Skip to main content

TS EAMCET 2023: టీఎస్‌ ఎంసెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష వివరాలు ఇవే..

తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023(ఎంసెట్‌) ప్రకటనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ (జేఎన్‌టీయూఎహెచ్‌) నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 03 నుంచి ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మే 7 నుంచి 11 వరకు పరీక్ష జరగనుంది.
ts eamcet 2023 notification

పరీక్ష వివరాలు
తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -2023(ఎంసెట్‌).

కోర్సుల వివరాలు
బీఈ, బీటెక్‌/బీటెక్‌(బయోటెక్నాలజీ)/ బీటెక్‌ (డెయిరీ టెక్నాలజీ)/బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌)/ బీఫార్మసీ/ బీటెక్‌(ఫుడ్‌టెక్నాలజీ)/బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌/ బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌/ బీఎస్సీ(ఫారెస్ట్రీ)/ బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ /బీఎఫ్‌ఎస్సీ. వీటితోపాటు ఫార్మ్‌-డి, బీఎస్సీ నర్సింగ్‌కు కూడా ఎంసెట్‌ ద్వారానే అడ్మిషన్‌ కల్పిస్తారు.

Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

అర్హత
ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం పరీక్ష రాయాల్సి ఉంటుంది.

EAMCET 2023: దరఖాస్తుల స్వీకరణ.. ఈసారి వీరు కూడా ఎంసెట్‌ రాయడం తప్పనిసరి..

పరీక్ష కేంద్రాలు
ఎంసెట్‌ నిర్వహణ తెలంగాణలో 16 పరీక్ష జోన్లు ఏర్పాటు చేశారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తులకు చివరి తేదీ: 10.04.2023 
  • ఎడిట్‌ ఆప్షన్‌: 2023 ఏప్రిల్‌ 12 -14 తేదీవరకు
  • రూ.250-5వేల ఫైన్‌తో దరఖాస్తుకు చివరి తేదీ: 2023 ఏప్రిల్‌ 15 నుంచి మే 02 తేదీ వరకు
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 ఏప్రిల్‌ 30 నుంచి
  • ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష: 2023 మే 7,8,9 తేదీల్లో
  • ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్ష: 2023 మే 10, 11 తేదీల్లో
  • వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in/
Last Date

Photo Stories