Skip to main content

TS Gurukulam Schools: తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

మహాత్మా జ్యోతిబాఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ గురుకుల పాఠశాలల్లో.. 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన తెలంగాణకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, అనాథ బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
MJPBCW BACKLOG VI-VIII CLASS 2024 BC, SC, ST, EBC, Orphan Girls Eligibility Criteria   Telangana Gurukula Vidyalayas Academic Year 2024-25   Telangana Gurukula Vidyalayas Admission Poster 2024-25

అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 లేదా 2023-24లో విద్య­ను అభ్యసించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000కు మించకూడదు.
వయసు: 31.08.2024 నాటికి ఆరో తరగతికి పన్నెండేళ్లు, ఏడో తరగతికి పదమూడేళ్లు, ఎనిమిదో తరగతికి పద్నాలుగేళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ తేది: 23.02.2024
ప్రవేశ పరీక్ష తేది: 03.03.2024.
అడ్మిషన్‌ ప్రక్రియ ముగింపుతేది: 31.07.2024

వెబ్‌సైట్‌: https://mjpabcwreis.cgg.gov.in/

చదవండి: Admission in 5th class: తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు.. ప్రవేశ పరీక్ష ఇలా‌..

Last Date

Photo Stories