Skip to main content

Career Opportunities: కెరీర్‌కు లైఫ్‌లైన్...లైఫ్‌ సెన్సైస్ కోర్సులు

బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ... సంక్షిప్తంగా.. బీజెడ్‌సీ. ఇది బీఎస్సీ లైఫ్‌సెన్సైస్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్. బీజెడ్‌సీతో డిగ్రీ పూర్తిచేశాక ఉన్నత విద్య పరంగా ఉన్న అవకాశాలేంటి? సంప్రదాయ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులైన ఎంఎస్సీ బోటనీ, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ కెమిస్ట్రీలతో కెరీర్ మార్గాలు...
Career Opportunities For Life Science courses
Career Opportunities For Life Science courses

 తెలుగు రాష్ట్రాల్లో బీజెడ్‌సీ విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్న సరికొత్త స్పెషలైజేషన్లు, ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం...

పీజీ స్పెషలైజేషన్లు...
బీఎస్సీ బీజెడ్‌సీ విద్యార్థులకు పీజీలో దేశవ్యాప్తంగా అనేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలైన ఆంధ్రా, ఉస్మానియా తదితర వర్సిటీలు అందిస్తున్న స్పెషలైజేషన్లు.. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, బోటనీ, హ్యూమన్ జెనిటిక్స్, మైక్రోబయాలజీ, ఫిషరీస్, ఆంత్రోపాలజీ.
కెమిస్ట్రీ స్పెషలైజేషన్లు: అనలిటికల్ కెమిస్ట్రీ, బయోఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అండ్ అనాలసిస్ ఆఫ్ ఫుడ్‌‌స, డ్రగ్‌‌స అండ్ వాటర్ మెరైన్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ.

ఎంఎస్సీ బోటనీ :
వ్యవధి:
రెండేళ్లు.
అర్హత: బోటనీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత.
ఉన్నత విద్య: ఎంఎస్సీ బోటనీ తర్వాత అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు... ఎంఫిల్, పీహెచ్‌డీ.

ఎవరికి అనుకూలం?

  1. చుట్టూ ఉన్న పరిసరాలు, మొక్కలపై ఆసక్తి.. సమస్యలను పరిష్కరించడంలో విలక్షణత ప్రదర్శించేవారికి ఎంఎస్సీ బోటనీ చక్కగా సరిపోయే కోర్సు.
  2. శాస్త్రీయ పద్ధతులు, పరిశోధనలపై మక్కువున్న అభ్యర్థులు ఎంఎస్సీ బోటనీ వైపు దృష్టిసారించొచ్చు. చేస్తున్న పని పట్ల స్పష్టత, చక్కటి ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, ఎక్కువ గంటలు పనిచేసేందుకు అవసరమైన మానసిక సామర్థ్యం బోటనీ ఔత్సాహికులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు.
జాబ్ ప్రొఫైల్స్..
1. బోటనిస్ట్
2. బయోటెక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
3. టీచర్, లెక్చరర్, సైంటిస్ట్
4. ఆగ్రోనమిస్ట్
5. బయోటెక్నాలజిస్ట్
6. గ్రీన్‌హౌస్ మేనేజర్
7. ఫీల్డ్ అడ్వైజర్
8. సాయిల్ సైంటిస్ట్
9. బయోటెక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
10. కంటెంట్ అనలిస్ట్ (బోటనీ)
11. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
12. ఏరియా బిజినెస్ మేనేజర్-బయోప్రొడక్ట్స్
13. రీసెర్చ్ అసోసియేట్స్

