కెరీర్ గైడెన్స్...మైక్రోబయాలజీ
Sakshi Education
వ్యాధులు... సంబంధిత అంశాలపై అధ్యయనం కోసం జీవ శాస్త్రంలో ఎన్నో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టారు..అలాంటి కోర్సుల్లో మైక్రోబయాలజీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్ రంగం శరవేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో..సైన్స్ విద్యార్థులకు మైక్రోబయాలజీ చక్కటి కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
మైక్రోబయాలజీ అంటే:
ఒక్క మాటలో చెప్పాలంటే..బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఆల్గే, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రమే మైక్రోబయాలజీ. వ్యాధులు సంక్రమించడానికి కారణం,రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన పరిశోధన, తదిత అంశాల్లో ఈ సూక్ష్మ జీవుల పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే ఈ సూక్ష్మజీవులను సాధారణ కంటి చూపుతో నేరుగా చూడడం సాధ్యం కాదు. అందుకే కొన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఈ సూక్ష్మ జీవులను అధ్యయనం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అంశాలను బోధించే శాస్త్రమే మైక్రోబయాలజీ.
రీసెర్చ్ ఓరియెంటెడ్ సబ్జెక్:
మైక్రోబయాలజీని రీసెర్చ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌గా పేర్కొంటారు. మానవ, వక్షాలపై సూక్ష్మ జీవుల ప్రభావం, సంబంధిత విషయాల గురించి ఇందులో చర్చిస్తారు. అంతేకాకుండా వ్యవసాయ రంగం, సముద్ర పర్యావరణం, అహార సంబంధిత పరిశ్రమల్లో వివిధ రకాలుగా ఉపయోపడే సూక్ష్మ జీవుల గురించి కూడా ఈ శాస్త్రం చర్చిస్తుంది. ఈ రంగంలో నిపుణులైన వారిని ‘మైక్రోబయాలాజిస్ట్’లుగా వ్యవహరిస్తారు. ప్రధానంగా ఐదు రంగాల్లో మైక్రోబయాలాజిస్ట్‌లు పరిశోధనలు చేస్తుంటా రు. అవి..
మెడికల్ మైక్రోబయాలాజిస్ట్:
సూక్ష్మ జీవుల ద్వారా మానవులు, జంతువులకు సంక్రమించే వ్యాధులు, వాటి నిర్ధారణ, నివారణ, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధిత అంశాలపై వీరు పరిశోధనలు చేస్తుంటారు. వీరి పరిశోధనల ఆధారంగానే వైద్య నిపుణులు తగిన చికిత్స విధానాలను సూచిస్తారు. ప్రస్తుతం ఈ రంగంలో ఎయిడ్స్, తదితర ప్రాణాంతక వ్యాధులపై విస్తత స్థాయిలో పరిశోధనలు సాగుతున్నాయి.
అగ్రికల్చరల్ మైక్రోబయాలాజిస్ట్:
సూక్ష్మ జీవుల ద్వారా పంటలు, మొక్కలకు సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధిత అంశాలపై వీరు పరిశోధనలు చేస్తుంటారు. అంతేకాకుండా మెరుగైన వంగడాల ఉత్పత్తి దిశగా కూడా వీరి అధ్యయనం సాగుతుంది.
ఇండస్ట్రీయల్ బయాలాజిస్ట్‌లు:
పారిశ్రామిక రంగంలో.. బేవరేజెస్, అల్కాహాల్, అమైనో అమ్లాలు, విటమిన్-సి, యాంటీ బయాటిక్స్ వంటి వాటి ఉత్పాదనలో తోడ్పడే సూక్ష్మజీవులపై వీరు పరిశోధనలు చేస్తుంటారు.
మెరైన్ మైక్రోబయాలాజిస్ట్:
సముద్ర పర్యావరణం, సంబంధించిన సూక్ష్మజీవులపై మెరైన్ మైక్రోబయాలాజిస్ట్‌లు పరిశోధనలు చేస్తుంటారు.
జనరల్ మైక్రోబయాలాజిస్ట్:
సాధారణ జీవ శాస్త్రం, ఎకాలజీ, జీవక్రియ, జన్యు శాస్త్రం, శరీరధర్మ శాస్త్రానికి సంబంధించిన ఫండమెంటల్స్, సూక్ష్మజీవులపై వీరు అధ్యయనం చేస్తారు.
ప్రవేశం:
మైక్రోబయాలజీకి సంబంధించిన కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా మైక్రోబయాలాజిస్ట్‌లుగా కెరీర్ ప్రారంభించవచ్చు.
కోర్సులు:
మైక్రోబయాలజీకి సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయిలో కోర్సులో అందుబాటులో ఉన్నాయి. సైన్స్ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీలో ఒక ఆప్షన్‌గా మైక్రోబయాలజీ కోర్సును ఎంచుకోవచ్చు. తర్వాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలో మైక్రోబయాలజీ కోర్సును చదివే అవకాశం ఉంది. ఆసక్తిని బట్టి ఈ విభాగంలో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు.
స్పెషలైజేషన్స్:

