Skip to main content

AP EAPCET 2023: ఏపీ ఈఏపీసెట్‌-2023 నోటిఫికేషన్‌ వివరాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (ఏపీ ఈఏపీసెట్‌) నోటిఫికేషన్‌ను ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ అనంతపురం (జేఎన్‌టీయూఏ) నిర్వహించనుంది. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కళాశాలల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ /హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
AP EAPCET 2023 Notification

కోర్సుల వివరాలు

  • ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ); బీఎస్సీ(అగ్రికల్చర్‌), బీఎస్సీ(హార్టికల్చర్‌), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ; బీఫార్మసీ, ఫార్మ్‌-డి.
  • అర్హత: కనీసం 45 శాతం మార్కుల(రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం)తో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/బైపీసీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల అభ్యర్థులు 31.12.2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ఫార్మ్‌-డి కోర్సు: 31.12.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
  • పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, తెలుగు మీడియంలో ప్రశ్నలు ఉంటాయి.

Also Read: EAPCET(EAMCET) - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణ: మార్చి11 నుంచి ఏప్రిల్‌ 15 వరకు.
  • రూ.500 నుంచి రూ.10,000 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీ: ఏప్రిల్‌ 30 నుంచి మే 14 వరకు.
  • దరఖాస్తుల  తప్పుల సవరణ: మే 4 నుంచి 6 వరకు;
  • వెబ్‌సైట్‌లో హాల్‌టెకెట్లు: మే 09 నుంచి 
  • ప్రవేశ పరీక్షలు: మే 15  నుంచి మే 18 తేదీల్లో ఇంజనీరింగ్‌; మే 22 నుంచి 23 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ.
  • వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in

TS EAMCET 2023: టీఎస్‌ ఎంసెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష వివరాలు ఇవే..

Last Date

Photo Stories