ప్రథమ స్థానంలో బోధనా రంగం...
బోటనీని ప్లాంట్ సైన్స్ అని కూడా అంటారు. పీజీకి వచ్చేసరికి బోటనీ సబ్జెక్టు విస్తృతి పెరుగుతుంది. కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జువాలజీలతో పోల్చితే బోటనీలో ల్యాబ్‌వర్క్ తక్కువనే చెప్పొచ్చు. ఎంఎస్సీ బోటనీ కెరీర్ అవకాశాల పరంగా బోధనా రంగం ప్రథమ స్థానంలో నిలుస్తోంది. నర్సరీలు, పాలీ హౌస్‌లు, బొటానికల్ గార్డెన్స్లోనూ అవకాశాలు అందుకోవచ్చు. ఎంఎస్సీ అనంతరం పరిశోధన దిశగా ముందుకుసాగిన విద్యార్థు లు బోటనిస్‌్ధగా, ప్లాంట్ సైంటిస్ట్‌గా, ఫైటోల జిస్ట్‌లుగా స్థిరపడొచ్చు. ప్రస్తుతం భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా బోటనిస్టుల అవసరం మరింత పెరిగింది. పెరుగుతున్న జనాభాకు అను గుణంగా ఆహార ఉత్పత్తిలో బోటనీ కీలకపాత్ర పోషిస్తుంది. బోటనిస్టులు పరిశోధన ద్వారా నూ తన వంగడాలు సృష్టించి ఆహార భద్రత సాధించడంలో దోహదప డతారు. అదే సమయంలో సంప్రదాయ వంగడాలను కాపాడుకోవడంలోనూ బోటనీ పాత్ర కీలకం.
- డా. రమాదేవి, హెడ్, బోటనీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సెన్సైస్, సైఫాబాద్.

ఎంఎస్సీ జువాలజీ :
వ్యవధి: రెండేళ్లు.
అర్హత
: జువాలజీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత.
ఉన్నత విద్య: ఎంఎస్సీ జువాలజీ పూర్తయ్యాక.. ఎంఫిల్, పీహెచ్‌డీల్లో చేరొచ్చు.

ఎవరికి అనుకూలం?
  1. మూగ జీవుల పట్ల ప్రేమ ఉండాలి. జంతువుల ప్రవర్తనను తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలి.
  2. చరాచర జీవరాసులపై ఆసక్తితోపాటు వాటి గురించి తెలుసుకోవాలి, వాటి సమస్యలు పరిష్కరించాలి అనే దృక్పథం చాలా అవసరం.
  3. జీవులు, వాటి పరిసరాలకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకునే మనసుండాలి.
  4. సైంటిఫిక్ డేటాను అవగాహన చేసుకొని విశ్లేషించగలిగే నైపుణ్యాలు ఉండాలి.
  5. నివేదికల సమర్పణ, పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనలో రాత నైపుణ్యం, రీసెర్చ్‌లో గుర్తించిన అంశాలను స్పష్టంగా చెప్పగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి అభ్యర్థులకు అదనపు అర్హతలు.
జాబ్ ప్రొఫైల్స్..
1. వైల్డ్ లైఫ్ రిహాబిలిటేటర్
2. ఎన్విరాన్‌మెంటల్ కన్సల్టెంట్
3. జువాలజీ టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్
4. సైన్స్ జర్నలిస్ట్
5. కన్జర్వేషనిస్ట్
6. జూ కీపర్
7. వైల్డ్ లైఫ్ ఎడ్యుకేటర్
8. బయలాజికల్ లాబొరేటరీ టెక్నీషియన్
9. రీసెర్చ్ అసోసియేట్
10. రీసెర్చ్ సైంటిస్ట్

పరిశోధనల దిశగా వెళ్లొచ్చు..
ఎంఎస్సీ జువాలజీ విద్యార్థులు... జంతువుల శరీర నిర్మాణం, వర్గీకరణ, వ్యాధులు తదితరాల గురించి లోతైన అవగాహన పెంచుకుంటారు. జువాలజీని ‘యానిమల్ బయాలజీ’ అని కూడా అంటారు. ఎంఎస్సీ జువాలజీ కోర్సులో... జీవుల ఆవిర్భావం, నిర్మాణం, పిండోత్పత్తి, ప్రత్యుత్పత్తి, అలవాట్లు, వర్గీకరణ, వ్యాధుల గురించి బోధిస్తారు. దీంతోపాటు జువాలజీలో జీవించి ఉన్న, అంతరించిపోయిన జీవులకు.. జీవులకు, పర్యావరణానికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తారు. అభ్యర్థులు ఎంఎస్సీలో వైరాలజీ వంటి స్పెషలైజేషన్లను ఎంచుకుంటే.. పరిశోధనల వైపు వెళ్లొచ్చు. ప్రస్తుతం బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వంటి కొత్త స్పెషలైజేషన్ల వైపు విద్యార్థులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. బోధనా వృత్తిపై ఆసక్తి ఉన్నవారు ఎక్కవగా జువాలజీని ఎంచుకుంటున్నారు. పరిశోధనలు, ల్యాబ్ వర్క్‌పై ఇష్టముంటే జువాలజీని ఎంచుకోవడం లాభిస్తుంది.
- డా. రాధాకృష్ణ, హెడ్, జువాలజీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సెన్సైస్, సైఫాబాద్.

