Inter Admissions in TTWREIS: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం సీట్ల సంఖ్య: 1140(బాలురు–660, బాలికలు–480).
గ్రూపులు: ఎంపీసీ(575 సీట్లు), బైపీసీ(565 సీట్లు).
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.
రిజర్వేషన్: అన్ని సీట్లు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు.
అర్హత: మార్చి–2024లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: విద్యార్థుల వయస్సు 31.08.2024 నాటికి 19 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: లెవల్ 1, 2 స్క్రీనింగ్ టెస్టులు, దరఖాస్తులో విద్యార్థి ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: లెవల్–1 స్క్రీనింగ్ పరీక్ష ఓఎమ్మార్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత వి«ధిస్తారు. ఎంపీసీ–ఇంగ్లిష్(20 మార్కులు), మ్యాథ్స్(60 మార్కులు), ఫిజిక్స్(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు) సబ్జెక్టుల్లో; బైపీసీ ఇంగ్లిష్ (20 మార్కులు), మ్యాథ్స్(20 మార్కులు), ఫిజిక్స్(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు), బయాలజీ(40 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.02.2024
లెవల్–1 స్క్రీనింగ్ పరీక్ష తేది: 18.02.2024.
లెవల్–2 స్క్రీనింగ్ పరీక్ష తేది: 10.03.2024.
వెబ్‌సైట్: https://ttwreiscoe.cgg.gov.in/
Tags
- admissions
- Inter Admissions
- Inter Admissions in TTWREIS
- Admissions in Intermediate
- Intermediate
- Telangana Tribal Welfare Gurukulam Colleges
- Center of Excellence
- Common Entrance Test
- entrance test
- Inter Free Education
- screening tests
- Tribal students
- Admissions process
- Educational Opportunity
- sakshi education latest admissions