Skip to main content

Admissions in TMREIS: తెలంగాణ మైనారిటీ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతి, ఇంటర్‌ ప్రవేశాలు.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్‌).. రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ పాఠశాలలు, జూనియ­ర్‌ కళాశాలలు, సీవోఈ (సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌) కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు.
Apply for Admission in TMREIS Minority Colleges   TMREIS 2024-25 Academic Year Admissions Open  Admissions in TMREIS    Junior Colleges and CVOE Admissions in Telangana   Apply Now for 2024-25 Academic Year in TMREIS

ప్రవేశాల వివరాలు
ఐదో తరగతి: మైనారిటీలకైతే ముందొచ్చిన వారికి సీట్లు ఇస్తారు. ఇతరులకు లక్కీ డ్రా ద్వారా సీట్లు కేటాయిస్తారు.
6, 7, 8 తరగతులు(ఖాళీలుంటేనే): మొదట దరఖాస్తు చేసుకున్న వారికి సీట్లు కేటాయిస్తారు.
ఇంటర్‌ ఫస్టియర్‌(జనరల్, ఒకేషనల్‌): పదో తరగతిలో మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఇంటర్‌: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
అర్హత: తరగతిని అనుసరించి 4, 5, 6, 7,10 వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు.

చదవండి: TS Gurukulam Schools: తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.02.2024.
అభ్యర్థుల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన ఐదు నుంచి ఎనిమిదో తరగతులకు: 24.04.2024 నుంచి 30.04.2024 వరకు.
ఇంటర్మీడియట్‌కు: 01.05.2024 నుంచి 10.05.2024 వరకు
ప్రవేశ పరీక్ష తేది: 25.02.2024.

వెబ్‌సైట్‌: https://cet.cgg.gov.in/

Last Date

Photo Stories