Skip to main content

JEST 2024: ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫిజిక్స్‌ కోర్సులు.. పరీక్ష తేదీ ఇదే..

JEST 2024 Exam Dates Schedule    JEST admission notice on a university website
  • పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు 
  • స్టైపెండ్‌ అందుకునే అవకాశం

ఉజ్వల కెరీర్‌ అవకాశాలను అందించే సబ్జెక్టుల్లో ఫిజిక్స్‌ ఒకటి. ఈ సబ్జెక్టుపై ఆసక్తి ఉండి, రాణించాలనుకునే వారికి దేశంలోని పలు ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నత విద్య కోర్సులను అందిస్తున్నాయి. ఇందుకోసం జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌)ను నిర్వహించి.. అర్హత సాధించిన వారికి పోస్ట్‌గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జెస్ట్‌ 2024 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో... ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం.. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలకు ఫిజిక్స్‌ ఎంతో కీలకం. ఈ సబ్జెక్టుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ విద్యాసంస్థలు జెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా ఫిజిక్స్, అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తునాయి.

స్టైపెండ్‌
ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రతినెల స్టైపెండ్‌ కూడా అందుతుంది. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.12వేలు చొప్పున రెండేళ్లపాటు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. అనంతరం జేఆర్‌ఎఫ్‌లో భాగంగా నెలకు రూ.37 వేలు, ఎస్‌ఆర్‌ఎఫ్‌ స్థాయిలో రూ.42వేలు చొప్పున చెల్లిస్తారు. నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందిన వారు మొదటి రెండేళ్లు రూ.37 వేలు, ఆ తర్వాత రెండేళ్లు రూ.42 వేలు అందుకోవచ్చు. వీటితోపాటు ఉచిత వసతి లేదా స్టైపెండ్‌లో 30శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

చదవండి: PhD Admission in IIM Tiruchirappalli: ఐఐఎం తిరుచిరాపల్లిలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. చివ‌రి తేదీ ఇదే..

కోర్సులు ఇవే
ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్, అట్మాస్ఫిరిక్‌ ఫిజిక్స్, స్పేస్‌ అండ్‌ అట్మాస్ఫిరిక్‌ సైన్సెస్, బయో ఫిజిక్స్, కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ నెట్‌ వర్క్స్, కండెన్సెడ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్, క్వాంటమ్‌ ఫిజక్స్‌ అండ్‌ క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్, న్యూక్లియర్‌ అండ్‌ రేడియేషన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్‌ అండ్‌ అటామిక్‌ ఫిజిక్స్, హైఎనర్జీ ఫిజిక్స్, బయో ఫిజిక్స్‌.. ఇలా పలు ఫిజిక్స్‌ స్పెషలైజేషన్లతో.. ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌/ఎమ్మెస్సీ/ఎంటెక్‌-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.

అర్హతలు

  • ఫిజిక్స్‌ పీహెచ్‌డీ కోర్సులకు: ఎమ్మెస్సీలో ఫిజిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఫిజిక్స్‌ సంబంధిత విభాగాల్లో ఏదైనా పీజీ, ఎంటెక్‌తో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పలు సంస్థలు బీఈ/బీటెక్‌ వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. 
  • ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌-ఎమ్మెస్సీ/ఎంటెక్‌ పీహెచ్‌డీ: బీఎస్సీ ఫిజిక్స్‌ ఉత్తీర్ణతతో ఈ కోర్సుల్లో చేరవచ్చు. కొన్ని సంస్థలు గ్రాడ్యుయేషన్‌లో మ్యాథ్స్, ఇంజనీరింగ్‌ చదివిన వారిని కూడా చేర్చుకుంటున్నాయి. 
  • థియరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌: కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్‌ లేదా ఎంసీఏ చదివుండాలి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్స్‌స్‌లో ఈ కోర్సు ఉంది.

వంద మార్కులకు పరీక్ష
జెస్ట్‌ పరీక్షను వంద మార్కులకు 3 గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక విభాగంలో 15 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మరో విభాగంలో 10 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. నెగిటివ్‌ మార్కులు లేవు. ఇంకో విభాగం నుంచి 25 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ఉంటాయి. తప్పు సమాధానానికి మూడోవంతు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఫిజిక్స్‌ లేదా థియరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ రెండింటిలో ఏదో ఒక పేపరే రాయడానికి వీలుంది. పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలకు ఒకటే ప్రశ్నపత్రం ఉంటుంది.

కోర్సులను ఆఫర్‌ చేసే సంస్థలు
ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్, నైనిటాల్‌; బోస్‌ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా; హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, ముంబయి; ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరిటికల్‌ సైన్సెస్‌(ఐసీటీఆర్‌-టీఐఎఫ్‌ఆర్‌), బెంగళూరు; హరీష్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, అలహాబాద్‌; ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్, కల్పక్కం; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐఐఎ), బెంగళూరు; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌(ఐఐఎస్సీ), చెన్నై; ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రీసెర్చ్‌(ఐపీఆర్‌), గాంధీనగర్‌; ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐయూసీఏఏ), పుణె; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ), బెంగళూరు; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌)-భోపాల్‌; బరంపూర్, కోల్‌కతా, మొహాలి,పుణె,తిరువనంతపురం, తిరుపతి; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ), తిరువనంతపురం.

చదవండి: CUET PG 2024 Notification: కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ) పీజీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ పరీక్ష

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 24, 2024
  • పరీక్ష తేదీ: మార్చి 03, 2024 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
  • వెబ్‌సైట్‌: https://www.jest.org.in/
Last Date

Photo Stories