Admissions in Telangana Model Schools: ఆరు నుంచి పదో తరగతిలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఆరు నుంచి పదో తరగతి ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
ప్రవేశాల వివరాలు: తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్–2024.
అర్హత: అడ్మిషన్ పొందాలనుకున్న విద్యార్థి 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధిత తరగతికి కింది స్థాయి తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: 31.08.2024 నాటికి ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి పదకొండేళ్లు, ఎనిమిదో తరగతికి పన్నెండేళ్లు, తొమ్మిదో తరగతికి పదమూడేళ్లు, పదో తరగతికి పద్నాలుగేళ్లు నిండాలి.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ఇంగ్లిష్/తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.02.2024.
ప్రవేశ పరీక్ష తేది: 07.04.2024.
వెబ్‌సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in/
Last Date
Tags
- admissions
- TS Model Schools
- ts model schools 6th to 10 class admission notification 2024
- ts model schools admission 2024
- TS Model School Admissions 2024
- english medium
- entrance test
- Competitive Exams
- Free training
- Telangana Model Schools Entrance Test 2024
- Telangana
- SchoolAdmissions
- EducationInTelangana
- TelanganaEducation
- EntranceTest
- sakshi education latest admissions