ఎంఎస్సీ కెమిస్ట్రీ :
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత.
ఉన్నత విద్య: ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తయ్యాక ఉన్నతవిద్యపై ఆసక్తి ఉంటే.. ఎంఫిల్, పీహెచ్‌డీల్లో చేరొచ్చు.

ఎవరికి అనుకూలం?
రసాయనాలు, వాటి విశ్లేషణ, సమస్యా పరిష్కారంపై ఆసక్తి ఉన్న వారు ఎంఎస్సీ కెమిస్ట్రీలో చేరొచ్చు. వీటితోపాటు కెమిస్ట్రీలో కెరీర్ దిశగా అడుగులు వేసేవారికి పరిశీలన, అధ్యయనం తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. అందుబాటులో ఉన్న తక్కువ సమాచారం నుంచి ఉత్తమ ఫలితాలను రాబట్టగలిగే నేర్పు ఉండాలి. పరిశోధనల పట్ల ఆసక్తితోపాటు అధిక సమయం కేటాయించగలిగే సహనమున్న వారికి కెమిస్ట్రీ సరైన ఎంపిక. దాంతోపాటు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలుంటే నివేదికలు రూపొందించడంలో లాభిస్తుంది.

జాబ్ ప్రొఫైల్స్...
1. కెమిస్ట్/జూనియర్ సైంటిస్ట్
2. కెమిస్ట్రీ టీచర్
3. ఆన్‌లైన్ కెమిస్ట్రీ ట్యూటర్
4. సైంటిస్ట్-సింథటిక్ ల్యాబ్ (కంప్యుటేషనల్ కెమిస్ట్రీ)
5. కెమిస్ట్రీ-కంటెంట్ డెవలపర్
6. కెమిస్ట్రీ రీసెర్చ్ ఆఫీసర్
7. కెమిస్ట్రీ లెక్చరర్/అసిస్టెంట్/అసోసియేట్ ప్రొఫెసర్
8. సోయిల్ కెమిస్ట్రీ, ఫెర్టిలిటీ, మైక్రోబయాలజీ సైంటిస్ట్

కెమిస్ట్రీ.. ఎవర్‌గ్రీన్
ఎంఎస్సీ కెమిస్ట్రీలో భాగంగా విద్యార్థులు ప్రాథమికంగా పదార్థాల సంఘటనం, నిర్మాణం, ధర్మాలు, రసాయన చర్యల గురించి అధ్యయనం చేస్తారు. బీజెడ్‌సీ చదివినవారు ఎంఎస్సీ కెమిస్ట్రీలో రాణించలేరనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది వాస్తవం కాదు. ఒక్క ఫిజికల్ కెమిస్ట్రీ తప్ప, మరే ఇతర స్పెషలైజేషన్‌లోనూ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఇబ్బంది ఉండదు. బోధనా రంగంతోపాటు ఫార్మాస్యూటికల్స్, కెమికల్ ఇండస్ట్రీల్లో ఉపాధి పొందొచ్చు. ఔషధాల తయారీలో 90 శాతం పాత్ర కెమిస్ట్‌లదే. కాబట్టి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తే.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో కెమిస్ట్/జూనియర్ సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. జూనియర్ కెమిస్ట్‌ల ప్రారంభ వేతనం రూ.20వేల నుంచి రూ.25 వేలుగా ఉంటుంది.
- డా. జలపతి, హెడ్, కెమిస్ట్రీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సెన్సైస్, సైఫాబాద్.
 
చ‌ద‌వండి: Life Sciences
Published date : 04 Feb 2022 04:25PM

Photo Stories