EAMCET 2023: దరఖాస్తుల స్వీకరణ.. ఈసారి వీరు కూడా ఎంసెట్ రాయడం తప్పనిసరి..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మే 7 నుంచి జరగనున్న తెలంగాణ ఎంసెట్‌కు మార్చి 3 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న, ఇప్పటికే ఇంటర్ పూర్తయినవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చు. ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: ఎంసెట్ - న్యూస్ గైడెన్స్ గెస్ట్ కాలమ్
ఈసారి నర్సింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులు కూడా ఎంసెట్ రాయడం తప్పనిసరి. అభ్యర్థులు ఎంసెట్ విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే పద్ధతి, ఫీజు చెల్లింపు, లాగిన్ పాస్‌వర్డ్‌కు https:// eamcet. tsche.ac.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని కన్వీనర్ డీన్ కుమార్ సూచించారు.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
Published date : 03 Mar 2023 12:58PM