Skip to main content

AP ICET 2022: ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు..

ap icet 2022 notification

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి.. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఐసెట్‌) ద్వారా ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహిస్తోంది.

అర్హత: మూడేళ్ల డిగ్రీ కోర్సు(10+2+3) ఉత్తీర్ణులవ్వాలి. ఎంసీఏకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌/డిగ్రీ స్థాయిలో మ్యాథమేటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది:12.05.2022
దరఖాస్తులకు చివరితేది: 10.06.2022
పరీక్ష తేది: 2022 జూలై 25

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in

Last Date

Photo Stories