- ఇండస్ట్రీయల్ మైక్రోబయాలజీ
- నానో మైక్రోబయాలజీ
- సెల్యూలర్ మైక్రోబయాలజీ
- అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ
- వెటర్నరీ మైక్రోబయాలజీ
- మైక్రోబియల్
- ఇవల్యూషనరీ మైక్రోబయాలజీ
- ఫార్మస్యుటికల్ మైక్రోబయాలజీ
- ఎన్విరాన్‌మెంటల్ మైక్రోబయాలజీ
- సాయిల్ మైక్రోబయాలజీ
- జనరేషన్ మైక్రోబయాలజీ
- మైక్రోబియల్ జెనెటిక్స్
- బ్యాక్టీరియాలజీ
- మైకాలజీ
- వైరాలజీ
మన రాష్ట్రంలో వివిధ కాంబినేషన్స్‌తో బీఎస్సీలో మైక్రోబయాలజీ కోర్సు అందుబాటులో ఉంది. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. సంబంధిత సమాచారాన్ని ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్స్ నుంచి పొందొచ్చు.
అవకాశాలు:
మైక్రోబయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, పరిశోధన సంస్థలు, వ్యవసాయ పరిశ్రమలు, ఫార్మస్యుటికల్, ఫుడ్, బేవరేజ్, ఎన్విరాన్‌మెంటల్ ఏజెన్సీలు, కెమికల్ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి. సొంతంగా డయాగ్నోస్టిక్ సెంటర్‌సను నిర్వహించుకోవచ్చు. ఆసక్తి ఉంటే మైక్రోబయాలజీ కోర్సును ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా కూడా స్థిర పడొచ్చు. అంతేకాకుండా బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2, బ్యాంకు, ఇతర ప్రభుత్వ, ప్రెవేట్ ఉద్యోగ నియామక పరీక్షలకు కూడా హాజరు కావచ్చు.
జాబ్ ప్రొఫైల్స్:

- బయో మెడికల్ సైంటిస్ట్
- బయో కెమిస్ట్
- అనాలిస్ట్
- మైక్రోబయాలాజిస్ట్
- ఇమ్యూనాలాజిస్ట్
- మైకాలాజిస్ట్
- బయో టెక్నాలాజిస్ట్
- వైరాలాజిస్ట్
- జెనెటిసిస్ట్
విదేశాల్లో కూడా:
మైక్రోబయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి విదేశాల్లో కూడా చక్కటి అవకాశాలు ఉంటున్నాయి. ఈ అవకాశాలను దక్కించుకోవాలంటే మాత్రం మైక్రోబయాలజీలో పీహెచ్‌డీ కోర్సును పూర్తి చేయాలి. తద్వారా వీరికి అక్కడి యూనివర్సిటీలు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, బయో సైన్స్ కంపెనీలు, ఫుడ్ బేవరేజెస్ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఉపాధి అవకాశాల దిశగా మైక్రోబయాలాజిస్ట్‌లకు చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి.
వేతనాలు:
ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే పీజీ డిగ్రీ ఉన్న అభ్యర్థికి ప్రారంభంలో నెలకు రూ. 20,000 తక్కువ కాకుండా వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, అర్హత ఆధారంగా నెలకు రూ. 30,000-60,000 వరకు స్వల్ప కాలంలో చేరుకోవచ్చు. విదేశాల్లోనైతే 30 వేల డాలర్ల నుంచి 70 వేల డాలర్ల వరకు పే-ప్యాకేజ్ లభిస్తుంది.
టాప్ ఇన్‌స్టిట్యూట్స్:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: https://www.osmania.ac.in/
జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)-పుదుచ్చేరి
వెబ్‌సైట్: https://www.jipmer.edu/
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: https://www.kakatiya.ac.in/
శ్రీ వేంకటేశ్వర యూనివ ర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ
వెబ్‌సైట్: https://amity.edu
బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
వెబ్‌సైట్: www.bhu.ac.in
విట్ స్కూల్ ఆఫ్ బయోసైన్స్-వెల్లూర్ (తమిళనాడు)
వెబ్‌సైట్: www.vit.ac.in

Published date : 01 Apr 2013 01:46PM