Skip to main content

TS EDCET 2022: టీచింగ్‌ కెరీర్‌కు దారి.. ఎడ్‌సెట్‌

TS EdCET 2022 notification

డిగ్రీ పూర్తి చేసి.. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలనుకునే వారికి మార్గం.. బీఈడీ(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌). ఈ కోర్సులో ప్రవేశం పొందేందుకు ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌)లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌ 2022 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ ఎడ్‌సెట్‌ దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణపై ప్రత్యేక కథనం..

టీచర్లుగా రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సు..బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ). రెండేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో (ఎడ్‌సెట్‌) అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలోని బీఈడీ కళాశాల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యమండలి.. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తోంది.

అర్హతలు

  • ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ(బీఏ/బీఎస్సీ/బీఎస్సీ (హోంసైన్స్‌)/బీకాం/బీసీఏ/బీబీఎం లేదా మాస్టర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే బ్యాచిలర్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీలో మ్యాథ్స్, సైన్స్‌లతో 55శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
  • ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులే.
  • ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్‌ బీఎస్సీ వంటి కోర్సులు చదివిన వారు అనర్హులు. 
  • వయసు: 01 జూలై  2022 నాటికి కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

AP Ed CET 2022: ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు..

పరీక్ష విధానం

  • ఎడ్‌సెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–సీబీటీ) విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ఇందులో సబ్జెక్ట్‌ కంటెంట్, టీచింగ్‌ అప్టిట్యూడ్, జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ అనే ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • సబ్జెక్ట్‌ కంటెంట్‌: ఈ విభాగం నుంచి 60 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఇందులో మ్యాథమెటిక్స్‌ నుంచి 20, సైన్స్‌–20, సోషల్‌ స్టడీస్‌ నుంచి 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 
  • టీచింగ్‌ అప్టిట్యూడ్‌: ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. టీచింగ్‌ లెర్నింగ్‌ ప్రాసెస్, క్లాస్‌ రూం మేనేజ్‌మెంట్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
  • జనరల్‌ ఇంగ్లిష్‌: ఈ విభాగం నుంచి కూడా 20 ప్రశ్నలు వస్తాయి. ఇందులో రీడింగ్‌ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్‌ ఎర్రర్స్, వొకాబ్యులరీ, ఎర్రర్‌ డిటెక్షన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌: ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ముఖ్యంగా అభ్యర్థులకు సమాజం పట్ల ఉన్న అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అలాగే దేశ చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక అంశాలు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తదితర అంశాలు, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
  • కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలుంటాయి. అభ్యర్థులకు ఉన్న కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పరిక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్,ఇంటర్నెట్, మెమొరీ, నెట్‌వర్కింగ్, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్, యాంటీ వైరస్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ప్రిపరేషన్‌ ఇలా

  • ప్రిపరేషన్‌ మొదలు పెట్టే ముందు పరీక్ష విధానం, సిలబస్‌ గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. సిలబస్‌ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.
  • పరీక్ష ప్రిపరేషన్‌కి టైమ్‌ టేబుల్‌ చాలా ముఖ్యం. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఒక టైం టేబుల్‌ను తయారు చేసుకోవాలి. తొలుత కష్టమైన అంశాలపై దృష్టి పెట్టాలి. ఆపై సులభమైన అంశాలను చదివే విధంగా ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి.
  • రివిజన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా ఒక సబ్జెక్టు పూర్తయిన తర్వాత మళ్లీ మళ్లీ రివిజన్‌ చేస్తుండాలి.

పరీక్ష కేంద్రాలు

తెలంగాణలోని 11 ప్రాంతీయ కేంద్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కర్నూలు కేంద్రాల్లో టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తులకు చివరి తేదీ: 15.06.2022
  • ఎడ్‌సెట్‌ సీబీటీ పరీక్ష తేదీ: 2022 జులై 26,27
  • వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in

TS LAWCET 2022: టీఎస్‌ లాసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక ప్రక్రియ ఇలా..

Last Date

Photo Stories