలకు రూ. 25,000-40,000 స్థాయిని స్వల్ప కాలంలో చేరుకోవచ్చు.
టాప్ ఇన్‌స్టిట్యూట్స్:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు
వెబ్‌సైట్: www.iisc.ernet.in
జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)-పుదుచ్చేరి
వెబ్‌సైట్: https://www.jipmer.edu/
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: https://www.osmania.ac.in/
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: https://www.kakatiya.ac.in/
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: https://www.andhrauniversity.info
కస్తూర్బా మెడికల్ కాలేజ్-మణిపాల్
వెబ్‌సైట్: https://www.manipal.edu
బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
వెబ్‌సైట్: www.bhu.ac.in

Published date : 25 Mar 2013 04:09PM