AP Agri Polycet 2022: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ).. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య విభాగాలకు చెందిన వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అగ్రి పాలిసెట్–2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు/మూడేళ్లు
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 2022 మే నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరైనవారు, పదో తర గతి కంపార్ట్‌మెంటల్/ఇంటర్మీడియట్ ఫెయిల్/మధ్యలో ఆపేసిన వారు కూడా అర్హులే. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు మాత్రం అర్హులు కాదు.
వయసు: 15 నుంచి 22ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పాలిసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:01.06.2022
అగ్రి పాలిసెట్–2022 పరీక్ష తేది:01.07.2022
వెబ్‌సైట్: https://angrau.ac.in
చదవండి: AP ICET 2022: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్