Skip to main content

TS DEECET 2023 Notification: రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌.. 2023–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(డీఈఈసెట్‌)–2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఈఈసెట్‌ ర్యాంకు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ ఎలిమెంటరీ టీచ­ర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (మైనారిటీ, నాన్‌ మైనారిటీతో సహా)లో ప్రవేశాలు కల్పిస్తారు.
TS DEECET 2023 Notification

కోర్సులు
డీఈఎల్‌ఈడీ(డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌); డీపీఎస్‌ఈ(డిప్లొమా ఇన్‌ ప్రీ–స్కూల్‌ ఎడ్యుకేషన్‌).
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కనిష్టంగా సెప్టెంబర్‌ 1నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: డీఈఈ సెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.05.2023
హాల్‌టిక్కెట్ల జారీ తేది: 27.05.2023.
ప్రవేశ పరీక్ష తేది: 01.06.2023.

వెబ్‌సైట్‌: http://deecet.cdse.telangana.gov.in/

IISER Aptitude Test (IAT)2023 Notification: బీఎస్, బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా..

Last Date

Photo Stories