BRAOU Admission 2024: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో బీఈడీ ఓడీఎల్ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ఓడీఎల్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతోపాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తిచేసి ఉండాలి.
కోర్సు వ్యవ«ధి: రెండేళ్లు. బోధనా మాధ్యమం: తెలుగు.
వయసు: అభ్యర్థి 01.07.2023 నాటికి 21 ఏళ్లు పూర్తిచేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.02.2024
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 26.02.2024.
ప్రవేశ పరీక్ష తేది: 05.03.2024.
వెబ్‌సైట్: https://www.braou.ac.in/
చదవండి: Admissions in JNTU: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
Last Date