AP ICET 2023 Notification: ఏపీ ఐసెట్-2023 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ ఐసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్‌కేయూ) నిర్వహించనుంది. ఏపీఐసెట్‌లో ర్యాంకు ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
AP ICET Mock Counselling
TS ICET Mock Counselling
కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)/మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ).
అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ( కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయసు పరిమితి లేదు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 20న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై ఏప్రిల్ 19తో ముగుస్తుంది.
- పరీక్షల తేది: మే 24, 25 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in
AP EAPCET 2023: ఏపీ ఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ వివరాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Last Date